ఉత్తర ప్రదేశ్ ఆర్థిక వృద్దిలో ఈ 10 రంగాలే కీలకం : సీఎం యోగి ఫోకస్ అంతా వాటిపైనే

ఉత్తరప్రదేశ్‌ను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయత్నిస్తున్నారు.ఈ దిశగా వివిధ రంగాల్లో పురోగతిని సమీక్షించి, భవిష్యత్తు వ్యూహాలను చర్చించారు.

UP CM Yogi Adityanath Reviews Trillion Dollar Economy Roadmap AKP

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రయత్నాల్లో వున్నారు. ఈ దిశగా ఇప్పటివరకు సాధించిన ఫలితాలు, భవిష్యత్తు విధానంపై చర్చించేందుకు తాజాగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, సలహాదారులు, నిపుణులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో 10 రంగాల్లో జరుగుతున్న పనులను సమీక్షించారు. కన్సల్టింగ్ ఏజెన్సీ డెలాయిట్ ఇండియా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, భవిష్యత్ అంచనాలు, పరిశ్రమల అనుకూలతల గురించి రంగాలవారిగా వివరించింది.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి యోగి కామెంట్స్...

● గత 7 సంవత్సరాల ప్రణాళికాబద్ధమైన కృషి ఫలితంగా ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అత్యుత్తమ స్థితిలో ఉంది. 2021-22లో రాష్ట్ర జీడీపీ ₹16.45 లక్షల కోట్లు కాగా, 2023-24లో ₹25.48 లక్షల కోట్లకు పెరిగింది. ఈ సంవత్సరం యూపీ జీడీపీ లక్ష్యం ₹32 లక్షల కోట్లు. అందరి సహకారంతో ఈ లక్ష్యం కూడా నెరవేరుతుంది. ఈ 7 సంవత్సరాలలో జీడీపీ, తలసరి ఆదాయం రెండింతలు పెరిగాయి. ఉత్తరప్రదేశ్ నేడు దేశంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, దేశ అభివృద్ధికి గ్రోత్ ఇంజన్‌గా మారింది. 

● రంగాలవారిగా ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలకు అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వివిధ రంగాలకు నిర్దేశించుకున్న జీవీఏ కంటే ఎక్కువ వృద్ధి నమోదైంది. వ్యవసాయం, అనుబంధ రంగాలకు అంచనా వేసిన జీవీఏ 5.85 లక్షల కోట్లకు గాను 5.98 లక్షల కోట్లు, తయారీ రంగానికి 2.48 లక్షల కోట్లకు గాను 2.79 లక్షల కోట్లు, రవాణా, నిల్వ, సమాచార రంగాలకు అంచనా వేసిన జీవీఏ కంటే 129% ఎక్కువ వృద్ధి నమోదైంది. వాణిజ్యం, హోటళ్ళు, రవాణా, ప్రసార రంగాల వృద్ధి రేటు పెరిగింది. ఇతర రంగాల్లో కూడా ఇదే పరిస్థితి. మొత్తం మీద 2023-24లో రాష్ట్రానికి అంచనా వేసిన జీఎస్వీఏ 23 లక్షల కోట్లకు గాను 23.24 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది ఆర్థిక వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉందని చూపిస్తుంది.

● $1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించడంలో అన్ని శాఖల పాత్ర కీలకం. ఇది పెద్ద లక్ష్యం. గత సంవత్సర నివేదిక శాఖల చురుకుదనాన్ని చూపిస్తుంది. ప్రభుత్వ విధానం, ప్రణాళిక సరైనది.  కాబట్టి పెద్ద లక్ష్యానికి వేగాన్ని పెంచాలి. దీనికి క్రమం తప్పకుండా పర్యవేక్షణ అవసరం. ప్రతి శాఖలో దీనికి ఒక నోడల్ అధికారిని నియమించాలి. నోడల్ అధికారి వారానికోసారి, ప్రధాన కార్యదర్శి స్థాయిలో రెండు వారాలకోసారి, శాఖా మంత్రి స్థాయిలో నెలకోసారి సమీక్షా సమావేశం నిర్వహించాలి.

UP CM Yogi Adityanath Reviews Trillion Dollar Economy Roadmap AKP

● డేటా సేకరణ ఖచ్చితంగా ఉండాలి. దీనికోసం MoSPI (మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్) తో సంప్రదింపులు కొనసాగించాలి. వారి అనుభవాన్ని ఉపయోగించుకోవాలి. సరైన అంచనా కోసం శాఖల వారీగా గణాంక అధికారులకు వర్క్‌షాప్‌లు/ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి. డేటా ఎంత ఖచ్చితంగా ఉంటే, లక్ష్యం కోసం మనం అంత మెరుగ్గా ప్రయత్నించగలం.

● 2023-24లో రాష్ట్ర సీఏజీఆర్ 16%గా నమోదైంది. ఇది సంతోషకరమైన విషయం. ప్రస్తుత సంవత్సరానికి 25% లక్ష్యం. అన్ని శాఖలు తమ ప్రయత్నాలను వేగవంతం చేయాలి. మన లక్ష్యం స్పష్టం. సరైన విధానం, ప్రణాళికాబద్ధమైన అమలు కోసం అందరూ కలిసి కృషి చేయాలి.

● ప్రతి రంగంలో అవకాశాలున్నాయి, మనం నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలి. వ్యవసాయ రంగంలో సీడ్ ఎకోసిస్టమ్‌ను మెరుగుపరచాలి, దీనికోసం సీడ్ పార్క్‌ల వంటి ప్రయత్నాలను పెంచాలి. రైతులను పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల సాగుకు ప్రోత్సహించాలి. పంటల వైవిధ్యం, సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలి.

● ధాన్యాలు, పండ్లు, కూరగాయల ఉత్పత్తి వృద్ధి రేటును రెట్టింపు చేయడానికి కృషి చేయాలి. ఉద్యానవనంలో 'ఒక బ్లాక్-ఒక పంట' వంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలి. రైతులకు శిక్షణ ఇవ్వాలి, వనరులు కల్పించాలి, నూతన ఆవిష్కరణలను అవలంబించేలా ప్రోత్సహించాలి.

● సంస్కరణలు, పనితీరు, పరివర్తన అనే మంత్రం ఆర్థిక వ్యవస్థ యొక్క ద్వితీయ రంగంలో అత్యుత్తమ ఫలితాలను ఇచ్చింది. తయారీ రంగం వృద్ధి రేటు ఉత్సాహాన్ని కలిగిస్తుంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ల్యాండ్ బ్యాంక్ విస్తరణ, విధానపరమైన సంస్కరణలు, వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచాలి. అనేక మంది పెట్టుబడిదారులు ఉత్తరప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వస్త్ర పార్కులు, సౌర పార్కులు, ప్లగ్ పార్కులకు అనేక ప్రతిపాదనలు వస్తున్నాయి. మనం ఈ అనుకూలమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

● పారిశ్రామిక ప్రాజెక్టులకు భూమి అవసరం. అందరూ అదనపు ప్రయత్నాలు చేయాలి. గ్రామ సమాజ భూములను పారిశ్రామిక అభివృద్ధి, ఎంఎస్ఎంఈలకు ఉపయోగించేలా చర్యలు తీసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ విధానాన్ని మెరుగుపరచాలి. కేటాయించిన కానీ ఉపయోగించని భూములను గుర్తించాలి. వాటి గురించి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. 'సిక్ యూనిట్ల'ను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలి. పారిశ్రామిక క్లస్టర్ల ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాలి.

● పెట్టుబడులు, భూసేకరణకు సంబంధించిన అంశాలు పెండింగ్‌లో ఉండకూడదు. దీనికి జిల్లా కలెక్టర్లను బాధ్యులను చేస్తారు. ఎంఓయులను అమలు చేయాలి. వివిధ అనుమతుల ప్రక్రియను సమయబద్ధం చేయాలి. నిర్ణీత గడువు దాటితే అనుమతులు లభించినట్లుగా భావించాలి. ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను మరింత ప్రభావవంతం చేయాలి.

● $1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యానికి ప్రైవేట్, ప్రభుత్వ పెట్టుబడులను పెంచాలి. పెట్టుబడిదారులతో సంప్రదింపులు కొనసాగించాలి. కొత్త రంగాలు, కొత్త పెట్టుబడిదారులతో సంప్రదించాలి. రాష్ట్ర ప్రత్యేకతలను వారికి తెలియజేయాలి. పెట్టుబడిదారుల ఔట్రీచ్‌ను మెరుగుపరచాలి. సింగిల్ విండో వ్యవస్థను మరింత సులభతరం, పారదర్శకంగా చేయాలి.

UP CM Yogi Adityanath Reviews Trillion Dollar Economy Roadmap AKP

● ఇంధన రంగం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనిచేయాలి. సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం విధానం ప్రకటించింది. సౌర, బయోమాస్ రంగాల్లో పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. సౌర ఇంధన సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి పెట్టాలి. రాష్ట్రంలో పీఎం సూర్య గృహ యోజన కవరేజీని పెంచాలి.

● హోటళ్ళు/రెస్టారెంట్లు, రవాణా, సమాచారం, రియల్ ఎస్టేట్, వృత్తిపరమైన సేవలు, ఇతర సేవలతో కూడిన తృతీయ రంగంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయోధ్య, మథుర-వృందావన్, కాశీ, ప్రయాగరాజ్, నైమిశారణ్యం ఇందులో ముఖ్య కేంద్రాలు. గత 7 సంవత్సరాలలో ఇక్కడ విస్తృతమైన మార్పులు వచ్చాయి. పర్యాటకుల సంఖ్య అపూర్వంగా పెరిగింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు 62 కోట్లకు పైగా పర్యాటకులు వచ్చారు. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తోంది. వచ్చే ఏడాది ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా జరుగుతుంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. నైమిశారణ్యం, వింద్యధామ్ వంటి కేంద్రాలను గుర్తించి వాటి బ్రాండింగ్‌ను మెరుగుపరచాలి. బౌద్ధ సర్కిట్‌ను సంబంధిత దేశాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి. పర్యాటక ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి.

● ఐటీ రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చారు. గౌతం బుద్ధ నగర్ నేడు ఐటీ/ఐటీఈఎస్ రంగంలో ప్రపంచ స్థాయి కేంద్రంగా అవతరించింది. రాష్ట్రంలో ఐటీ/ఐటీఈఎస్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేయాలి. లక్నోలో ఏఐ సిటీ కోసం భూమిని గుర్తించారు, దీనికి సంబంధించిన విధానాన్ని త్వరలోనే తీసుకురావాలి. ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలి. డ్రోన్ల తయారీ, శిక్షణకు కూడా ప్రతిపాదనలు వచ్చాయి, దీని అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి మనం త్వరలోనే డ్రోన్ విధానాన్ని ప్రకటించాలి. స్టార్టప్‌ల నమోదు కోసం కాన్పూర్‌తో పాటు నోయిడాలో కూడా కార్యాలయం ప్రారంభించాలి.

● రవాణా రంగం అభివృద్ధికి కృషి చేయాలి. సేవలు అందని ప్రాంతాలకు బస్సులను నడపాలి. ప్రైవేట్ రంగ సహకారం తీసుకోవాలి. జలమార్గ రవాణాకు సంబంధించిన అథారిటీని ఏర్పాటు చేశారు, ఈ రంగంలో కూడా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయి.

● ఆసుపత్రులు, గృహనిర్మాణం, హోటళ్ళు వంటి రంగాల్లో ప్రైవేట్ రంగం నుంచి పెద్ద ఎత్తున ప్రతిపాదనలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ రంగంలో మరింత వృద్ధి కనిపిస్తుంది. నిబంధనలను సరళీకరించాలి, ఆచరణాత్మకతను దృష్టిలో ఉంచుకోవాలి. పెట్టుబడిదారుల అంచనాలను అర్థం చేసుకోవాలి. ఈ రంగం ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను కూడా మెరుగుపరుస్తుంది.

● $1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యానికి ప్రతి శాఖకు లక్ష్యాలను ఇప్పటికే నిర్దేశించారు. వాటి పురోగతిని నిరంతరం సమీక్షించాలి. ప్రతి శాఖ సామర్థ్యాన్ని పెంచాలి. సంస్కరణల ప్రణాళికను రూపొందించి, అమలు చేయాలి. ప్రతి పనికి గడువు నిర్ణయించాలి. 2016-17లో ఎక్సైజ్ నుంచి కేవలం 12 వేల కోట్ల ఆదాయం వచ్చేది, నేడు 52 వేల కోట్ల ఆదాయం వస్తోంది. అంటే లోపం సామర్థ్యంలో కాదు, సంకల్పంలో ఉంది.

● ఆత్మనిర్భర్ ఉత్తరప్రదేశ్ కోసం పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీలు ఆత్మనిర్భర్‌గా ఉండాలి. వాటి ఆదాయాన్ని పెంచడానికి ప్రణాళిక రూపొందించాలి. గ్రామం అయినా, పట్టణం అయినా, ప్రతిచోటా ప్రజలకు మంచి రోడ్లు, శుద్ధిచేసిన త్రాగునీరు, మెరుగైన ప్రజా సౌకర్యాలు అందుబాటులో ఉండాలి. ఆకాంక్షాత్మక జిల్లాలు, ఆకాంక్షాత్మక బ్లాకుల పురోగతిని నిరంతరం సమీక్షించాలి, లోపాలుంటే సరిదిద్దాలి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios