Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. రైలు కోచ్ లో వేలాడుతున్న యువతి మృతదేహం... గ్యాంగ్ రేప్ అనుమానం..!

Vadodaraలోని ఓ ఎన్జీవో సంస్థలో పనిచేసిన కాలేజీ విద్యార్థిని మృతదేహం నవంబర్ 4న వల్సాద్ లోని గుజరాత్ Queen Express Coachలో వేలాడుతూ కనిపించడంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

Woman Found Hanging In Train Coach, Rape Suspected: Gujarat Police
Author
Hyderabad, First Published Nov 15, 2021, 1:22 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

వడోదర :  గుజరాత్ రాష్ట్రంలోని Valsad‌లో రైలు కోచ్ లో వేలాడుతున్న 18 ఏళ్ల యువతి మృతదేహాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆఫీస్ నుంచి హాస్టల్ కు తిరిగి వస్తుండగా యువతి వడదరలో సామూహిక అత్యాచారానికి గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  

Vadodaraలోని ఓ ఎన్జీవో సంస్థలో పనిచేసిన కాలేజీ విద్యార్థిని మృతదేహం నవంబర్ 4న వల్సాద్ లోని గుజరాత్ Queen Express Coachలో వేలాడుతూ కనిపించడంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

మృతురాలు వడోదర లోని హాస్టల్లో నివసించేది. ఒకరోజు వడోదరలోని ఆటో రిక్షాలో ఇద్దరు నిందితులు యువతిని కిడ్నాప్ చేసి, ఆమె కళ్ళకు గంతలు కట్టి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లారని బాధితురాలు తన డైరీలో పేర్కొంది.  ఆ తర్వాత ఆమెపై gang rape జరిగిందా? లేదా?  అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.  బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందా లేదా అనే విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకోవాలని అధికారులను ఆదేశించారని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సిఐడి క్రైమ్ అండ్ రైల్వేస్) సుభాష్ విలేకరులకు చెప్పారు.

Drugs: గుజరాత్‌లో కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ సీజ్.. పాకిస్తాన్ నుంచే రవాణా?.. కశ్మీర్‌లోనూ బెడద

వడోదర సిటీ పోలీసులు, అహ్మదాబాద్  సిటీ క్రైమ్ బ్రాంచ్,  సైన్స్ లేబొరేటరీ, రైల్వే పోలీసులు సిబ్బందితో దాదాపు 25 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, దాదాపు 450 సీసీటీవీ ఫుటేజీలను స్కాన్ చేశామని చెప్పారు.  తాము  కాల్ డేటా  రికార్డులను కూడా పరిశీలిస్తున్నామని, ఎలక్ట్రానిక్ నిఘా,  ఇంటిలిజెన్స్ ఇన్పుట్ లను ఉపయోగించి నిందితులను పట్టుకుంటామని చెప్పారు. 

రిమాండ్ మహిళా ఖైధీతో నగ్నంగా డ్యాన్స్ చేయించి.. 

పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో దారుణం జరిగింది. పోలీస్ రిమాండ్లో ఉన్న మహిళపై లేడీ ఇన్స్ పెక్టర్ అత్యంత అమానవీయంగా ప్రవర్తించింది. ఆమె దుస్తులు విప్పించి జైలులోని ఇతరుల ముందు డ్యాన్స్ చేయించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు సదరు లేడీ ఇన్‌స్పెక్టర్ షబానా ఇర్షాద్ ను ఉద్యోగం నుంచి తొలగించారు. బాధిత మహిళను  జైలు కస్టడీకి తరలించారు.

రిమాండ్లో ఉన్న మహిళా దుస్తులు విప్పించి అందరిముందు dance చేయించిన ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో స్పందించిన ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఈ సందర్భంగా Lady Inspector తన విధులను దుర్వినియోగం చేసినట్లు తెలిసింది.  జైలులో రిమాండ్లో ఉన్న మహిళపై అమానవీయంగా ప్రవర్తించినట్లు వెల్లడయింది. క్వెట్టాలోని Jinnah Township లో చిన్నారి హత్య కేసుకు సంబంధించి పారీ గుల్ అనే మహిళను  shabana అరెస్టు చేసింది.

ఆమె పోలీస్ రిమాండ్ లో ఉండగా విచారణ పేరుతో దుస్తులు విప్పించిన ఇన్స్పెక్టర్..  జైలులోని అందరి ముందు నగ్నంగా డ్యాన్స్ చేయించినట్లు క్వెట్టా  igp మొహమ్మద్  అజర్ అక్రమ్ తెలిపారు.  మహిళా ఇన్స్పెక్టర్ షబానా చెప్పేందుకు ఏమీ లేదని,  ఆమెను విధుల నుంచి తప్పించి నట్లు చెప్పారు. సాటి మహిళపై ఇలా ప్రవర్తించడం సరికాదని  ఇది సహించరానిదని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios