Asianet News TeluguAsianet News Telugu

టిక్ టాక్ పరిచయం.. వ్యభిచారం చేయాలని ఇంటికి పురుషులను పంపి..

ఆ స్నేహితులే ఆమెను మరింత అంధకారంలోకి తోసేశారు. వ్యభిచారం చేయాలంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టారు. తట్టుకోలేక బాధితురాలు ఆత్మహత్యకు యత్నించింది.

woman try to kill self over TIK TOK Friends in tamilnadu
Author
Hyderabad, First Published Jan 28, 2020, 11:54 AM IST

ఆనందంగా సాగుతున్న ఆమె జీవితం ఒక్కసారిగా అంధకారమైపోయింది. జీవితాంతం అండగా ఉంటాడునుకున్న భర్తను మృత్యువు కబళించింది. దీంతో ముగ్గురు పిల్లలను పోషిస్తూ... భారంగా జీవితాన్ని సాగిస్తోంది. పీకల్లోతు బాధల్లో మునిగితేలుతున్న ఆమెకు టిక్ టాక్ కొంచెం హాయిని కలిగించింది. 

అందులో పరిచయమైన ముగ్గురు స్త్రీలను నిజమైన స్నేహితులుగా భావించింది. వారికి తన కష్టాలన్నీ చెప్పుకుంది. కానీ ఆ స్నేహితులే ఆమెను మరింత అంధకారంలోకి తోసేశారు. వ్యభిచారం చేయాలంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టారు. తట్టుకోలేక బాధితురాలు ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... సెంజి సమీపంలోని సత్యమంగళం గ్రామానికి చెందిన మనోహరన్‌, కడల్‌కన్ని (39) దంపతులకు ముగ్గురు పిల్లలు. భర్త మృతి చెందడంతో ఆమె, పిల్లలతో కలసి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. 

Also Read పెళ్లి చేసుకున్న తొలి ట్రాన్స్ జెండర్ వుమెన్ జర్నలిస్ట్...

ఆమెకు ఇటీవల టిక్ టాక్ యాప్ లో చెన్నైకి చెందిన సుమతి, లత, కవిత అనే ముగ్గురు టిక్‌ టాక్‌ యాప్‌ ద్వారా పరిచయమై స్నేహితులుగా మారారు. కొంతకాలం ఆమెతో స్నేహంగా ఉన్న ఆ మహిళలు తర్వాత ఆమెను వేధించడం మొదలుపెట్టారు.

వ్యభిచారం చేయాలని ఆమెను ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు.   ఇద్దరు పురుషులను పంపి రూ.2 లక్షలు ఇవ్వాలని, లేదంటే కిడ్నాప్‌ చేసి హత్యచేస్తామని బెదిరించడం మొలుపెట్టారు. దీంతో సదరు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు  చేసింది. 

అయితే.. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, వారి నుంచి బెదిరింపులు అధికం కావడంతో తట్టుకోలేని కడల్‌కన్ని ఆదివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుంది. వెంటనే గుర్తించిన కుటుంబీకులు ఉరితాడు తొలగించి చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చావు బతుకుల్లో ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios