Asianet News TeluguAsianet News Telugu

డ్రగ్స్ పై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభించాం.. ఇప్పుడు ఫ‌లితాలు వ‌స్తున్నాయ్ - అమిత్ షా

డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలించడానికి 2014 నుంచి ఎన్డీఏ ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. భారత్ ను మాదక ద్రవ్యాల రహిత దేశంగా రూపొందించడం ప్రధాని మోడీ లక్ష్యం అని, దీనిని సాధించేందుకు ప్రజల సహకారం కూడా అవసరం అని తెలిపారు. 

We have adopted zero tolerance policy on drugs.. Now the results are coming - Amit Shah
Author
New Delhi, First Published Jul 30, 2022, 4:29 PM IST

మాదక ద్రవ్యాల పట్ల కేంద్రం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభించింద‌ని, దాని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం, సుసంపన్నమైన దేశం లక్ష్యాన్ని సాధించేందుకు ఇది అవసరమని ఆయన అన్నారు. అలాగే మాదకద్రవ్యాల వ్యాపారం నుండి వచ్చే మురికి డబ్బును దేశ వ్య‌తిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నందున భద్రతా విష‌యంలో ఇది ముఖ్య‌మైన‌ద‌ని అన్నారు. మాదకద్రవ్యాల రవాణా, జాతీయ భద్రతపై రెండు రోజుల జాతీయ సదస్సును శనివారం ప్రారంభించిన తర్వాత కేంద్ర హోం మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. 

monkeypox : పూర్తిగా కోలుకున్న భార‌త్ మొద‌టి మంకీపాక్స్ పేషెంట్.. ప్ర‌క‌టించిన కేరళ ఆరోగ్య మంత్రి

2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు, భారత ప్రభుత్వం డ్రగ్స్ పట్ల జీరో-టాలరెన్స్ విధానాన్ని అవలంభించింది అని అమిత్ షా అన్నారు. డ్రగ్స్‌పై పోరాటం చేయ‌డం, వేగంగా, సరైన దిశలో నిర్ణ‌యాలు తీసుకోవ‌డం వ‌ల్ల ఇప్పుడు ఫ‌లితాలు క‌నిపిస్తున్నాయ‌ని అన్నారు. డ్రగ్స్ యువ తరాన్ని చెడుగా ప్రభావితం చేస్తాయని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అలాగే చెదపురుగులలా హాని చేస్తుందని తెలిపారు. అందుకే డ్ర‌గ్స్ నివారించ‌డానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. డ్రగ్స్.. దానిని వినియోగించే వారిపైనే కాకుండా సమాజంపైనా, ఆర్థిక వ్యవస్థపైనా, దేశ భద్రతపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. అందుకే మ‌నం పూర్తిగా కలుపు తీయాలి అని చెప్పారు. 

మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ‘డ్ర‌గ్స్ ఫ్రీ ఇండియా’సంకల్పాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్న ఎన్సీపీ సిబ్బంది, ఎన్జీవోలు వారి అనుబంధ వాలంటీర్లను అమిత్ షా అభినందించారు. డ్రగ్స్‌పై ఈ పోరాటాన్ని హోం మంత్రిత్వ శాఖ సమన్వయం చేసి సంస్థాగతంగా తీర్చిదిద్దిందని చెప్పారు. అయితే డ్రగ్స్ పూర్తిగా నిర్మూలించాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరమని ఉద్ఘాటించారు. మాదక ద్రవ్యాల రహిత భారతదేశం అనే ప్రధాని మోదీ సంకల్పాన్ని నెరవేర్చడంలో ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

ఇదిలా ఉండ‌గా..ఈ స‌ద‌స్సు సందర్భంగా ఢిల్లీ, చెన్నై, గౌహతి, కోల్‌కతాలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) బృందాలు దాదాపు 31,000 కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేశాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios