కనీసం ఒక్కరైనా చావాల్సిందే: షాకింగ్ వీడియో

Video of anti-Sterlite protest shows cop saying 'at least 1 should die'
Highlights

స్టెరిలైట్ యూనిట్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన విషయంలో దిగ్భ్రాంతికరమైన వీడియో వెలుగు చూసింది. 

తుతికోరిన్: స్టెరిలైట్ యూనిట్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన విషయంలో దిగ్భ్రాంతికరమైన వీడియో వెలుగు చూసింది. మఫ్టీలో ఉన్న తమిళనాడు పోలీసు అధికారి పోలీసు ఆందోళనకారులకు కొద్ది దూరంలో ఉన్న పోలీసు బస్సుపైకి ఎక్కిన వీడియో వెలుగు చూసింది.

ఇతర పోలీసులు అసాల్ట్ రైఫిల్స్ ధరించి, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి వాహనం వద్ద నిలబడ్డారు. వెనక నుంచి మరో పోలీసులు వ్యాన్ పైకి ఎక్కుతున్న దృశ్యం కనిపించింది. అప్పటికే వాహనంపై ఉన్న పోలీసుకు అసాల్ట్ రైఫిల్ అందించాడు. 

బస్సుపైన పాకుతూ పొజిషన్ తీసుకున్న పోలీసు వీడియోలో స్పష్టంగా కనిపించాడు .వెనక నుంచి దిగ్భ్రాంతికి గురి చేసే గొంతు వినిపించింది. కనీసం ఒక్కరైనా చావాలి అనేది ఆ గొంతు నుంచి వెలువడిన మాట.

ఆ మాటలు వినిపించిన కొద్దిసేపటికే ఆ పోలీసు కాల్పులు జరిపాడు. మంగళవారంనాడు స్టెరిలైట్ వ్యతిరేక ఆందోళన సందర్భంగా మంగళవారంనాడు తుతికొరిన్ లో 11 మంది మరణించిన విషయం తెలిసిందే.

ఆ సంఘటనను రాహుల్ గాంధీ హత్యగా, ప్రభుత్వ ప్రోత్సహించిన టెర్రరిజంగా అభివర్ణించారు.  

loader