వ్యక్తిని చెట్టుకు కట్టేసి భార్యాకూతుళ్లపై గ్యాంగ్ రేప్

Woman And Daughter Gang-Raped At Gunpoint As Husband Was Tied To Tree
Highlights

ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి అతని భార్యపై, కూతురిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

గయ: బీహార్ లో అత్యంత దుర్మార్గమైన చర్య చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి అతని భార్యపై, కూతురిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ముగ్గురు తమ దారిన వెళ్తుంటే 20 మంది ఎదురుగా వచ్చారు. 

వారిని తుపాకులతో బెదిరించి, పురుషుడిని చెట్టుకు కట్టేసి, అతని కళ్లెదుటే భార్యపై, కూతురిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ సంఘటన బీహారులోని గయా జిల్లాలో చోటు చేసుకుంది. 

గయలో వైద్యుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి బుధవారం రాత్రి తన భార్యను, కూతురిని తీసుకుని బైకుపై ఇంటికి బయలుదేరాడు. కోంచ్ పోలీసు స్టేషన్ పరిధిలోి సోందిహా గ్రామం మీదుగా వెళ్తున్న దారిలో నిర్మానుష్యమైన ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో 20 మంది యువకులు తుపాకులతో బెదిరించి వారిని అడ్డుకున్నారు. 

వైద్యుడిని చెట్టుకు కట్టేసి, ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను తీసుకుని పారిపోయారు. 

బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు .సోందిహాలో నిందితులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు గ్రామం నుంచి పారిపోకుండా స్థానికులు కాపు కాసి వారిని పోలీసులకు అప్పగించారు. సామూహిక అత్యాచారానికి పాల్పడడానికి ముందు ఈ గ్యాంగ్ సోందిహాలోని ఇద్దరు విద్యార్థుల నుంచి మొబైల్ ఫోన్లు, డబ్బులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు 

కొంత కాలంగా ఈ ముఠా ఆ గ్రామం నుంచి వెళ్తున్నవారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కోంచ్ ఠాణా స్టేషన్ హౌస్ ఆఫీసరును విధుల నుంచి తొలగించారు. 

loader