‘నా కూతురు ఇప్పుడు సంతోష పడుతుంది’

"My Daughter Is Happy Today": Rape Survivor's Father On Asaram Verdict
Highlights

ఐదేళ్లగా న్యాయం కోసం పోరాడుతున్న బాధితురాలు

తనను తాను దేవుడిగా చెప్పుకునే ఆశారాం బాపుకి బుధవారం న్యాయస్థానంలో చుక్కెదురైంది.  అత్యాచార కేసులో ఆయనను ధోషిగా ప్రకటిస్తూ న్యాయస్థానం  తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. జోధ్ పూర్ కోర్టు ఇచ్చిన తీర్పుకు బాధితురాలి తండ్రి ఆనందం వ్యక్తం చేశారు.కోర్టు తీర్పు అనంతరం  బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. ‘ నా కూతురు ఇప్పుడు సంతోషిస్తుంది’ అని మీడియాతో తెలిపారు. 

2013 ఆగస్టులో ఆశారాం బాపుపై అత్యాచార ఆరోపణలు చేసిన షాజహాన్‌పూర్‌కు చెందిన బాధితురాలి కుటుంబం మొత్తం మొదట్లో ఆయన భక్తులే. 'పవిత్రమైన విద్య' లభిస్తుందనే నమ్మకంతో ఇద్దరు పిల్లలను ఆయన చింద్వాడా ఆశ్రమానికి పంపారు. 2013, ఆగస్టు 7న బాధితురాలి తండ్రికి 16 ఏళ్ల కూతురు అనారోగ్యంతో ఉన్నట్లు ఫోన్ వచ్చింది.

బాధితురాలి తల్లిదండ్రులు మరుసటిరోజు చింద్వాడా చేరుకున్నపుడు, ఆయన కుమార్తెకు దయ్యం పట్టిందని, వాటిని ఆశారాం బాపు బాగు చేస్తారని తెలిపారు. ఆగస్టు 14న బాధితురాలి కుటుంబం ఆశారాంను కలిసేందుకు జోధ్‌పూర్‌కు వెళ్లింది. కాగా..జబ్బు నయం చేస్తాననే నెపంతో ఆశారాం బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

బాధితులు పోలీసులను ఆశ్రయించారు. గత ఐదేళ్లుగా బాధిత కుటుంబం న్యాయపోరాటం సాగించింది. కేసు విత్ డ్రా చేసుకోవాలంటూ బాధితురాలి తండ్రిని ఆశారాం బెదిరించారు. అంతేకాదు ఈ కేసు డీల్ చేసిన పోలీసు అధికారికి ఏకంగా 2వేల బెదిరింపు ఉత్తరాలు పంపారు.ఐదేళ్ల అనంతరం బాధితులకు న్యాయం చేకూరింది.

ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ.. తమకు న్యాయం చేసిన న్యాయస్థానానికి , పోలీసులకు దన్యవాదాలు తెలిపారు. ఆశారం మద్దతు దారులు తమను బెదిరించారని, ఆఖరికి లంచం కూడా ఇస్తామని మభ్యపెట్టారని వారు ఆరోపించారు. చివరకు న్యాయం గెలిచిందని సంతోషం 
వ్యక్తం చేశారు.
 

loader