జూదంలో భార్యను ఓడాడు: మంచానికి కట్టేసి రేప్ చేయించాడు

Woman Allegedly Raped After Husband "Lost Her" In A Gamble
Highlights

జూదానికి బానిసైన ఓ వ్యక్తి అత్యంత దారుణంగా వ్యవహరించాడు.

బాలాసోర్‌: జూదానికి బానిసైన ఓ వ్యక్తి అత్యంత దారుణంగా వ్యవహరించాడు. మహాభారతంలో ధర్మరాజు ద్రౌపదిని జూదంలో కౌరవులకు ఓడడం విన్నాం. ఇప్పుడు ఒడిశాలోని ఓ వ్యక్తి తన భార్యను జూదంలో ఓడిపోయాడు. 

అతని భార్యపై మోజు పడిన జూద నిర్వాహకుడు ఆమెను జూదంలో గెలుచుకున్నాడు. గెలిచిన వెంటనే ఆమెను తన గదికి లాక్కుపోయాడు. అయితే ఆమె ప్రతిఘటించింది. ఆమెను భర్తనే లాక్కు వచ్చే విధంగా అతను చేశాడు.

భర్త చేతనే మంచానికి కట్టేయించాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు. ఒడిషాలోని బాలాసోర్‌ జిల్లా బలికూట్‌ అనే గ్రామంలో మే 23వ తేదీన ఈ సంఘటన జరిగింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఈ సంఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మద్యానికి బానిసైన తన భర్త తనపై అత్యాచారానికి కూడా సహకరిస్తాడని అనుకోలేదని ఆ మహిళ కన్నీరు మున్నీరవుతోంది.

loader