యువతిపై బాయ్ ఫ్రెండ్ ఎదుటే గ్యాంగ్ రేప్ చేశారు

First Published 26, May 2018, 7:42 AM IST
Woman Allegedly Gang Raped In Front Of Boyfriend At South Goa Beach
Highlights

దక్షిణ గోవా బీచ్ లో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది.

పానాజీ: దక్షిణ గోవా బీచ్ లో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు యువతీయువకులను దుస్తులిప్పేసి ఫొటోలు తీసి, డబ్బులు డిమాండ్ చేశారు. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ ముందే యువతిపై అత్యాచారం చేశారు.

ఆ సంఘటన గురువారం రాత్రి సెర్నబాటిమ్ బీచ్ లో జరిగింది. ఈ సంఘటనలో ఇప్పటి వరకు పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదు. యువతీయువకులపై దారుణంగా వ్యవహరించిన కేసులో నిందితులను ఇంకా గుర్తించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు 

దుస్తులిప్పేసి డబ్బులు డిమాండ్ చేసిన తర్వాత ముగ్గురు వ్యక్తులు యువతిపై గ్యాంగ్ రేప్ చేశారని పోలీసులు చెప్పారు. బాధితురాలికి 20 ఏళ్ల వయస్సు ఉంటుందని చెప్పారు. 

యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించినట్లు, ఇంకా నివేదికలు రావాల్సి ఉన్నట్లు పోలీసులు చెప్పారు. కేసులో పలువురు అనుమానితులను ప్రశ్నిస్తున్నట్లు కూడా తెలిపారు.

loader