వెల్లూరు:16 ఏళ్ల చెల్లెపై 17 ఏళ్ల అన్న పలుమార్లు అత్యాచారం చేశాడు. దాంతో బాలిక గర్భం దాల్చింది. మైనర్ అయిన నిందితుడిని వెల్లూరు ఆల్ వుమెన్ పోలీసులు అరెస్టు చేశారు. ఎనిమిది నెలల గర్భంతో ఉన్న బాలికను పోలీసులు వెల్లూరు శిశు సంక్షేమ కమిటీ (సీడబ్ల్యుసీ)కి అప్పగించారు. 

నిందితుడు తండ్రి ఓ దినసరి కూలీ పెద్ద కుమారుడు. తండ్రి పెరుముగాయి సమీపంలోని ఓ గ్రామానికి చెందినవాడు. నిందితుడు పదో తరగతి చదివి రెండేళ్ల క్రితం చదువు మానేశాడు. చిన్నచితకా పనులు చేస్తూ ఉంటాడు. సంపాదన వస్తుండడంతో అతను మద్యం సేవించడం ప్రారంభించాడు. 

Also Read: చెల్లెలిపై అన్న అత్యాచారం: అవమానంతో బాలిక ఆత్మహత్య

కుమారుడిపై అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పేదరికం కారణంగా తన కూతురు కూడా చదువు మానేసిందని, తనకు ఇంటి పనుల్లో సాయం చేస్తూ ఉంటుందని ఆమె చెప్పింది. ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో 8 నెలల క్రితం మొదటిసారి అతను చెల్లెపై అఘాయిత్యం చేశాడు. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్తే ఆత్మహత్య చేసుకుంటానని అతను చెల్లెను బెదిరించాడు. 

కూతురికి నెలసరి రాకపోవడంతో తల్లికి అనుమానం వచ్చింది. ఆమెను ప్రైవేట్ క్లినిక్ కు తీసుకుని వెళ్లింది. కనీసం ఆమెకు నెలల గర్భం ఉందని డాక్టర్ తల్లితో చెప్పాడు. దాంతో షాక్ తిన్న తల్లి వెల్లూరు లోని ఆల్ వుమెన్ పోలీసు స్టేషన్ లో బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఇన్ స్పెక్టర్ కె. సుధ కేసు నమోదు చేసుకున్నారు.