కోల్‌కతా డాక్టర్ రేప్-మర్డర్ కేసు.. వివాదంలో స్టార్ యూట్యూబర్.. ధృవ్ రాథీపై విమర్శలు
Dhruv Rathee : కోల్‌కతా రేప్ అండ్ మర్డర్ కేసులో ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాథీ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తన ఎక్స్ పోస్ట్ ను డిలీట్ చేసినా ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకోలేకపోతున్నారు. అసలేం జరిగింది?
Dhruv Rathee : లోక్‌సభ ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతూ వార్తల్లో నిలిచిన ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాథీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి అతను సోషల్ మీడియా యూజర్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎక్స్ లో చేసిన పోస్టు అతని వివాదంలోకి లాగింది. కోల్‌కతాలో అత్యాచారం, హత్యకు గురైన డాక్టర్ ఎవరనే విషయాన్ని సోషల్ మీడియాలో పేర్కొన్నాడు ధృవ్ రాథీ. అప్పటి నుంచి అతను విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పుడు తన ఎక్స్ పోస్ట్ ను డిలీట్ చేసినా నెటిజన్ల ఆగ్రహం ఆగలేదు.
ధృవ్ రాథీ తన పోస్ట్ లో.. 'పశ్చిమ బెంగాల్‌లో జరిగిన అత్యాచారం, హత్య కేసు హృదయ విదారకంగా ఉంది. ఇది వైద్యుల అమానవీయ పని పరిస్థితులను కూడా బట్టబయలు చేసింది. పశ్చిమ బెంగాల్‌లో వారికి భద్రత లేకపోవడంతో వారు చాలా క్లిష్ట పరిస్థితుల్లో పని చేయాల్సి వస్తోందని పేర్కొన్నాడు. అలాగే, ఈ వ్యవహారంపై సీబీఐ త్వరగా విచారణ జరిపి న్యాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన రాశారు.
దీంతో పాటు ధృవ్ రాథీ 'నిర్భయ 2' అనే హ్యాష్‌ట్యాగ్‌ను పంచుకున్నాడు. దీంతో ఈ పోస్టు వివాదానికి దారితీసింది. నేటిజన్లు అతని పోస్టుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధితురాలిని 'నిర్భయ 2' అని సంబోధించడం అస్పష్టంగా ఉంది. దీనిపై ధ్రువ్ రాథీ తన తప్పును అంగీకరించి పోస్ట్‌ను తొలగించారు. ఈ ట్వీట్‌ను ఎందుకు తొలగిస్తున్నాడో కూడా చెప్పాడు. బాధితురాలిని నిర్భయ 2 అని పిలవడం అసభ్యకరమని కొందరు చెప్పారని తెలిపాడు. ఇది నాకు సరైనదనిపించి ట్వీట్ ను తొలగిస్తున్నానని పేర్కొన్నాడు.
అయినప్పటికీ, ధృవ్ పోస్టుపై వివాదం ఆగలేదు. ఎందుకంటే ఈసారి ధ్రువ్ రాథీ హ్యాష్‌ట్యాగ్‌తో పాటు బాధితురాలి పేరును ప్రస్తావించారు. దీంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ అతని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అత్యాచారం బాధితురాలు చనిపోయినప్పుడు కూడా ఆమె పేరును వెల్లడించకూడదు. అలాంటి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు స్వయంగా పేర్కొందనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు. కాగా, కోల్‌కతా డాక్టర్ రేప్, హత్య కేసులో నిందితుడు సంజయ్‌రాయ్‌ని అరెస్టు చేశారు. అయితే పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా డాక్టర్ తల్లి, తండ్రి గ్యాంగ్ రేప్‌గా అనుమానిస్తున్నారు.