మోడీని చంపేస్తాం: సోషల్ మీడియాలో ఆడియో వైరల్

మోడీని చంపేస్తాం: సోషల్ మీడియాలో ఆడియో వైరల్

కోయంబత్తూర్: 1998 వరుస పేలుళ్ల కేసులో శిక్ష అనుభవించిన మొహమ్మద్ రఫీక్ ను కోయంబత్తూర్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేసే పథకం ఉందంటూ అతను జరిపిన టెలిఫోన్ సంభాషణ వెలుగు చూసింది. అతను చేసిన సంభాషణ రికార్డై సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆ స్థితిలో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఎనిమిది నిమిషాల పాటు 1998 పేలుళ్ల కేసులో జైలు జీవితం పూర్తి చేసుకున్న మొహమ్మద్ రఫీక్ కు, ట్రాన్స్ పోర్టు కాంట్రాక్టర్ ప్రకాశ్ కు మధ్య జరిగిన సంభాషణల ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

వాహనాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ప్రధానంగా ఆ సంభాషణ జరిగింది. ఎల్కె అద్వానీ కోయంబత్తూర్ వచ్చినప్పుడు 1998లో తామే బాంబులు పెట్టామని, అలాగే ప్రధాని మోడీని హత్య చేయాలనుకుంటున్నామని అకస్మాత్తుగా రఫీక్ వెల్లడించిన విషయం వెలుగు చూసింది. 

కోయంబత్తూర్ లో 1998 ఫిబ్రవరిలో వరుసగా బాంబు పేలుళ్లు సంభవించి 58 మంది మరణించారు. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. తనపై చాలా కేసులు ఉన్నాయని, తాను 100కు పైగా వాహనాలను ధ్వంసం చేశానని కాంట్రాక్టర్ తో అతను చెప్పిన విషయం కూడా రికార్డయింది. 

రికార్డు అయిన సంభాషణలపై, ఆ సంభాషణలు జరిపిన వ్యక్తిని ధృవీకరించడానికి దర్యాప్తునకు కోయంబత్తూర్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆ సంభాషణల ఆధారంగా మొహమ్మద్ రఫీక్ ను పోలీసులు అరెస్టు చేశారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page