చెన్నై: తమిళనాడులో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. రైలు బోగీలో నిద్రిస్తున్న మహిళపై ఇద్దరు రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చెంగల్పట్టు జిల్లాకు చెదిన 40 ఏళ్ల వివాహిత జీవనోపాధి కోసం రైలు బోగీలో పండ్లు అమ్ముతుంది. 

చెంగల్పట్టు - చెన్నై తాంబారం మధ్య తిరిగే స్థానిక రైులలో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు పండ్ల అమ్మకాలు జరిపి ఇంటికి చేరుకునేందుకు తాంబారంలో చెంగలప్పట్టు రైలు ఎక్కింది.

ఉదయం నుంచి పనిచేయడం వల్ల అలసిపోయిన మహిళ గాఢంగా నిద్రపోయింది. దీంతో చెంగల్పట్టులో దిగలేదు. దాంతో అదే రైలు చివరి ట్రిప్పులో  అర్థరాత్రి వెళ్ల మళ్లీ తాంబారం చేరుకుంది. రైలు బోగీలను శుభ్రం చేయడానికి వచ్చిన ఇద్దరు కాంట్రాక్టు కార్మికులు ఆమెను తట్టి లేపి నోరు గట్టిగా మూసి  సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

విషయాన్ని పోలీసులకు చెప్తే రైల్వే సొత్తు దొంగతనం చేయడానికి వచ్చావని కేసు పెడుతామని మహిళను బెదిరించారు. శనివారం తెల్లారి తాంబారం రైల్వే పోలీసు స్టేషన్ కు వెళ్లి మహిళ ఫిర్యాదు చేసింది.  దీంతో కాంట్రాక్టు కార్మికులు సురేష్ (31), ఖలీల్ (30)లను పోలీసులు ఆదివారం అరెస్టుచేశారు. బాధితురాలని ఆస్పత్రికి పంపించారు.