శందోల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శందోల్ జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన చేసుకుంది. 20 ఏళ్ల వయస్సు గల యువతిపై నలుగురు వ్యక్తులు రెండు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారు. 

జైత్ పూర్ పోలీసు స్టేషన్ పరిధిలోి గదాఘాట్ ప్రాంతంలోని ఓ ఫామ్ హౌస్ లో ఈ నెల 18,19 తేదీల్లో నలుగురు అత్యాచారం చేశారు. యువతిని కారులో ఎత్తుకెళ్లి ఫామ్ హౌస్ లో అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ముందు యువతితో బలవంతంగా మద్యం తాగించారు. 

రెండు రోజుల పాటు అత్యాచారం చేసిన తర్వాత యువతిని ఆమె ఇంటి ముందు వదిలేసి వెళ్లిపోయారు. బాధితురాలు బుధవారం పోలీసులకు తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. నలుగురిపై ఫిర్యాదు చేసింది. 

చికిత్స కోసం యువతిని పోలీసులు జిల్లా ఆస్పత్రికి తరలించారు నలుగురు నిందితుల్లో బిజెపికి చెందిన విజయ్ త్రిఫాఠీ ఉన్నాడని ఆమె ఆరోపించింది. అతన్ని పార్టీ నుంచి బహిష్కరించారు. నిందితుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు.