జైపూర్:  రాజస్థాన్ రాష్ట్రంలోని  ఓ వివాహితపై ఐదుగురు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ దృశ్యాలను నిందితులు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఐదుగురు నిందితుల్లో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

గత నెల 26వ తేదీన గుడికి వెళ్లిన వివాహితను ఐదుగురు నిందితులు కిడ్నాప్ చేసి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. అంతేకాదు ఈ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.

బాధితురాలు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనలో పాల్గొన్న  ఐదుగురు నిందితుల్లో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు సంజయ్ భాట్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

బాధితురాలి భర్త రోజూ వారీ కూలీగా పనిచేస్తున్నాడు.  బాధితురాలిని పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.