ఇంట్లోకి చొరబడి గ్యాంగ్ రేప్ చేసి నిప్పంటించి అమ్మాయిని చంపారు

15-year-old girl torched alive after gangrape
Highlights

మధ్యప్రదేశ్ లో అత్యంత దారుణమైన కీచకపర్వం చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు ఇంట్లోకి చొరబడి 15 బాలికపై అత్యాచారం చేసి, ఆ తర్వాత నిప్పు పెట్టి ఆమెను చంపేశారు. 

భోపాల్: బాలికలపై అత్యాచారాలు ఆగడం లేదు. రోజు రోజుకూ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో అత్యంత దారుణమైన కీచకపర్వం చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు ఇంట్లోకి చొరబడి 15 బాలికపై అత్యాచారం చేసి, ఆ తర్వాత నిప్పు పెట్టి ఆమెను చంపేశారు. 

ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ జిల్లా ఝఝర్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. నిందితులు అదే గ్రామానికి చెందినవారు. కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు బాలిక కాలిన మృతదేహాన్ని శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. 

నిందితులు రవింద్ర కుమార్, భగత్ ఇంట్లోకి చొరబడి బాలికపై అత్యాచారం చేసి, ఆ తర్వాత నిప్పు పెట్టి కాల్చి చంపారని పోలీసులు తెలిపారు. నేరం చేసిన తర్వాత పారిపోతూ వారు బాలిక సోదరుడి కంట పడ్డారు. 

పోలీసులకు విషయం చెప్తే చంపేస్తామని బెదిరించారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చేపట్టనున్నట్లు మధ్యప్రదేశ్ హోం మంత్రి భూపేంద్ర సింగ్ చెప్పారు.

loader