Wayanad landslides: 205 కు చేరిన వయనాడ్ మృతులు

కేరళలో భారీ విపత్తు సంభవించింది. వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో 200 మందికి పైగా మృత్యువాతపడ్డారు.

 

 

 

Wayanad Landslides Tragedy: Death Toll Rises to 205 in Kerala AKP

కేరళలో ప్రకృతి మారణహోమం సృష్టించింది. రాష్ట్రంలో కురుస్తున్న కుండపోత వర్షాలు వయనాడ్ లో చాలామందిని బలితీసుకున్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతులసంఖ్య 205 కు చేరింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని విపత్తు నిర్వహణ సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.  

ఈ సంఘటన గురించి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందిస్తూ... కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే 144 మంది మృతదేహాలు లభించాయి... అందులో 79 మంది పురుషులు, 64 మంది మహిళలు వున్నారు. మరో 191 మంది కనిపించడంలేదని...వారికోసం గాలింపు కొనసాగుతోందని అన్నారు.

వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో 8017 మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చినట్లు అధికారులు తెలిపారు. బాధితుల కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నామని... వారికి భోజనంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు.ఈ క్యాంపుల్లో 1386 మంది తలదాచుకున్నట్లు అధికారులు తెలిపారు.  

ఇక కొండచరియలు విరిగిపడిన ఘటనలో గాయపడిన  201 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వమే బాధితుల వైద్య ఖర్చులతో పాటు భోజనం, వసతి ఏర్పాట్లు చూస్తోందని అధికారులు తెలిపారు. ఇక ఈ ఘటనలో కనిపించకుండా పోయినవారికి వెతికే పనిలో వెయ్యమందికి పైగా రెస్క్యూ సిబ్బంది పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.  . 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios