తాను ప్రేమించిన అమ్మాయి.. తనను కలవడానికి అంగీకరించలేదని ఆగ్రహంతో ఊగిపోయాడు. తన అంతు చూడాలని భావించాడు. ఈ క్రమంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడి అనంతరం అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరడాంకి జిల్లాకు చెందిన ఓ 17ఏళ్ల యువతికి అదే ప్రాంతానికి చెందిన యువకుడిని ప్రేమించింది. అయితే.. వారి ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలిసిపోయింది. దీంతో.. తల్లిదండ్రులు సదరు యువతిని మందలించారు. దీంతో.. యువతి ప్రియుడిని దూరం పెట్టడం మొదలుపెట్టింది. అతను కలుద్దామని పలుమార్లు అడిగినా ఆమె కలవడానికి అంగీకరించలేదు. దీంతో.. ఆమెపై పగ పెంచుకున్నాడు.

ఈ క్రమంలో అనుకోకుండా యువతి కనిపించకుండా పోయింది. పలుచోట్ల వెతికినప్పటికీ యువతి ఆచూకీ లభించలేదు. దీంతో.. వెంటనే యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె బాయ్ ఫ్రెండ్ పైనే వాళ్లు అనుమానం వ్యక్తం చేయడంతో సదరు యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.

కాగా.. విచారణలో అతను అసలు విషయాలు వెల్లగక్కాడు. యువతిని తానే హత్య  చేసినట్లు అంగీకరించాడు. ఎన్నిసార్లు కలుద్దామన్నా కలవడానికి అంగీకరించలేదని.. ఆ కారణంతోనే  చంపేశానని చెప్పాడు.

చివరిసారిగా కలవాలంటూ యువతిని తన వద్దకు రప్పించుకున్నానని.. ఆ తర్వాత యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పాడు. అనంతరం హత్య చేసి తన స్నేహితుడి సహాయంతో శవాన్ని ఓ కెనాల్ లో పడేసినట్లు చెప్పాడు. అతను చెప్పిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా.. యువతి మృతదేహం బయటపడింది. నిందితుడితో పాటు అతనికి సహకరించిన స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకున్నామని.. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.