లక్నో: పదోతరగతి విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ లో బూత్ వీడియోలు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని భాగవత్ పట్టణంలో ఓ ప్రైవేట్ స్కూల్  లో ఈ ఘటన చోటు చేసుకొంది.ప్రైవేట్ స్కూల్ లో చదువుతున్న విద్యార్థుల కోసం బయాలాజికల్ సబ్జెక్టులో విద్యార్థుల సందేహలను నివృత్తి చేసుకొనేందుకుగాను  వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు.

ఈ వాట్సాప్ గ్రూప్ లో పోర్న్ వీడియోలు దర్శనమిచ్చాయి. ఈ చాట్ గ్రూప్ ను సృష్టించిన వ్యక్తి తనను గుర్తించకుండా ఉండేందుకు గాను అంతర్జాతీయ నెంబర్ ను ఉపయోగించాడని పోలీసులు ప్రకటించారు.

ఈ వాట్సాప్ గ్రూపులో బూత్ వీడియోలతో పాటు బయాలాజికల్ టీచర్ చిత్రాలను కూడ పోస్టు చేశారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు అందడంతో దర్యాప్తు చేస్తున్నారు.

ఈ విషయమై తమకు ఫిర్యాదు అందినట్టుగా ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పారు. ఈ వాట్సాప్ గ్రూప్ నకిలీదని ఆయన చెప్పారు. ఈ గ్రూప్ ను విదేశీ నెంబర్ తో క్రియేట్ చేశారని ఆయన చెప్పారు.ఈ విషయమై భగవత్ ఏరియా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.