నెల్లూరు: షార్ట్ ఫిల్స్మ్ లో తీస్తానని, సినిమాల్లో అవకాశం కల్పిస్తానని నమ్మబలికి యువతులకు వలవేసి దారుణాలు చేస్తున్ననీచుడిని పోలీసులు అరెస్టు చేశారు. సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని నమ్మబలికి యువతులను లోబరుచుకుంటాడు. రహస్యంగా అశ్లీల దృశ్యాలను చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఆ తర్వాత వారిని వ్యభిచార కూపంలోకి నెడుతాడు. వారితోనే వ్యభిచార కార్యకలాపాలను నడిపిస్తాడు. 

గత మూడేళ్లుగా మహిళలను, యువతులను మోసం చేసిన ఘరానా మోసగాడు జాకీర్ హుస్సేన్ ను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. అతని ముఠా గుట్టును బయటపెట్టారు. ప్రధాన నిందితుడు జాకీర్ హుస్సేన్ తో పాటు 8 మంది నిర్వాహకులను, ఐదుగురు విటులను పోలీసులు అరెస్టు చేశారు. వారి మోసానికి బలైన ఏడుగురు యువతులను హోంకు తరింలచారు. 

నెల్లూౌరు నగర డీఎస్పీ జె. శ్రీనివాసులు ఆ ముఠాకు సంబంధించిన వివరాలను గురువారం సాయంత్రం మీడియా సమావేశంలో వెల్లడించారు. కోవూరుకు చెందిన ఓ మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో ఆ ముఠా గుట్టు రట్టయింది. తాను మోసపోయానని, సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని వ్యభిచార కూపంలోకి దించుతున్నాడని ఆ మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నెల్లూరు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగీ ఆదేశాలతో సీఐ శ్రీనివాసన్ నేతృత్వంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేప్టటారు. ఆ దర్యాప్తులో జాకీర్ హుస్సేన్ గుట్టు రట్టయింది.

నెల్లూరుకు చెందిన జాకీర్ హుస్సేన్ వృత్తిపరంగా డ్యాన్సర్. నెల్లూరు షార్ట్ గన్ బ్యానర్ పై షార్ట్ పిల్మ్స్ తీస్తున్నట్లు ప్రచారం చేసుకున్నడాు. ప్రచారం ద్వారా పెద్ద యెత్తున యువతులను ఆకర్షించారు. సినిమా అవకాశాలు కల్పిస్తానని యువతులను లోబరుచుకుని శృంగార చేష్టలను వీడియో తీస్తాడు. వాటిని యువతులకు చూపించి డబ్బు సంపాదించడానికి మార్గమంటూ వారిని వ్యభిచార కూపంలోకి నెడుతాడు.

అతని బారిన పడిన కొందరు మహిళలు నిర్వాహకులుగా మారారు.  నిందితుడు ఇచ్చిన సమాచారంతో నెల్లూరులోని పలు ప్రాంతాల్లో ఉన్న వారి నివాసాలై పోలీసులు ఏక కాలంలో దాడులు నిర్వహించారు. పోలీసులకు చిక్తిన నిర్వాహకుల్లో కొందరు బైక్ లపై ప్రెస్ స్ట్రిక్కర్ అతికించుకుని తిరుగుతున్నారు. 

ముఠా సభ్యుల నుంచి పోలీసులు ఓ హ్యుండాయ్ కారును, ల్యాప్ టాప్ ను, మోటార్ బైక్ ను, 14 సెల్ ఫోన్లను, రూ.12,300 నగదును స్వాధీనం చేసుకున్నారు.