దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. జహంగీర్‌పురా మెట్రో స్టేషన్‌ సమీపంలో తల లేని మహిళ మృతదేహం లభ్యమైంది. శనివారం దుప్పటిలో చుట్టి ఉన్న మృతదేహాన్ని పోలీసులు శనివారం రాత్రి గుర్తించారు.

దాదాపు మూడు రోజుల క్రితమే మహిళను హతమార్చినట్లు పోలీసులు నిర్థారించారు. శరీరం నల్లగా మారి పాడైపోయే స్థితికి చేరుకుందని.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం బాబు జగ్జీవన్ రాం మెమొరియల్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.