బెంగుళూరు: వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించిన భర్తను  భార్య హత్య చేసింది. గేదే మృతదేహాన్ని పూడ్చిపెట్టే పేరుతో జేసీబీతో గొయ్యిని తవ్వి భర్త మృతదేహాన్ని పూడ్చి పెట్టింది.

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలోని నిప్పానిలోని హంచనలో ఈ ఘటన చోటు చేసుకొంది. హంచన గ్రామానికి చెందిన సచిన్ కు అనితతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి తర్వాత భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్న విషయం తెలిసింది.

ఈ విషయమై భార్యతో సచిన్ తరచుగా గొడవపడేవారు. వివాహేతర సంబంధాన్ని మానుకోవాలని భర్త సూచించాడు. కానీ ఆమె మానుకోలేదు.ఇదే విషయమై ఈ నెల 3వ తేదీన భార్యాభర్తల మధ్య గొడవ చోటు చేసుకొంది. ఈ గొడవలో భర్తను కర్రతో కొట్టి ఆమె చంపేసింది. ఈ విషయం బయటకు తెలిస్తే తనకు ప్రమాదమని భావించింది.

also read:వివాహేతర సంబంధం: రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకొని చితకబాదిన భార్య

చనిపోయిన గేదేను పూడ్చిపెట్టేందుకు గాను జేసీబీని పిలిపించింది. గొయ్యి తవ్విన తర్వాత సచిన్ మృతదేహాన్ని గొయ్యిలో వేసి పూడ్చివేసింది. ఈ మృతదేహాన్ని పూడ్చడానికి ఆమె తన సోదరి, సోదరుడి సహాయాన్ని తీసుకొంది.ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.