Asianet News TeluguAsianet News Telugu

అమరావతి జోలికొస్తే కేంద్రమే ఊరుకోదు... రాజధాని కాదు అదీ అసాధ్యమే: సోమిరెడ్డి

నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జిల్లాకు చెందిన పార్టీ నేతలతో మాజీ మంత్రి సోమిరెెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కేవలం వారం రోజుల్లోనే నివేదిక ఇచ్చిందని...  అదికూడా జీఎన్ రావు కమిటీ రిపోర్టును జిరాక్స్ తీసిచ్చినట్టుగా ఉందన్నారు.

somireddy chandramohan reddy reacts on ap capital  issue
Author
Nellore, First Published Jan 4, 2020, 9:27 PM IST

జీఎన్ రావు, బీసీజీ...ఏ కమిటీ అయినప్పటికీ అసెంబ్లీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారో అదే అన్ని నివేదికల్లో కనిపిస్తోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వైజాగ్ లో విజయసాయి రెడ్డి ఏమని ప్రకటించారో దానినే నివేదికల్లో రాస్తున్నారు...వారిద్దరు చెప్పిందే కమిటీ సభ్యులయినా, అధికారులయినా ఫాలో  అవుతున్నారన్నారు. స్వతంత్రంగా వ్యవహరించే స్వేచ్చను వారికి ఇవ్వడం లేదని ఆరోపించారు.  

నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ నేతల సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కేవలం వారం రోజుల్లోనే నివేదిక ఇచ్చిందని... అయితే అది గతంలో జీఎన్ రావు కమిటీ రిపోర్టును జిరాక్స్ తీసిచ్చినట్టుగా ఉందన్నారు. వీరంతా ఐదు కోట్లమంది రాష్ట్ర ప్రజల మనోభావాలతో చాలా చులకనగా ఆడుకుంటున్నారని మండిపడ్డారు.

ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితి దురదృష్టకరమన్నారు. 151 సీట్లతో గెలిపిస్తే ప్రజలకు పాలన అందించడం మానేసి రాష్ట్రంలో కన్ఫ్యూజన్ వాతావరణం తెచ్చారన్నారు. జీఎన్ రావు కమిటీ గవర్నర్ నివాసం అమరావతిలోనే ఉంచాలని చెప్పగా... బీసీజీ రిపోర్టు మాత్రం వైజాగ్ కు మార్చాలని సూచించినట్లు తెలిపారు.

మంత్రుల నివాసాలు అమరావతిలో అని జీఎన్ రావు కమిటీ చెప్పగా బీసీజీ అసలేం చెప్పలేదని గుర్తుచేశారు.  అంటే  మంత్రులు గాలిలో ఉండాలా అంటూ బిసిజి రిపోర్టును తప్పుబట్టారు.

read  more  రాజధాని కోసం... రేపటి అమరావతి ఉద్యమ కార్యాచరణ ఇదే

ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలెన్నుకున్న ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రం ఆమోదించి, రాజధానికి నిధులు విడుదల చేసి, దేశ చిత్రపటంలో రాజధానిగా అమరావతిని గుర్తించిందని తెలిపారు. ఇలా రాజ్యాంగబద్దంగా ఏర్పడిన రాజధానిని ఈ రోజు మారస్తామంటే అది ఆషామాషి వ్యవహారం కాదని... అలా మార్చడం ఏ ప్రభుత్వం వల్ల సాధ్యం కాదన్నారు.

రాజధానిని కాదు కనీసం హైకోర్టును కూడా మార్చడం సాధ్యంకాదని సోమిరెడ్డి పేర్కొన్నారు. ఐదేళ్ల పాలనాకాలంలో హైకోర్టు మూడు బెంచీలకు సుప్రీంకోర్టు అనుమతులు వచ్చేది కష్టమేనన్నారు. కాబట్టి హైకోర్టు మార్చడం కూడా అంత తేలికైన పని కాదన్నారు.

సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి, నిధులిచ్చిన తర్వాత రాజధానిని అమరావతి నుండి వేరేచోటికి  మారుస్తామంటే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదన్నారు. ప్రజల హక్కులను కాపాడేందుకు న్యాయ స్థానాలున్నాయని...రాజధాని రైతులకు మద్దతుగా వాటిద్వారా పోరాడేందుకు కూడా సిద్దంగా వున్నామని వెల్లడించారు.

read more  ఏపి రాజధాని ఎక్కడున్నా సరే... అవన్నీ వుండాల్సిందే: మాజీ మంత్రి బండారు

ఇప్పటికైనా  వైసిపి నాయకులు, ప్రభుత్వ పెద్దలు కక్షసాధింపు చర్యలను ఆపితే  బావుంటుందని సూచించారు. గత ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడిపై కోపంతో రాష్ట్రాన్ని నాశనం చేయకండని వారిని సూచించారు. కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తే అన్నీ వారికే బోదపడతాయని అన్నారు.

భూములను త్యాగం చేసిన రైతులను బాధపెడుతుండటం దురదృష్టకరమన్నారు. ఇది వైసిపి పార్టీకి, ప్రభుత్వానికే కాదు రాష్ట్రానికి కూడా మంచిది కాదన్నారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ను ఆర్నెళ్లలోనే అధోగతి పట్టించారని ఐదేళ్లలో ఇంకా ఏం చేస్తారోనని భయంగా వుందని సోమిరెడ్డి అన్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios