ఓ మహిళకు మత్తు మందు ఇచ్చి.. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీశారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్ నగర్ కి చెందిన 30 ఏళ్ల మహిళను ముగ్గురు వ్యక్తులు బలవంతంగా మత్తు మందు ఇచ్చారు.  అపస్మారక స్థితిలోకి వెళ్లి పోయిన ఆ మహిళను సమీపంలోని ఓ అడవిలోకి తీసుకువెళ్లారు.

అనంతరం ఆమెను కిడ్నాప్ చేసిన ముగ్గురిలో ఒకరు ఆమెపై అత్యాచారానికి పాల్పడగా..మరో ఇద్దరు దానిని వీడియో తీశారు. అంతేకాదు.. ఆ వీడియో తీసిన ఇద్దరు వ్యక్తులు కూడా ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితురాలికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.