Asianet News TeluguAsianet News Telugu

వరకట్నం కోసం మహిళా కానిస్టేబుల్ పై భర్త, అతని పెదనాన్న లైంగింక వేధింపులు.. చివరికి..

ఇంకా కట్నం కావాలని డిమాండ్ చేశారు.  ఈసారి 10 లక్షలు, ఒక కారు కావాలని అడిగారు. ఇవ్వకపోవడంతో  ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించేవారు. ఆమె ఇదంతా పుట్టింటి వారికి చెప్పినా.. వారూ ఏమి చేయలేమని చెప్పారు.  అత్త వారి ఇంటికి వెళ్లగానే అత్త, మామ, అ భర్త పెదనాన్న స్వప్నను బూతులు తిట్టే వారు.

Woman constable accuses husband of forcing her for unnatural sex, and dowry harassment in rajasthan
Author
Hyderabad, First Published Oct 4, 2021, 8:57 AM IST

రాజస్థాన్లోని చురు నగరంలో 28 ఏళ్ల మహిళా పోలీస్ కానిస్టేబుల్ (Women Constable) తన భర్త వరకట్నం (Dowry Harassment) కోసం లైంగికంగా (Sexual Harassment)వేధిస్తున్నాడంటూ మహిళా పోలీస్ స్టేషన్ (women police station)లో ఫిర్యాదు చేసింది.  తన భర్త పెదనాన్న కూడా తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.  ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు విచారణ మొదలు పెట్టారు.

పోలీసుల కథనం ప్రకారం.. 2019లో పోలీస్ కానిస్టేబుల్ స్వప్న (పేరు  మార్చబడింది)కు  రాజస్థాన్ లోని  హనుమాన్ గఢ్  జిల్లాలోని ఒక గ్రామంలోని యువకుడితో వివాహమైంది.  వివాహమైన కొద్దికాలం తర్వాత నుంచి అత్తవారు వరకట్నం కావాలని వేధింపులు మొదలుపెట్టారు. వేధింపులు తాళలేక ఆమె రూ.  4.5 లక్షలు వారికి ఇచ్చింది.  కానీ వారు అంతటితో ఆగలేదు.

ఇంకా కట్నం కావాలని డిమాండ్ చేశారు.  ఈసారి 10 లక్షలు, ఒక కారు కావాలని అడిగారు. ఇవ్వకపోవడంతో  ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించేవారు. ఆమె ఇదంతా పుట్టింటి వారికి చెప్పినా.. వారూ ఏమి చేయలేమని చెప్పారు.  అత్త వారి ఇంటికి వెళ్లగానే అత్త, మామ, అ భర్త పెదనాన్న స్వప్నను బూతులు తిట్టే వారు.

‘నువ్వు పోలీసు ఉద్యోగం చేసి లంచాలు తీసుకుని మాకు కట్నం తీసుకుని రా,  ఆ మాత్రం లేకపోతే నీ ఉద్యోగం ఎందుకు?’  అనేవారు అని స్వప్న వాపోయింది.  10 లక్షలు తీసుకువస్తే ఆ డబ్బులతో పెళ్లికి చేసిన అప్పు తీర్చి,  భర్తతో వ్యాపారం పెట్టిస్తామని చెప్పేవారు అని స్వప్న చెప్పింది.  స్వప్న కట్నం తేలేకపోయేసరికి  భర్త తనతో క్రూరంగా వ్యవహరించడం మొదలుపెట్టాడని,  బలవంతంగా తనతో వెనుక నుంచి సెక్స్ చేశాడని  ఫిర్యాదులో పేర్కొంది.

ముంబై డ్రగ్స్ కేసు: ఎన్‌సీబీ కస్టడీకి ఆర్యన్ ఖాన్... కీలక విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్

ఇలా రోజు చేసేవాడని,  తను ఎదురు తిరిగితే ఎలా పడితే అలా కొట్టేవాడని చెప్పుకొచ్చింది. స్వప్న డ్యూటీ లో పరాయి మగాళ్లతో సంబంధం పెట్టుకుందని... తన భర్తే నలుగురిలో ఆమెపై నిందలు వేశాడని,  తన భర్త పెదనాన్న  చాలాసార్లు తన గదిలోకి వచ్చి అసభ్యకరంగా మాట్లాడేవాడు అని ఆమె చెప్పింది.  ఒకరోజు  స్వప్న వంట గదిలో ఉండగా వెనకనుంచి వచ్చి  గట్టిగా పట్టుకుని తన కోరిక తీర్చమంటూ తనపై అత్యాచారం చేయబోయాడు అని ఆమె అన్నది.

ఇక ఈ హింసలు భరించలేనని భావించిన స్వప్న భర్త ఇల్లు వదిలేసి,  ప్రభుత్వ పోలీసు నివాసం( క్వార్టర్స్) లోకి వచ్చేసింది.  ఇప్పుడు తన భర్త తిరిగి ఇంటికి రాకుంటే ఆత్మహత్య చేసుకుంటునని  బెదిరిస్తుండడంతో.. ఎటూ పాలుపోని స్వప్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు ప్రస్తుతం వరకట్న వేధింపులు,  అత్యాచారయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios