న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎయిర్‌పోర్టులో రూ. 6.3 కోట్ల విలువైన హెరాయిన్ డ్రగ్స్ ను  కస్టమ్స్ అధికారులు  బుధవారం నాడు  స్వాధీనం చేసుకొన్నారు.ఆఫ్ఘనిస్తాన్‌ నుండి వచ్చిన  ఓ ప్రయాణీకుడి నుండి కస్టమ్స్ అధికారులు ఈ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకొన్నారు. ఆటో మొబైల్ పరికరాల్లో  హెరాయిన్ ను తరలిస్తున్నారు.

 కష్టమ్స్ అధికారుల కళ్లుగప్పి ఇండియాలోకి డ్రగ్స్ ను తరలిస్తున్నట్టుగా గుర్తించారు. హెరాయిన్ ను  తరలిస్తున్న ప్రయాణీకుడిపై  కస్టమ్స్ అధికారులు  కేసు నమోదు చేశారు.  దేశంలోని పలు ఎయిర్‌పోర్టుల్లో కూడ ఇదే తరహాలో  డ్రగ్ర్స్ , బంగారం అక్రమంగా తరలిస్తున్నవారిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేస్తున్నారు.దేశంలో పలు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో డ్రగ్స్ కేసులు కూడా అధికంగా నమోదౌతున్నాయి.  డ్రగ్స్ సరఫరా చేస్తున్న కేసులతో పాటు డ్రగ్స్ తీసుకొంటున్నవారిపై నార్కోటిక్ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు.

కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖులు బెంగుళూరు సమీపంలోని ఓ పామ్‌హౌస్ లో జరిగిన పార్టీలో  డ్రగ్స్ తీసుకొన్నారనే  విషయమై కేసు నమోదైంది. ఈ కేసును బెంగుళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఈ కేసులో తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూడ పాల్గొన్నారనే ప్రచారం సాగుతోంది.  అయితే ఆ ఎమ్మెల్యేలు ఎవరనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.