Asianet News TeluguAsianet News Telugu

ఆ రేపిస్టులను క్షమించాలని అడగడానికి ఆమె ఎవరు: నిర్భయ తల్లి

తన కూతురు రేపిస్టులను క్షమించాలని అడగడానికి ఇందిర జైసింగ్ ఎవరని నిర్భయ తల్లి ఆశాదేవి ప్రశ్నించారు. కోర్టులో ఇందిర జైసింగ్ చాలా తనకు ఎదురుపడ్డారని, ఒక్కసారి కూడా ఎలా ఉన్నావని అడగలేదని ఆమె అన్నారు.

Who is Indira Jaising to suggest that I forgive my daughter's Rapists
Author
New Delhi, First Published Jan 18, 2020, 12:00 PM IST

న్యూఢిల్లీ: తన కూతురిపై అత్యాచారం చేసి, ఆమెను చిత్రహింసలు పెట్టి, చంపేసిన రేపిస్టులను క్షమించాలని అడగాడనికి ఇందిర జైసింగ్ ఎవరని నిర్భయ తల్లి ఆశాదేవి ప్రశ్నించారు. ఇందిర జైసింగ్ పై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. 

ఆ విధమైన సలహా ఇవ్వడానికి ఇందిర జైసింగ్ ఎవరని ఆశాదేవి ప్రశ్నించారు. దోషులను ఉరి తీయాలని దేశం యావత్తూ కోరుకుంటోందని ఆమె అన్నారు. జైసింగ్ వంటివారి వల్లనే అత్యాచార బాధితులకు న్యాయం జరగడం లేదని ఆమె అన్నారు. 

Also Read: లాయర్ ఇందిర జైసింగ్ పై భగ్గుమన్న నిర్భయ తల్లి ఆశాదేవి

ఇందిర జైసింగ్ అటువంటి ధైర్యం చేసిందంటే తాను నమ్మకలేకపోతున్నట్లు ఆశాదేవి అన్నారు. సుప్రీంకోర్టులో ఏళ్ల తరబడిగా తాను జైసింగ్ ను కలిసినట్లు ఆమె తెలిపారు. ఒక్కసారి కూడా తాను ఎలా ఉన్నాననే విషయాన్ని ఆమె కనుక్కోలేదని ఆశాదేవి అన్నారు. ఈ రోజు దోషుల తరఫున మాట్లాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రేపిస్టులకు మద్దతు ఇవ్వడం ద్వారా అటువంటివారు తమ జీవనోపాధిని చూసుకుంటారని, అందువల్ల అత్యాచార ఘటనలు ఆగడం లేదని ఆమె అన్నారు.  మానవ హక్కుల ముసుగులో ఇందిర జైసింగ్ బతుకుతున్నారని ఆమె ఆరోపించారు. 

Also Read: నిర్భయ కేసు దోషులకు ఉరిశిక్షలో మరో మెలిక: సుప్రీంకు పవన్ గుప్తా

నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. నిర్భయ కేసులోని నలుగురు దోషులను ఆ రోజు ఉరి తీస్తారు. 

Follow Us:
Download App:
  • android
  • ios