గర్ల్ ఫ్రెండ్ ని బెదిరించి న్యూడ్ వీడియోలు.. సోషల్ మీడియాలో ప్రత్యక్షం

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 4, Sep 2018, 11:24 AM IST
Youth uploads nude videos of collegemates to Facebook, arrested in bengaluru
Highlights

గర్ల్ ఫ్రెండ్ నగ్న వీడియోలు బయటపెడతానంటూ సిద్ధార్థ బెదిరించి, ఆమెతోనే ఇతర అమ్మాయిల నగ్న వీడియోలు షూట్ చేయించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.


ప్రస్తుత కాలంలో టెక్నాలజీని తప్పడు మార్గంలో ఎలా ఉపయోగిస్తున్నారో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. తన తోటి విద్యార్థినుల న్యూడ్ వీడియోలు రహస్యంగా చిత్రీకరించి.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ దారుణ సంఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు ప్రాంతానికి చెందిన సిద్ధార్థ (21) అనే యువకుడు బెంగళూరు నగరంలోని కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. సిద్ధార్థ ప్రేమిస్తున్న గర్ల్ ఫ్రెండ్ సాయంతో బాలికల బాత్రూంలలో రహస్య కెమెరాలు అమర్చి అమ్మాయిల నగ్నవీడియోలు తీశాడు. అనంతరం వాటిని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు. ముందుగా సిద్ధార్థ గర్ల్ ఫ్రెండ్ అయిన ఓ అమ్మాయి ముందుగా తన నగ్న వీడియోలను తీసి సిద్ధార్థకు పంపించింది. 

గర్ల్ ఫ్రెండ్ నగ్న వీడియోలు బయటపెడతానంటూ సిద్ధార్థ బెదిరించి, ఆమెతోనే ఇతర అమ్మాయిల నగ్న వీడియోలు షూట్ చేయించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ అమ్మాయి ఫేస్ బుక్ లో తాను నగ్నంగా స్నానం చేస్తున్న వీడియోలు కనిపించడంతో షాక్ కు గురైంది. నకిలీ ఫేస్ బుక్ ఖాతాలతో పలువురు అమ్మాయిల నగ్న వీడియోలను సిద్ధార్థ పోస్టు చేశాడని వెల్లడైంది. 

విద్యార్థినుల ఫిర్యాదు మేర పోలీసులు రంగంలోకి దిగి సిద్ధార్థను అరెస్టు చేశారు. సిద్ధార్థతోపాటు అతని గర్ల్ ఫ్రెండ్ ను కూడ కళాశాల నుంచి సస్పెండ్ చేశారు. సిద్ధార్థ గర్ల్ ఫ్రెండ్ స్నేహితురాళ్లతోపాటు ఓ అమ్మాయి తల్లి నగ్న వీడియోలు ఉన్నాయి. నగ్న వీడియోలు చూపించి తన కోరిక తీర్చాలని సిద్ధార్థ అమ్మాయిలను బెదిరించినట్లు పోలీసులు చెప్పారు. తంజావూరు పట్టణం నుంచి నగ్న వీడియోలు పోస్టు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కెమెరాలతోపాటు అప్ లోడింగ్ చేసేందుకు వినియోగించిన డివైజ్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిద్ధార్థపై ఐపీసీ 354 ఎ, 354 డి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

loader