భోపాల్: పోలీసులపై ఓ మహిళ తీవ్రమైన ఆరోపణలు చేసింది. తనను పది రోజుల పాటు లాకప్ లో నిర్బంధించి, ఐదుగురు పోలీసాఫీసర్లు తనపై సామూహిక అత్యాచారం చేశారని 20 ఏళ్ల యువతి ఆరోపించింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లాలో జరిగింది. 

అదనపు జిల్లా న్యాయమూర్తి, న్యాయవాదులు కొంత మంది జైలును తనిఖీ చేయడానికి వెళ్లిన సమయంలో అక్టోబర్ 10వ తేదీన ఆ సంఘటన వెలుగు చూసింది. అదనపు జిల్లా జడ్జితో మహిళ ఆ విషయం చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ సంఘటనపై ఆయన న్యాయవిచారణకు ఆదేశించారు. 

Also Read: నాపై అత్యాచారం చేశారు.. ఎమ్మెల్యే పై సింగర్ షాకింగ్ కామెంట్స్

మే 9, మే 21 తేదీల మధ్య ఐదుగురు పోలీసులు తనపై పదే పదే అత్యాచారం చేశారని మహిళ న్యాయవాదుల బృందానికి చెప్పినట్లు సమాచారం. ఓ మహిళా కానిస్టేబుల్ నిరసన తెలిపినప్పటికీ వారు పట్టించుకోలేదని మహిళ చెప్పినట్లు మీడియా వార్తలను బట్టి తెలుస్తోంది. 

తనపై జరిగిన అత్యాచారం గురించి మహిళ మూడు నెలల క్రితం జైలు వార్డెన్ కు కూడా చెప్పిందని, ఆ విషయాన్ని జైలు వార్డెన్ కూడా అంగీకరించారని జైలును సందర్శించిన బృందంలోని న్యాయవాది ఒకరు చెప్పారు. అయితే, మహిళను మే 21వ తేదీన అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

Also Read: దారుణం: మైనర్ బాలికపై మేనమామ అత్యాచారం