రాఖీ అంటే.. అన్నచెల్లెల్ల బంధానికి ప్రతీకగా భావిస్తుంటాం. తనకు ఎలాంటి అపాయం కలగకుండా కాపడతామని నమ్మకం ఇవ్వమని కోరుతూ సోదరీమణులు.. తమ సోదరులకు రాఖీలు కడుతుంటారు. అయితే.. అలా రాఖీ కట్టేందుకు వెళ్లిన యువతిపై ఓ కమాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

ఆగస్టు 26న రాఖీ పండుగను పురస్కరించుకొని తన సోదరుడు వరస అయ్యే యువకుడికి రాఖీ కట్టేందుకు 15 ఏళ్ల అమ్మాయి.. అతడి ఇంటికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన 21 ఏళ్ల యువకుడు.. ఆ బాలికను తన ఇంట్లో నిర్బంధించాడు. ఆ తర్వాత వరుసగా రెండు రోజులు ఆమెపై అత్యాచారం చేశాడు. జరిగిన విషయాన్ని బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.