వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. దశాబ్దానికి పైగా కలిసి జీవించారు. ఆమె అతని కోసం కట్టుకున్న భర్తని కూడా వదిలేసింది. ఆ ప్రియుడితోనే తన జీవితం అన్నట్లుగా జీవిస్తోంది. అయితే.. తాజాగా.. వారి మధ్య గొడవ వచ్చి విడిపోయారు. దీంతో.. తన ప్రియుడిపై సదరు మహిళ పగ పెంచుకుంది. దీంతో.. తనపై 15 సంవత్సరాల క్రితం అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని బాందలో ఆదివారం చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్‌, కోత్వాలీకి చెందిన ఓ మహిళ వివాహనంతరం కూడా ప్రియుడితో సంబంధాన్ని కొనసాగించింది. దీంతో మహిళ భర్త ఆమెను విడిచి పెట్టేశాడు. ఈ నేపథ్యంలో ఆమె ప్రియుడికి రెండో భార్యగా ఉంటోంది. 

అయితే కొద్దిరోజుల క్రితం ఇద్దరికీ గొడవ జరగటంతో అతడామెను కొట్టి, బయటకు గెంటేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళ పోలీసులను ఆశ్రయించింది. 15 ఏళ్ల క్రితం అతడు తనపై అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మహిళను వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.