నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

Wednesday 28th September Telugu News Live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...
 
9:19 PM IST

ముగిసిన మంచిరెడ్డి ఈడీ విచారణ

మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రెండో రోజూ విచారించింది. బుధవారం దాదాపు 10 గంటల పాటు ఆయనను ప్రశ్నించింది. విదేశాల్లో పెట్టుబడులు, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై ఈడీ ఆరా తీసింది. అలాగే మంచిరెడ్డి కిషన్ రెడ్డి బ్యాంక్ లావాదేవీలపైనా ప్రశ్నల వర్షం కురిపించింది. ఇదే సమయంలో విదేశీ టూర్లపై ఈడీకి స్టేట్‌మెంట్ ఇచ్చారు మంచిరెడ్డి. 

8:07 PM IST

విశాఖ నుంచి కర్నూలుకు సీబీఐ కోర్ట్

విశాఖలోని సీబీఐ ప్రత్యేక కోర్టుల్లోని రెండు కోర్టుల్లో ఒకదానిని విజయవాడకు, మరో దానిని కర్నూలుకు తరలిస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైకోర్టు అడ్మిన్ రిజిస్ట్రార్ విశాఖలోని ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జికి ఆదేశాలు జారీ చేశారు. 

7:03 PM IST

భారత కొత్త సీడీఎస్‌గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్

భారత కొత్త సీడీఎస్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)‌గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. దివంగత బిపిన్ రావత్ స్థానంలో త్రివిధ దళాల అధిపతిగా అనిల్‌ను ఎంపిక చేసింది కేంద్రం. 

5:51 PM IST

ముగిసిన జగన్ వర్క్‌షాప్

తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో గడప గడపకూ మన ప్రభుత్వంపై సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన వర్క్‌షాప్ ముగిసింది. ఈ కార్యక్రమంలో 27 మంది ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు సీఎం. 175 సీట్లే టార్గెట్‌గా నేతలకు జగన్ దిశానిర్దేశం చేసినట్లుగా సమాచారం.
 
5:07 PM IST

కాంగ్రెస్ అధ్యక్ష రేసులో దిగ్విజయ్ సింగ్

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక బరిలో నిలిచేందుకు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ రెడీ అయ్యారు. సెప్టెంబర్ 30న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దిగ్విజయ్ సింగ్ నామినేషన్ దాఖలు చేయనున్నట్టుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

3:50 PM IST

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 509 పాయింట్ల నష్టంతో 56,598 వద్ద, నిఫ్టీ 148 పాయింట్ల నష్టంతో 16,858 వద్ద నిలిచాయి.  

3:20 PM IST

మరో మూడునెలలు ఉచితంగానే రేషన్ బియ్యం..: కేంద్రం ప్రకటన

కరోనా వ్యాప్తిలో లాక్ డౌన్ సమయంలో దేశ ప్రజలకు ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే మరో మూడునెలల అంటూ 2‌022 డిసెంబర్ వరకు ఈ ఉచిత రేషన్ బియ్యం పంపిణీని కొనసాగించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 
 
2:40 PM IST

వనపర్తి జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ బైక్... మూడు వాహనాలు దగ్దం

ఎలక్ట్రిక్ బైక్ పేలిన దుర్ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. వనపర్తి పట్టణంలో ఓ ఇంటివద్ద పార్క్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగి వ్యాపించాయి. ఈ మంటలు పక్కనే వున్న మరో రెండు ద్విచక్ర వాహనాలకు అంటుకుని దగ్దమయ్యాయి. ఎలక్ట్రిక్ బైక్ లో షాట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగివుంటుందని అనుమానిస్తున్నారు. 

1:33 PM IST

హిమాచల్ కాంగ్రెస్ కు బిగ్ షాక్... బిజెపి గూటికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్

హిమాచల్ ప్రదేశ్ లో ప్రతిపక్ష కాంగ్రెస్ భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హర్ష మహజన్ బుధవారం బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఓ దిశ, లక్ష్యం మాత్రమే కాదు నాయకత్వం కూడా లేని పార్టీ అని హర్ష విమర్శించారు. హర్ష ఇటీవల మృతిచెందిన మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కు అత్యంత సన్నిహితుడే కాదు మాజీ మంత్రిగా కూడా పనిచేసారు.  

12:35 PM IST

యూపీలో రక్తపాతం... రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి, 34మందికి గాయాలు

వరుస రోడ్డుప్రమాదాలతో ఉత్తర ప్రదేశ్ రోడ్లు రక్తసిక్తం అవుతున్నాయి.  లఖీంపూర్ ఖేరి ప్రైవేట్ బస్సు ప్రమాదంలో 8మంది మృతిచెంది గంటలు కూడా గడవకముందే మరో దుర్ఘటన చోటుచేసుకుంది.  బారాబంకి జిల్లా కట్కా గ్రామానికి చెందిన ఓ కార్యక్రమం కోసం ట్రాక్టర్ పై వెళుతుండగా ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రక్ ఈ ట్రాక్టర్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా వుంది. 

11:39 AM IST

భారత్ లో రికార్డ్ స్థాయిలో తగ్గిన యాక్టివ్ కరోనా కేసులు...

భారత్ లో కరోనా యాక్టివ్ కేసులు 40,979 కు చేరుకున్నాయి. గతకొద్ది రోజులుగా కరోనా కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్యే అధికంగా వుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తాజాగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,615 కొత్తకేసులు నమోదవగా 22 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,79,088 కు చేరితే మరణాల సంఖ్య 5,28,584 కు చేరాయి. 

11:10 AM IST

యూపీలో ఘోర రోడ్డుప్రమాదం... 8 మంది మృతి, 14మందికి గాయాలు

ఉత్తర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేట్ బస్సు, మినీ ట్రక్ ఎదురెదురుగా వేగంగా వచ్చి ఢీకొన్న దుర్ఘటన లఖీంపూర్ ఖేరిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 14మంది తీవ్రంగా గాయపడ్డారు. లక్నో నుండి ధౌరారాకు కు బయలుదేరిన బస్సు 730 జాతీయ రహదారిపై ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘోర ప్రమాదంపై స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. 

10:26 AM IST

కొనసాగుతున్న రూపాయి పతనం...  డాలర్ = ₹80.93

అంతర్జాతీయ మార్కెట్ లో భారత కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది. రూపాయి విలువ ఇవాళ మరోసారి 40 పైసలు దిగజారింది. దీంతో యూఎస్ డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 80.93 వద్ద నిలిచింది. 
 
9:25 AM IST

మహేష్ బాబు ఇంట విషాదం... మాతృమూర్తి ఇందిరాదేవి మృతి

గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అలనాటి సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి ఇవాళ మృతిచెందారు. ఆమె మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.  ఇందిరాదేవి మృతదేహాన్ని అభిమానుల సందర్శనార్థం పద్మాలయా స్టూడియోలో వుంచనున్నారు. అంత్యక్రియలు ఇవాళే మహాప్రస్థానంలో జరపనున్నారు. 

Read More  సూపర్ స్టార్ ఇంట తీవ్ర విషాదం, మహేష్ బాబు తల్లి ఇందిర దేవి కన్నుమూత

9:20 AM IST

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజులు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ విభాగం ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా మరో రెండ్రోజుల పాటు ఇలాగే అక్కడక్కడ భారీ వర్షాలు కొనసాగనున్నాయని ప్రకటించారు. 
 
9:19 PM IST:

మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రెండో రోజూ విచారించింది. బుధవారం దాదాపు 10 గంటల పాటు ఆయనను ప్రశ్నించింది. విదేశాల్లో పెట్టుబడులు, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై ఈడీ ఆరా తీసింది. అలాగే మంచిరెడ్డి కిషన్ రెడ్డి బ్యాంక్ లావాదేవీలపైనా ప్రశ్నల వర్షం కురిపించింది. ఇదే సమయంలో విదేశీ టూర్లపై ఈడీకి స్టేట్‌మెంట్ ఇచ్చారు మంచిరెడ్డి. 

8:07 PM IST:

విశాఖలోని సీబీఐ ప్రత్యేక కోర్టుల్లోని రెండు కోర్టుల్లో ఒకదానిని విజయవాడకు, మరో దానిని కర్నూలుకు తరలిస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైకోర్టు అడ్మిన్ రిజిస్ట్రార్ విశాఖలోని ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జికి ఆదేశాలు జారీ చేశారు. 

7:03 PM IST:

భారత కొత్త సీడీఎస్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)‌గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. దివంగత బిపిన్ రావత్ స్థానంలో త్రివిధ దళాల అధిపతిగా అనిల్‌ను ఎంపిక చేసింది కేంద్రం. 

5:51 PM IST:

తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో గడప గడపకూ మన ప్రభుత్వంపై సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన వర్క్‌షాప్ ముగిసింది. ఈ కార్యక్రమంలో 27 మంది ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు సీఎం. 175 సీట్లే టార్గెట్‌గా నేతలకు జగన్ దిశానిర్దేశం చేసినట్లుగా సమాచారం.
 
5:07 PM IST:

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక బరిలో నిలిచేందుకు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ రెడీ అయ్యారు. సెప్టెంబర్ 30న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దిగ్విజయ్ సింగ్ నామినేషన్ దాఖలు చేయనున్నట్టుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

3:50 PM IST:

భారత స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 509 పాయింట్ల నష్టంతో 56,598 వద్ద, నిఫ్టీ 148 పాయింట్ల నష్టంతో 16,858 వద్ద నిలిచాయి.  

3:20 PM IST:

కరోనా వ్యాప్తిలో లాక్ డౌన్ సమయంలో దేశ ప్రజలకు ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే మరో మూడునెలల అంటూ 2‌022 డిసెంబర్ వరకు ఈ ఉచిత రేషన్ బియ్యం పంపిణీని కొనసాగించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 
 
2:40 PM IST:

ఎలక్ట్రిక్ బైక్ పేలిన దుర్ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. వనపర్తి పట్టణంలో ఓ ఇంటివద్ద పార్క్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగి వ్యాపించాయి. ఈ మంటలు పక్కనే వున్న మరో రెండు ద్విచక్ర వాహనాలకు అంటుకుని దగ్దమయ్యాయి. ఎలక్ట్రిక్ బైక్ లో షాట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగివుంటుందని అనుమానిస్తున్నారు. 

1:33 PM IST:

హిమాచల్ ప్రదేశ్ లో ప్రతిపక్ష కాంగ్రెస్ భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హర్ష మహజన్ బుధవారం బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఓ దిశ, లక్ష్యం మాత్రమే కాదు నాయకత్వం కూడా లేని పార్టీ అని హర్ష విమర్శించారు. హర్ష ఇటీవల మృతిచెందిన మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కు అత్యంత సన్నిహితుడే కాదు మాజీ మంత్రిగా కూడా పనిచేసారు.  

12:35 PM IST:

వరుస రోడ్డుప్రమాదాలతో ఉత్తర ప్రదేశ్ రోడ్లు రక్తసిక్తం అవుతున్నాయి.  లఖీంపూర్ ఖేరి ప్రైవేట్ బస్సు ప్రమాదంలో 8మంది మృతిచెంది గంటలు కూడా గడవకముందే మరో దుర్ఘటన చోటుచేసుకుంది.  బారాబంకి జిల్లా కట్కా గ్రామానికి చెందిన ఓ కార్యక్రమం కోసం ట్రాక్టర్ పై వెళుతుండగా ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రక్ ఈ ట్రాక్టర్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరో 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా వుంది. 

11:39 AM IST:

భారత్ లో కరోనా యాక్టివ్ కేసులు 40,979 కు చేరుకున్నాయి. గతకొద్ది రోజులుగా కరోనా కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్యే అధికంగా వుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తాజాగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,615 కొత్తకేసులు నమోదవగా 22 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,79,088 కు చేరితే మరణాల సంఖ్య 5,28,584 కు చేరాయి. 

11:10 AM IST:

ఉత్తర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేట్ బస్సు, మినీ ట్రక్ ఎదురెదురుగా వేగంగా వచ్చి ఢీకొన్న దుర్ఘటన లఖీంపూర్ ఖేరిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 14మంది తీవ్రంగా గాయపడ్డారు. లక్నో నుండి ధౌరారాకు కు బయలుదేరిన బస్సు 730 జాతీయ రహదారిపై ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘోర ప్రమాదంపై స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. 

10:26 AM IST:

అంతర్జాతీయ మార్కెట్ లో భారత కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది. రూపాయి విలువ ఇవాళ మరోసారి 40 పైసలు దిగజారింది. దీంతో యూఎస్ డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 80.93 వద్ద నిలిచింది. 
 
9:25 AM IST:

గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అలనాటి సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి ఇవాళ మృతిచెందారు. ఆమె మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.  ఇందిరాదేవి మృతదేహాన్ని అభిమానుల సందర్శనార్థం పద్మాలయా స్టూడియోలో వుంచనున్నారు. అంత్యక్రియలు ఇవాళే మహాప్రస్థానంలో జరపనున్నారు. 

Read More  సూపర్ స్టార్ ఇంట తీవ్ర విషాదం, మహేష్ బాబు తల్లి ఇందిర దేవి కన్నుమూత

9:20 AM IST: