విరసం నేత వారవారం రావు అరెస్ట్ అయి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. భీమ కొరేగావ్ కేసుకు సంబంధించి వారవారం రావు అరెస్టయి మహారాష్ట్రలోని జైల్లో ఉన్నారు. ఇక ఇదే కేసుకు సంబంధించి వరవరరావు అల్లుడు, ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణకు కూడా ఎన్ఐఏ నోటీసులు జారీ చేసింది. 

ఈ నెల 9వ తేదీన భీమా కోరేగావ్ కేసుకు సంబంధించి విచారణకు హాజరవ్వాలని ఎన్ఐఏ ఆదేశాలిచ్చింది. అయితే ఈకేసుకు సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదు అని సత్య ఇప్పటికే ప్రకటించారు. తనకు సంబంధం లేని విషయంలో నోటీసులు ఇవ్వడమేమిటని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. 

వరవరరావు ఆరోగ్యం గురించి తామంతా ఆందోళన పడుతున్న వేళ..... తనకు కూడా నోటీసులు ఇవ్వడమేమిటని, ఇలా చేయడం తమ కుటుంబాన్ని మానసిక క్షోభకు గురిచేయడమే అని సత్య వాపోయారు. 

ఇకపోతే.... మహారాష్ట్ర జైల్లో నిర్బంధించి ఉన్న అభ్యదయ రచయిత వరవరరావును విడుదల చేయించాలని కోరుతూ తిరుపతి ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి లేఖ రాశారు. 

ప్రధానమంత్రిని హతమార్చడా‌ని కుట్రపన్నారన్న ఆరోపణపై వరవరరావును‌ కొన్ని నెలల క్రితం మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి‌ ఆయన అక్కడి జైల్లోనే ఉన్నారు. ఎనిమిది పదులు పైబడిన వయసులో ఉన్న ఆయనకు కరోనా సోకినట్లు వార్తలొచ్చాయి. 

ఇప్పటికే శారీరకంగా చిక్కిశల్యమైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయన్ను బెయిల్ మీద విడిపించడానికి కుటుబ సభ్యులు సహా ప్రజాస్వామికవాదులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపి) ఎమ్మెల్యే బూమన కరుణాకర్ రెడ్డి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి లేఖ రాశారు.‌

వరవరరావు ను విడుదలయ్యేలా చూడాలని ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కూడా కోరారు. వరవరరావు ఆరోగ్యం క్షీణించి ఆయన మానసిక స్థితి కూడా సరిగా లేదని 80 సంవత్సరాలు పైబడ్డ వ్యక్తిని ఇలాంటి పరిస్థితుల్లో జైలు నుంచి విడిపించేలా చూడమని వారు కోరారు.