కేంద్ర బడ్జెట్-2019 హైలెట్స్

union budget 2019 live updates

1:37 PM IST

డిజిటల్ చెల్లింపులపై నో ట్యాక్స్

డిజిటల్ చెల్లింపులపై ఎటువంటి పన్ను లేదని ప్రకటించారు నిర్మలా సీతారామన్. వ్యాపార లావాదేవీల్లో నగదు చెల్లింపులను అరికట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 

1:33 PM IST

ఎలక్ట్రిక్ వాహనాలు వాడితే పన్ను రాయితీ

ఎలక్ట్రిక్ వాహనాలపై 5 శాతం జీఎస్టీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి.. ఎలక్ట్రిక్ వాహనాలు వాడే వారికి ఆదాయంలో అదనంగా రూ. 1.5 లక్షలకు  పన్ను ఉండదని ప్రకటించారు. 

1:31 PM IST

కంపెనీలకు 25 శాతం కార్పోరేట్ ట్యాక్స్

రూ.400 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు 25 శాతం కార్పోరేట్ ట్యాక్స్‌ను విధిస్తున్నట్లు నిర్మల తెలిపారు. దేశంలోని సుమారు 99.3 శాతం కంపెనీలకు ఇది వర్తిస్తుందని ఆర్ధిక మంత్రి వెల్లడించారు. 

1:28 PM IST

పెరగనున్న బంగారం, పెట్రోల్, డీజిల్ ధరలు

బంగారంపై 12.50 శాతం కస్టమ్స్ సుంకం, పెట్రోల్, డీజిల్‌పై 1 శాతం ఎక్సైజ్ సుంకం పెంచుతున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రకటించారు. 
 
1:26 PM IST

ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణ

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే నష్టాల నుంచి ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులకు విముక్తి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం రూ. లక్షా 5వేల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 

1:20 PM IST

దేశవ్యాప్తంగా 17 పర్యాటక కేంద్రాల అభివృద్ది

పర్యాటక రంగాన్ని ప్రొత్సహించేందుకు గాను దేశంలోని 17 పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. 
 
1:15 PM IST

పెరిగిన ప్రత్యక్ష పన్నుల వసూళ్లు

ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 78 శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రకటించారు. 2018లో ఇవి 11.37 లక్షల కోట్లుగా నిర్మల తెలిపారు. 

1:13 PM IST

బ్యాంక్ ఖాతా నుంచి నగదు విత్ డ్రా పరిమితి పెంపు

బ్యాంకు ఖాతా నుంచి ఏడాదికి రూ. కోటి వరకు నగదును ఉపసంహరించేందుకు నిర్మల అవకాశం కల్పించారు. రూ. కోటి దాటితే 2 శాతం టీడీఎస్‌ ఉంటుందని.. అలాగే పాన్ నెంబర్ లేకపోయినప్పటికీ ఐటీ రిటర్న్స్ దాఖలుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. పాన్ లేదా ఆధార్ నెంబర్‌తో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసుకోవచ్చని నిర్మల పేర్కొన్నారు. 

1:11 PM IST

గృహ రుణాలపై వడ్డీ రాయితీ

మధ్యతరగతి ప్రజల గృహ రుణాలపై ఆర్ధికమంత్రి కరుణ చూపారు. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసే వారికి ప్రోత్సాహకాలు. రూ. 45 లక్షలలోపు గృహ రుణాలపై రూ. 3.5 లక్షలు వడ్డీ రాయితీ అందిస్తామన్నారు. గతంలో వున్న వడ్డీ రాయితీని రూ. 2 లక్షల నుంచి రూ. 3.50 లక్షలకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. 

1:08 PM IST

ఆఫ్రికా దేశాల్లో కొత్త రాయబార కార్యాలయాలు

ఇతర దేశాలతో సన్నిహిత సంబంధాల కోసం తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. దీనిలో భాగంగా ఆఫ్రికా దేశాల్లో 18 కొత్త రాయబార కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా నిర్మలా సీతారామన్ తెలిపారు. 

1:04 PM IST

ఉజ్వల యోజన కింద ఎల్‌ఈడీ బల్బులు

ఉజ్వల యోజన కింద దేశవ్యాప్తంగా 35 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఎల్ఈడీ బల్బుల ద్వారా రూ. 18,341 కోట్ల విలువైన విద్యుత్ ఆదా అవుతుందని నిర్మల వెల్లడించారు.  

12:59 PM IST

కార్మికుల కోసం ప్రధానమంత్రి పెన్షన్ యోజన

దేశవ్యాప్తంగా ఉన్న 30 లక్షల మంది కార్మికుల శ్రేయస్సు కోసం ప్రధానమంత్రి పెన్షన్ యోజనను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 

12:58 PM IST

గ్రామాల కోసం భారత్ నెట్

ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ అందించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా భారత్ నెట్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. 

12:54 PM IST

నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు

దేశంలో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలకు పెద్ద పీట వేస్తామన్నారు. దీనిలో భాగంగా నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 

12:51 PM IST

ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ తగ్గింపు

ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు ఆర్ధికమంత్రి తెలిపారు. సుమారు 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించే అంశం ప్రస్తుతం జీఎస్టీ మండలి పరిశీలిస్తోందని నిర్మల పేర్కొన్నారు. 

12:49 PM IST

రూ.5 లక్షల ఆదాయం వరకు నో ట్యాక్స్

రూ. 5 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు నిర్మలా సీతారామన్. పన్నుల విధానంలో పారదర్శకత తీసుకొస్తామని.. కార్పోరేట్ ట్యాక్స్ పరిధి రూ. 400 కోట్లకు పెంచుతున్నట్లు తెలిపారు. 

12:47 PM IST

మెగా మ్యాన్యుఫాక్చరింగ్ జోన్లు

దేశంలో మెగా మ్యాన్యుఫ్యాక్చరింగ్ జోన్లు ఏర్పాటు చేస్తామని.. బ్యాటరీ, సౌరశక్తి రంగంలో విదేశీ కంపెనీలను అనుమతిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 
     
12:44 PM IST

ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు

ఏడాదిలోగా ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేస్తామని ఆర్ధిక మంత్రి తెలిపారు. ఉన్నత విద్యాకేంద్రంగా ఎదిగేందుకు భారతదేశానికి ఎన్నో అవకాశాలున్నాయని ఆమె గుర్తు చేశారు. మన విద్యాసంస్థల్లోకి విదేశీ విద్యార్ధుల రాక మరింత పెరిగాలని నిర్మల ఆకాంక్షించారు.

12:42 PM IST

ఎన్నారైలకు ఆధార్ కార్డ్

భారతీయ పాస్‌పోర్ట్ ఉన్న ప్రతి ఒక్క ఎన్నారైకి ఆధార్ కార్డులను కేటాయిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. 

12:41 PM IST

స్వయం సహాయక బృందాలకు ముద్ర యోజన

స్వయం సహాయక బృందాలకు సైతం ముద్రా యోజనను వర్తింప చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రతి స్వయం సహాయక బృందంలో ఒకరికి రూ.లక్ష వరకు ముద్ర రుణం అందిస్తామని వెల్లడించారు. 
     
12:39 PM IST

బ్యాంకులకు స్వాంతన

రుణ సంక్షోభంతో అల్లాడుతున్న ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులను రుణ సంక్షోభం నుంచి గట్టెక్కిస్తామని నిర్మల వెల్లడించారు. వాణిజ్య బ్యాంకుల్లో రూ.లక్ష కోట్ల మేర నిరర్థక ఆస్తులు తగ్గాయని ఆమె తెలిపారు. 
 
12:38 PM IST

కొత్తగా రూ.20 నాణేం

కొత్తగా 1, 2, 5, 10, 20 నాణేలను తీసుకొస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. 

12:33 PM IST

కొత్తగా జలశక్తి మంత్రిత్వ శాఖ

కొత్తగా జలశక్తి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మల తెలిపారు. హర్‌ ఘర్ జల్ పథకంలో భాగంగా ఇంటింటికీ నీటి సరఫరా

12:32 PM IST

మత్స్య సంపద యోజన

మత్స్యకారుల కోసం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజనను ఏర్పాటు చేస్తున్నట్లుగా నిర్మలా సీతారామన్ తెలిపారు. 

12:30 PM IST

విదేశీ విద్యార్ధుల కోసం స్టడీ ఇన్ ఇండియా

విదేశీ విద్యార్ధులు భారత్ వచ్చి చదవుకునేందుకు వీలుగా స్టడీ ఇన్ ఇండియా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో టాప్- 200 విద్యాసంస్ధల్లో 3 భారత విద్యాసంస్థలు ఉన్నాయని ఆర్ధిక మంత్రి గుర్తు చేశారు. 

12:28 PM IST

క్రీడల కోసం ఖేల్ ఇండియా

దేశంలో క్రీడలను ప్రొత్సహించేందుకు వీలుగా ఖేల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. 

12:27 PM IST

దేశవ్యాప్తంగా నాలుగు కార్మిక న్యాయస్థానాలు

కార్మిక సమస్యల పరిష్కారానికి వీలుగా దేశవ్యాప్తంగా నాలుగు కార్మిక న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

12:25 PM IST

స్టార్టప్‌ల కోసం కొత్త ఛానెల్

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను మరింత ప్రోత్సాహించేందుకు వీలుగా స్టార్టప్‌ల కోసం దూరదర్శన్‌లో ప్రత్యేకంగా కొత్త ఛానల్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వీటి నిర్వహణ బాధ్యత కూడా స్టార్టప్‌లకే అప్పగిస్తున్నట్లుగా ఆమె ప్రకటించారు. 

12:22 PM IST

వెనుకబడిన యువత కోసం స్టాండప్ ఇండియా

స్టాండంప్ ఇండియా పథకం ద్వారా వెనుకబడిన వర్గాల యువతకు శిక్షణ ఇస్తున్నట్లు నిర్మల తెలిపారు. పీపీపీల పరంగా అమెరికా, చైనాల తర్వాత భారత్ మూడో ఆర్ధిక వ్యవస్థగా ఉందని ఆమె వెల్లడించారు. 

12:21 PM IST

ప్రధానమంత్రి డిజిటల్ సాక్షరత యోజన

ప్రధాన మంత్రి డిజిటల్ సాక్షరత యోజన పథకం కింద సుమారు 2 కోట్ల మంది గ్రామీణ యువతకు శిక్షణ అందించామని .. శరవేగంగా జరుగుతున్న పట్టణీకరణను ఒక అవకాశంగా చూస్తున్నట్లు నిర్మల తెలిపారు. 
 
12:20 PM IST

256 జిల్లాల్లో జల్‌శక్తి అభియాన్

ఇళ్ల నుంచి వచ్చే నీటిని తిరిగి సాగుకు యోగ్యంగా మలిచేందు కోసం జల్ శక్తి అభియాన్‌‌ను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మల తెలిపారు. దేశంలోని 256 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు . 

12:17 PM IST

పరిశ్రమలకు వేగంగా అనుమతులు

మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్ తమ ప్రభుత్వ విధానమని.. పరిశ్రమలకు అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేస్తామని నిర్మల తెలిపారు. 
 
12:14 AM IST

పీఎంఏవై అర్బన్ కింద 81 లక్షల ఇళ్లు

పట్టణ ప్రాంతాల్లోని పేదల కోసం పీఎంఏవై అర్బన్ కింద 81 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతినిస్తున్నట్లుగా నిర్మల వెల్లడించారు. దీనిలో భాగంగా ఇప్పటికే 13 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని ఆమె తెలిపారు. 

12:13 PM IST

బహిరంగ మల మూత్ర విసర్జన నుంచి విముక్తి

గత ఐదేళ్లలో 9.6 కోట్ల టాయిలెట్‌లు నిర్మించామని.. 5.6 లక్షల గ్రామాలకు బహిరంగ మలమూత్ర విసర్జన నుంచి విముక్తి లభించేలా చేశామని నిర్మలా సీతారామన్ తెలిపారు. 

12:10 PM IST

జలజీవన్ మిషన్ ద్వారా తాగునీరు

జలజీవన్ మిషన్ ద్వారా 2024 నాటికి దేశంలోని ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామన్నారు.

12:08 PM IST

కొత్తగా 10 వేల రైతు సంఘాలు

వ్యవసాయ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు ఆహ్వానిస్తామని.. పప్పు ధాన్యాల విప్లవం తీసుకువస్తామని నిర్మల తెలిపారు. కొత్తగా 10 వేల రైతు సంఘాలను ఏర్పాటు చేస్తామని.. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. పెట్టుబడులు లేకుండా రైతు వ్యవసాయం చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.     

12:05 PM IST

సంప్రదాయ పరిశ్రమల కోసం క్లస్టర్లు

సంప్రదాయ పరిశ్రమల ప్రొత్సాహానికి క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది వంద క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. 

12:04 PM IST

కొత్త రోడ్ల నిర్మాణానికి రూ.80,250 కోట్లు

ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 30 వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మిస్తామని.. ఫేజ్-3లో లక్షా 25 వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణంతో పాటు ఆధునీకరణ పనులు చేపడతామన్నారు. రోడ్ల నిర్మాణానికి వేస్ట్ ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తామని నిర్మల స్పష్టం చేశారు. కొత్త రోడ్ల నిర్మాణానికి రూ.80,250 కోట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. 

12:03 AM IST

న్యూ స్పేస్ ఇండియా కంపెనీ లిమిటెడ్ ఏర్పాటు

ప్రపంచంలోనే భారత్ సరికొత్త అంతరిక్ష శక్తిగా అవతరిస్తోందని.. ఇస్రో సేవలను వాణిజ్యపరంగాను అభివృద్ధి చేసేందుకు న్యూ స్పేస్ ఇండియా కంపెనీ లిమిటెడ్‌ను ఏర్పాటు చేస్తామని నిర్మల తెలిపారు.

 ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు, అంతరిక్ష ప్రయోగాల ఉత్పత్తులు, మార్కెటింగ్‌కు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మల పేర్కొన్నారు.    

11:59 AM IST

2022 నాటికి 100 శాతం వంటగ్యాస్ కనెక్షన్లు

2022 నాటికి గ్రామాల్లో 100 శాతం వంటగ్యాస్ కనెక్షన్లు ఇస్తామని నిర్మల తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1.95 కోట్ల ఇళ్లు నిర్మిస్తామన్నారు.  

11:58 AM IST

ఎన్ఆర్ఐల పెట్టుబడులు విదేశీ పెట్టుబడులు

ఎన్ఆర్ఐల పెట్టుబడులను ఇకపై విదేశీ పెట్టుబడులుగా పరిగణిస్తామన్నారు నిర్మలా సీతారామన్. బీమా రంగంలో వందశాతం ఎఫ్‌డీఐలకు అనుమతినిస్తామన్నారు. 

11:57 AM IST

ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం

నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని వేగవంతం చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రభుత్వం రంగ సంస్థల భూమూల పేదలకు ఇళ్లు నిర్మిస్తామన్నారు. 

11:53 AM IST

ఈ రంగాల్లో ఎఫ్‌డీఐలకు అనుమతి

ఏవియేషన్, మీడియా, యానిమేషన్, బీమా తదితర రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచేందుకు కృషి చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. 
 
11:52 AM IST

కొత్తగా సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్

కొత్తగా సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్‌ను ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. 

11:47 AM IST

చిల్లర వర్తకులకు కొత్త పింఛన్ పథకం

చిల్లర వర్తకులకు ప్రధానమంత్రి కర్మయోగి మాన్‌ధన్‌ యోజన ద్వారా కొత్త ఫించన్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

జాతీయ హౌసింగ్ రెంట్ విధానంతో పాటు రిటైల్ ట్రేడర్స్, షాప్ కీపర్స్‌కు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస యోజనకు యేటా రూ.20 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్ 35 శాతానికి పెంచుతున్నట్లు నిర్మల తెలిపారు. 

11:42 AM IST

చిన్న తరహా పరిశ్రమలకు కోటి వరకు రుణం

చిన్న తరహా పరిశ్రమలకు రూ.కోటి వరకు రుణం మంజూరు చేస్తామని కేంద్ర ఆర్ధికమంత్రి తెలిపారు. జీఎస్టీలో నమోదు చేసుకుని రుణం తీసుకున్న వారికి 2 శాతం వడ్డీ రాయితీ. చిన్నతరహా పరిశ్రమలకు ఆర్ధిక సాయం కింద బడ్జెట్‌లో రూ. 350 కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. 
 
11:39 AM IST

ఒకే దేశం-ఒకే పవర్ గ్రిడ్

ఒకే దేశానికి ఒకే పవర్ గ్రిడ్ ఉండేలా చర్యలు తీసుకుంటామని నిర్మల తెలిపారు. పవర్ గ్రిడ్‌ ద్వారా రాష్ట్రాలకు తక్కువ ధరకు విద్యుత్ పంపిణీ చేస్తామని.. విద్యుత్ టారిఫ్ పాలసీలో సంస్కరణలు అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు.

ఈ ఏడాదిలోనే గ్యాస్ గ్రిడ్, వాటర్ గ్రిడ్‌లను ఏర్పాటు చేస్తామని.. ఈ రంగంలతో విదేశీ పెట్టుబడులు పెంచేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 

11:35 AM IST

ఎలక్ట్రిక్ వాహనాల కోసం రూ.10 వేల కోట్లు

ఎలక్ట్రిక్ వాహనాల కోసం మూడేళ్లలో రూ.10 వేల కోట్లు.. జాతీయ రహదారుల గ్రిడ్ ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత మాల ఫేజ్-2లో రాష్ట్రాలకు సహకారం ఉంటుందని రైల్వేలలో మౌలిక వసతుల కోసం సుమారు రూ. 50 లక్షల కోట్లు అవసరమవుతాయని వెల్లడించారు. 

11:32 AM IST

రవాణా రంగానికి ప్రోత్సాహకాలు

రవాణా రంగాన్ని పారిశ్రామిక రంగంలో అనుసంధానిస్తామని.. ఇండస్ట్రీయల్ కారిడార్లలో మౌలిక వసతులు కల్పనకు ప్రాధాన్యతనిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. 2018-19లో 300 కి.మీ మెట్రో లైన్ల నిర్మాణానికి అనుమతినిచ్చామని.. ప్రస్తుతం దేశంలో 657 కిలోమీటర్ల మెట్రో లైన్ల నిర్మాణం జరిగిందని నిర్మలా సీతారామన్ తెలిపారు.

రూపే కార్డుతో బహుళ సేవలు చేసే అవకాశం లభించిందని.. ఒకే కార్డుతో పార్కింగ్ ఫీజు, బస్సు చార్జి ఇంకా అనేక చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల వాడకానికి ప్రోత్సాహంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు వాడే బ్యాటరీలకు రాయితీలు ఇస్తామని నిర్మల స్పష్టం చేశారు.

సరకు రవాణా కోసం నదీ మార్గాల వినియోగానికి ప్రాధాన్యత నిస్తామని.. సాహిబ్ గంజ్, హల్దియాలో సరకు రవాణా కేంద్రాలు నిర్మిస్తామన్నారు. గంగానదిలో ఇప్పటికే సరకు రవాణా జరుగుతోందని.. రైల్వేలకు ఏటా లక్షన్నర కోట్లు అవసరమని మంత్రి తెలిపారు. 

11:25 AM IST

మేకిన్ ఇండియాకు అపూర్వ స్పందన: నిర్మల

చిన్న, మధ్య తరహా సంస్థల్లో ఉద్యోగాల కల్పనే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముద్ర పథకం సామాన్యుడి జీవితాన్ని మార్చివేసిందని... భారతీయ రైల్వేలో 13 లక్షల మంది పనిచేస్తున్నారని.. మేకిన్ ఇండియా కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని అనేక సంస్థలు దేశానికి సంపదను, ఉపాధిని సృష్టిస్తున్నాయని ఆమె తెలిపారు.

విదేశీ పెట్టుబడులు పెంచేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని.. సాగరమాల ద్వారా జల రవాణా, భారతమాల ద్వారా రోడ్డు రవాణా మెరుగుపడుతుందని నిర్మల ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్న నగరాల్లో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి పెద్దపీట వేశామని, విమానాల తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు.  
 
11:16 AM IST

5 ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థే లక్ష్యం: నిర్మలా సీతారామన్

మా ప్రభుత్వానికి అన్ని వర్గాల ఆమోదం లభించిందన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. లోక్‌సభలో 2019-2020 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆమె కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

అనంతరం నిర్మల ప్రసంగిస్తూ.. నవ భారతావని కోసం అన్ని వర్గాల ప్రజలు మోడీకి మద్ధతిచ్చారని తెలిపారు. ఎన్నికల ఫలితాలు దేశ భవిష్యత్‌కు నాంది పలికాయి. దేశభద్రత, ఆర్ధికాభివృద్ధి మన ముందున్న ప్రధాన లక్ష్యాలుగా నిర్మల అభివర్ణించారు.

టెక్నాలజీతో అవినీతిని అరికట్టామని.. సంస్కరణలు, మార్పు తమ అజెండా అని, అట్టడుగు వర్గాల వారికి సేవ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 1.5 ట్రిలియన్లుగా వున్న ఆర్ధిక వ్యవస్థ 2.7 ట్రిలియన్ డాలర్లకు చేరిందని ఆమె వెల్లడించారు.

2024 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించడమే తమ లక్ష్యమన్నారు నిర్మల. చైనా, అమెరికా తర్వాత భారత్‌ది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ అన్నారు. 

సంస్కరణలు, పనిచేయడం ద్వారా కొత్త ఒరవడి సృష్టించామని.. దేశంలోని మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రతీ ఒకరికి పథకాలు చేర్చడమే తమ లక్ష్యమన్నారు నిర్మలా సీతారామన్. శక్తివంతమైన దేశం కావాలంటే.. శక్తివంతమైన పౌరులు ఉండాలని.. లక్ష్యాలను సాధిస్తామనే నమ్మకం ఉందన్నారు. 

11:08 AM IST

లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ 2019-2020 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను  లోక్‌సభలో ప్రవేశపెట్టారు. స్పీకర్ ఓం బిర్లా అనుమతితో ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. 
 
11:05 AM IST

పార్లమెంట్‌కు చేరుకున్న బడ్జెట్ ప్రతులు

మరికొద్ది నిమిషాల్లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సభ్యులకు పంచేందుకు ముద్రించిన బడ్జెట్ కాపీలు పార్లమెంట్‌కు చేరుకున్నాయి. ఆకుపచ్చ రంగు బస్తాల్లో కుట్టిన బడ్జెట్ ప్రతులను పోలీస్ వాహనంలో తరలించారు. 

10:56 AM IST

ఈ రంగాలకు పెద్ద పీట

2019-2020 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌లో ఈ రంగాలకు పెద్దపీట వేసే అవకాశాలున్నాయని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

* వ్యవసాయం
* ఆరోగ్యరంగం... హెల్త్‌చెకప్‌లపై ట్యాక్స్‌లు తగ్గింపు
* వైద్య రంగానికి అదనపు కేటాయింపులు
* ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన ప్రణాళిక
* పన్ను మినహాయింపులు 
 
10:49 AM IST

నిర్మల బడ్జెట్ ప్రసంగం: పార్లమెంట్‌కు వచ్చిన ఆమె తల్లిదండ్రులు

కేంద్ర ఆర్ధిక మంత్రిగా మరికొద్దిసేపట్లో నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో తమ బిడ్డ బడ్జెట్ ప్రసంగాన్ని వినేందుకు నిర్మలా సీతారామన్ తల్లిదండ్రులు పార్లమెంట్‌కు వచ్చారు. పార్లమెంట్ భవనం వద్ద నిర్మలా సీతారామన్ తల్లిదండ్రులను సిబ్బంది, అధికారులు సాదరంగా ఆహ్వానించి లోనికి తీసుకెళ్లారు.

10:44 AM IST

బడ్జెట్ ఎఫెక్ట్: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.

ఉదయం 9.23 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 104 పాయింట్లు పెరిగి 40,013 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి లాభాల్లో ట్రేడ్ అవుతోంది. దాదాపు 522 కంపెనీలకు చెందిన షేర్లు లాభాల బాట పట్టాయి. 

10:41 AM IST

బడ్జెట్‌-2019కి కేంద్ర కేబినెట్ ఆమోదం

2019-2020 ఆర్ధిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టబోతున్న కేంద్ర బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శుక్రవారం ఉదయం 10.30కి పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది. మరికొద్దిసేపట్లో నిర్మల లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 
 
10:35 AM IST

ఏమిటీ బడ్జెట్ హల్వా

భారతదేశ రాజకీయ చరిత్రలో బడ్జెట్ హల్వాకు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు 100 మంది ఆర్ఘికవేత్తలు బడ్జెట్ తయారీకి పది రోజుల ముందే ఒక దగ్గరకు చేరి సంవత్సరంలో సాధించిన ఆర్ధిక పరిస్ధితులను అంచనా వేసి ఆర్ధికమంత్రికి ఒక నివేదిక రూపంలో అందజేస్తారు.

బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రతీసారి ఆర్ధికమంత్రే స్వయంగా హల్వా తయారు చేసి అధికారులకు తినిపించడం ఆనవాయితీగా వస్తుంది. హల్వా కార్యక్రమం ముగిసిన తర్వాత బడ్జెట్ తయారీలో పాల్గొన్న అధికారులను ఢిల్లీలోని నార్త్‌బ్లాక్ కార్యాలయానికి గోప్యంగా తరలిస్తారు.

పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టేవరకు దానికి సంబంధించిన ప్రతులను ఎక్కడా లీకవ్వకుండా గోప్యంగా ఉంచడమే వీరి పని.  ఒక్కసారి బడ్జెట్ ప్రతులకు సీలు వేసిన తర్వాత ఆర్ధిక మంత్రికి కూడా వీటిని ముట్టుకునే అధికారం లేదు. 

10:28 AM IST

వ్యవసాయరంగానికి జవసత్వాలు

మనదేశంలో ఎక్కువ మందికి ఉపాధిని అందించడంతో పాటు ఆర్ధిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్న రంగం వ్యవసాయం. ఒకప్పుడు భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయ రంగం వాటా 40-50 శాతం ఉండేది. 2000లో ఇది 25 శాతం కాగా ఇప్పుడు 13.14 శాతానికి తగ్గిపోయింది.

ఈ రంగంలో వృద్ధి లేక నిరుత్సాహకర పరిస్థితి చోటు చేసుకుంది. దీనిని తిరిగి గాడిలో పెట్టేందుకు మోడీ ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చింది. అయితే పరిస్థితుల్లో మాత్రం మార్పు లేదు. 

10:24 AM IST

బడ్జెట్‌ వైపు ఆశగా చూస్తోన్న ప్రభుత్వ రంగ సంస్థలు

ఎయిరిండియా, బీఎస్ఎన్ఎల్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు తాజా బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. దేశంలో దాదాపు 339 ప్రభుత్వ రంగ సంస్థలు ఉండగా.. ఇందులో సుమారు 154 సంస్ధలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. నష్టదాయక పీఎస్‌యూలకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు పెద్ద సమస్యగా మారుతోంది. ఇక బ్యాంకులకు దాదాపు రూ.8.6 లక్షల కోట్ల మేర మొండి బాకీలు ఉన్నాయి. 

10:16 AM IST

ఐదు ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్ధే లక్ష్యం

దేశాన్ని ఐదు ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థగా మార్చే లక్ష్యంగా ఈ బడ్జెట్‌లో కీలక ప్రతిపాదనలు ఉంచినట్లుగా తెలుస్తోంది. దీనిని సాధించే విజన్‌ను ఆర్ధిక సర్వేలోనే మోడీ ప్రభుత్వం వెల్లడించింది.

అయితే ఇది అంత ఆషామాషీ కాదని తెలుస్తోంది. వ్యవసాయ రంగ సబ్సిడీల రూపేణా ఖర్చు పెరిగినందువల్ల పన్ను వసూళ్ల ద్వారా వచ్చే ఆదాయంపై ప్రభావం పడుతుంది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షల కారణంగా చమురు ధరలు పెరగవచ్చు.

ఆర్ధికవృద్ధికి ప్రైవేట్ పెట్టుబడులే చోదకశక్తి కానుందని సర్వే అభిప్రాయపడింది. నిధుల లభ్యత క్లిష్టంగా మారనుండటంతో నిర్మలా సీతారామన్‌కు ఈ బడ్జెట్‌.. కత్తి మీద సామే కానుందని నిపుణుల అంచనా. 

10:06 AM IST

బడ్జెట్ బ్రీఫ్ కేస్ మారింది

2019-2020 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్దిసేపట్లో బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ సారి బడ్జెట్ పత్రాల బ్రీఫ్ కేస్ మారింది.

గతంలో ఆర్ధిక మంత్రులంతా బడ్జెట్ పత్రాలను గోధుమ రంగు సూట్‌కేసులో పార్లమెంట్‌కు తీసుకెళ్లేవారు. అయితే ఈసారి దాని స్థానంలో ఎర్రటి వస్త్రంతో చుట్టిన పార్శిల్ లాంటిది కనిపించింది. దానిపై భారత రాజముద్ర మూడు సింహాల గుర్తు ఉంది. తొలిసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్ కొత్త సంప్రదాయానికి తెరతీసినట్లయ్యింది.    

10:02 AM IST

రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. ఈ సందర్భంగా బడ్జెట్ పత్రాల కాపీని అందజేశారు. అనంతరం రాష్ట్రపతి భవన్ నుంచి నేరుగా పార్లమెంట్‌కు నిర్మల బయలుదేరారు.  

1:37 PM IST:

డిజిటల్ చెల్లింపులపై ఎటువంటి పన్ను లేదని ప్రకటించారు నిర్మలా సీతారామన్. వ్యాపార లావాదేవీల్లో నగదు చెల్లింపులను అరికట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 

1:33 PM IST:

ఎలక్ట్రిక్ వాహనాలపై 5 శాతం జీఎస్టీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి.. ఎలక్ట్రిక్ వాహనాలు వాడే వారికి ఆదాయంలో అదనంగా రూ. 1.5 లక్షలకు  పన్ను ఉండదని ప్రకటించారు. 

1:31 PM IST:

రూ.400 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు 25 శాతం కార్పోరేట్ ట్యాక్స్‌ను విధిస్తున్నట్లు నిర్మల తెలిపారు. దేశంలోని సుమారు 99.3 శాతం కంపెనీలకు ఇది వర్తిస్తుందని ఆర్ధిక మంత్రి వెల్లడించారు. 

1:28 PM IST:

బంగారంపై 12.50 శాతం కస్టమ్స్ సుంకం, పెట్రోల్, డీజిల్‌పై 1 శాతం ఎక్సైజ్ సుంకం పెంచుతున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రకటించారు. 
 
1:26 PM IST:

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే నష్టాల నుంచి ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులకు విముక్తి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మొత్తం రూ. లక్షా 5వేల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 

1:20 PM IST:

పర్యాటక రంగాన్ని ప్రొత్సహించేందుకు గాను దేశంలోని 17 పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. 
 
1:15 PM IST:

ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 78 శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రకటించారు. 2018లో ఇవి 11.37 లక్షల కోట్లుగా నిర్మల తెలిపారు. 

1:14 PM IST:

బ్యాంకు ఖాతా నుంచి ఏడాదికి రూ. కోటి వరకు నగదును ఉపసంహరించేందుకు నిర్మల అవకాశం కల్పించారు. రూ. కోటి దాటితే 2 శాతం టీడీఎస్‌ ఉంటుందని.. అలాగే పాన్ నెంబర్ లేకపోయినప్పటికీ ఐటీ రిటర్న్స్ దాఖలుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. పాన్ లేదా ఆధార్ నెంబర్‌తో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసుకోవచ్చని నిర్మల పేర్కొన్నారు. 

1:11 PM IST:

మధ్యతరగతి ప్రజల గృహ రుణాలపై ఆర్ధికమంత్రి కరుణ చూపారు. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసే వారికి ప్రోత్సాహకాలు. రూ. 45 లక్షలలోపు గృహ రుణాలపై రూ. 3.5 లక్షలు వడ్డీ రాయితీ అందిస్తామన్నారు. గతంలో వున్న వడ్డీ రాయితీని రూ. 2 లక్షల నుంచి రూ. 3.50 లక్షలకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. 

1:08 PM IST:

ఇతర దేశాలతో సన్నిహిత సంబంధాల కోసం తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. దీనిలో భాగంగా ఆఫ్రికా దేశాల్లో 18 కొత్త రాయబార కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా నిర్మలా సీతారామన్ తెలిపారు. 

1:04 PM IST:

ఉజ్వల యోజన కింద దేశవ్యాప్తంగా 35 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఎల్ఈడీ బల్బుల ద్వారా రూ. 18,341 కోట్ల విలువైన విద్యుత్ ఆదా అవుతుందని నిర్మల వెల్లడించారు.  

1:00 PM IST:

దేశవ్యాప్తంగా ఉన్న 30 లక్షల మంది కార్మికుల శ్రేయస్సు కోసం ప్రధానమంత్రి పెన్షన్ యోజనను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 

12:58 PM IST:

ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ అందించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా భారత్ నెట్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. 

12:54 PM IST:

దేశంలో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలకు పెద్ద పీట వేస్తామన్నారు. దీనిలో భాగంగా నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 

12:51 PM IST:

ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు ఆర్ధికమంత్రి తెలిపారు. సుమారు 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించే అంశం ప్రస్తుతం జీఎస్టీ మండలి పరిశీలిస్తోందని నిర్మల పేర్కొన్నారు. 

12:49 PM IST:

రూ. 5 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు నిర్మలా సీతారామన్. పన్నుల విధానంలో పారదర్శకత తీసుకొస్తామని.. కార్పోరేట్ ట్యాక్స్ పరిధి రూ. 400 కోట్లకు పెంచుతున్నట్లు తెలిపారు. 

12:47 PM IST:

దేశంలో మెగా మ్యాన్యుఫ్యాక్చరింగ్ జోన్లు ఏర్పాటు చేస్తామని.. బ్యాటరీ, సౌరశక్తి రంగంలో విదేశీ కంపెనీలను అనుమతిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 
     
12:44 PM IST:

ఏడాదిలోగా ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేస్తామని ఆర్ధిక మంత్రి తెలిపారు. ఉన్నత విద్యాకేంద్రంగా ఎదిగేందుకు భారతదేశానికి ఎన్నో అవకాశాలున్నాయని ఆమె గుర్తు చేశారు. మన విద్యాసంస్థల్లోకి విదేశీ విద్యార్ధుల రాక మరింత పెరిగాలని నిర్మల ఆకాంక్షించారు.

12:42 PM IST:

భారతీయ పాస్‌పోర్ట్ ఉన్న ప్రతి ఒక్క ఎన్నారైకి ఆధార్ కార్డులను కేటాయిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. 

12:41 PM IST:

స్వయం సహాయక బృందాలకు సైతం ముద్రా యోజనను వర్తింప చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రతి స్వయం సహాయక బృందంలో ఒకరికి రూ.లక్ష వరకు ముద్ర రుణం అందిస్తామని వెల్లడించారు. 
     
12:39 PM IST:

రుణ సంక్షోభంతో అల్లాడుతున్న ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులను రుణ సంక్షోభం నుంచి గట్టెక్కిస్తామని నిర్మల వెల్లడించారు. వాణిజ్య బ్యాంకుల్లో రూ.లక్ష కోట్ల మేర నిరర్థక ఆస్తులు తగ్గాయని ఆమె తెలిపారు. 
 
12:38 PM IST:

కొత్తగా 1, 2, 5, 10, 20 నాణేలను తీసుకొస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. 

12:33 PM IST:

కొత్తగా జలశక్తి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మల తెలిపారు. హర్‌ ఘర్ జల్ పథకంలో భాగంగా ఇంటింటికీ నీటి సరఫరా

12:32 PM IST:

మత్స్యకారుల కోసం ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజనను ఏర్పాటు చేస్తున్నట్లుగా నిర్మలా సీతారామన్ తెలిపారు. 

12:31 PM IST:

విదేశీ విద్యార్ధులు భారత్ వచ్చి చదవుకునేందుకు వీలుగా స్టడీ ఇన్ ఇండియా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో టాప్- 200 విద్యాసంస్ధల్లో 3 భారత విద్యాసంస్థలు ఉన్నాయని ఆర్ధిక మంత్రి గుర్తు చేశారు. 

12:27 PM IST:

దేశంలో క్రీడలను ప్రొత్సహించేందుకు వీలుగా ఖేల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. 

12:27 PM IST:

కార్మిక సమస్యల పరిష్కారానికి వీలుగా దేశవ్యాప్తంగా నాలుగు కార్మిక న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

12:25 PM IST:

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను మరింత ప్రోత్సాహించేందుకు వీలుగా స్టార్టప్‌ల కోసం దూరదర్శన్‌లో ప్రత్యేకంగా కొత్త ఛానల్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వీటి నిర్వహణ బాధ్యత కూడా స్టార్టప్‌లకే అప్పగిస్తున్నట్లుగా ఆమె ప్రకటించారు. 

12:23 PM IST:

స్టాండంప్ ఇండియా పథకం ద్వారా వెనుకబడిన వర్గాల యువతకు శిక్షణ ఇస్తున్నట్లు నిర్మల తెలిపారు. పీపీపీల పరంగా అమెరికా, చైనాల తర్వాత భారత్ మూడో ఆర్ధిక వ్యవస్థగా ఉందని ఆమె వెల్లడించారు. 

12:21 PM IST:

ప్రధాన మంత్రి డిజిటల్ సాక్షరత యోజన పథకం కింద సుమారు 2 కోట్ల మంది గ్రామీణ యువతకు శిక్షణ అందించామని .. శరవేగంగా జరుగుతున్న పట్టణీకరణను ఒక అవకాశంగా చూస్తున్నట్లు నిర్మల తెలిపారు. 
 
12:20 PM IST:

ఇళ్ల నుంచి వచ్చే నీటిని తిరిగి సాగుకు యోగ్యంగా మలిచేందు కోసం జల్ శక్తి అభియాన్‌‌ను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మల తెలిపారు. దేశంలోని 256 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు . 

12:17 PM IST:

మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్ తమ ప్రభుత్వ విధానమని.. పరిశ్రమలకు అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేస్తామని నిర్మల తెలిపారు. 
 
12:14 PM IST:

పట్టణ ప్రాంతాల్లోని పేదల కోసం పీఎంఏవై అర్బన్ కింద 81 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతినిస్తున్నట్లుగా నిర్మల వెల్లడించారు. దీనిలో భాగంగా ఇప్పటికే 13 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని ఆమె తెలిపారు. 

12:13 PM IST:

గత ఐదేళ్లలో 9.6 కోట్ల టాయిలెట్‌లు నిర్మించామని.. 5.6 లక్షల గ్రామాలకు బహిరంగ మలమూత్ర విసర్జన నుంచి విముక్తి లభించేలా చేశామని నిర్మలా సీతారామన్ తెలిపారు. 

12:10 PM IST:

జలజీవన్ మిషన్ ద్వారా 2024 నాటికి దేశంలోని ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామన్నారు.

12:08 PM IST:

వ్యవసాయ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు ఆహ్వానిస్తామని.. పప్పు ధాన్యాల విప్లవం తీసుకువస్తామని నిర్మల తెలిపారు. కొత్తగా 10 వేల రైతు సంఘాలను ఏర్పాటు చేస్తామని.. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. పెట్టుబడులు లేకుండా రైతు వ్యవసాయం చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.     

12:05 PM IST:

సంప్రదాయ పరిశ్రమల ప్రొత్సాహానికి క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది వంద క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. 

12:03 PM IST:

ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 30 వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మిస్తామని.. ఫేజ్-3లో లక్షా 25 వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణంతో పాటు ఆధునీకరణ పనులు చేపడతామన్నారు. రోడ్ల నిర్మాణానికి వేస్ట్ ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తామని నిర్మల స్పష్టం చేశారు. కొత్త రోడ్ల నిర్మాణానికి రూ.80,250 కోట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. 

12:36 PM IST:

ప్రపంచంలోనే భారత్ సరికొత్త అంతరిక్ష శక్తిగా అవతరిస్తోందని.. ఇస్రో సేవలను వాణిజ్యపరంగాను అభివృద్ధి చేసేందుకు న్యూ స్పేస్ ఇండియా కంపెనీ లిమిటెడ్‌ను ఏర్పాటు చేస్తామని నిర్మల తెలిపారు.

 ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు, అంతరిక్ష ప్రయోగాల ఉత్పత్తులు, మార్కెటింగ్‌కు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మల పేర్కొన్నారు.    

11:59 AM IST:

2022 నాటికి గ్రామాల్లో 100 శాతం వంటగ్యాస్ కనెక్షన్లు ఇస్తామని నిర్మల తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1.95 కోట్ల ఇళ్లు నిర్మిస్తామన్నారు.  

11:57 AM IST:

ఎన్ఆర్ఐల పెట్టుబడులను ఇకపై విదేశీ పెట్టుబడులుగా పరిగణిస్తామన్నారు నిర్మలా సీతారామన్. బీమా రంగంలో వందశాతం ఎఫ్‌డీఐలకు అనుమతినిస్తామన్నారు. 

11:57 AM IST:

నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని వేగవంతం చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రభుత్వం రంగ సంస్థల భూమూల పేదలకు ఇళ్లు నిర్మిస్తామన్నారు. 

11:53 AM IST:

ఏవియేషన్, మీడియా, యానిమేషన్, బీమా తదితర రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచేందుకు కృషి చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. 
 
11:52 AM IST:

కొత్తగా సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్‌ను ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. 

11:48 AM IST:

చిల్లర వర్తకులకు ప్రధానమంత్రి కర్మయోగి మాన్‌ధన్‌ యోజన ద్వారా కొత్త ఫించన్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

జాతీయ హౌసింగ్ రెంట్ విధానంతో పాటు రిటైల్ ట్రేడర్స్, షాప్ కీపర్స్‌కు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస యోజనకు యేటా రూ.20 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్ 35 శాతానికి పెంచుతున్నట్లు నిర్మల తెలిపారు. 

11:42 AM IST:

చిన్న తరహా పరిశ్రమలకు రూ.కోటి వరకు రుణం మంజూరు చేస్తామని కేంద్ర ఆర్ధికమంత్రి తెలిపారు. జీఎస్టీలో నమోదు చేసుకుని రుణం తీసుకున్న వారికి 2 శాతం వడ్డీ రాయితీ. చిన్నతరహా పరిశ్రమలకు ఆర్ధిక సాయం కింద బడ్జెట్‌లో రూ. 350 కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. 
 
11:40 AM IST:

ఒకే దేశానికి ఒకే పవర్ గ్రిడ్ ఉండేలా చర్యలు తీసుకుంటామని నిర్మల తెలిపారు. పవర్ గ్రిడ్‌ ద్వారా రాష్ట్రాలకు తక్కువ ధరకు విద్యుత్ పంపిణీ చేస్తామని.. విద్యుత్ టారిఫ్ పాలసీలో సంస్కరణలు అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు.

ఈ ఏడాదిలోనే గ్యాస్ గ్రిడ్, వాటర్ గ్రిడ్‌లను ఏర్పాటు చేస్తామని.. ఈ రంగంలతో విదేశీ పెట్టుబడులు పెంచేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 

11:36 AM IST:

ఎలక్ట్రిక్ వాహనాల కోసం మూడేళ్లలో రూ.10 వేల కోట్లు.. జాతీయ రహదారుల గ్రిడ్ ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత మాల ఫేజ్-2లో రాష్ట్రాలకు సహకారం ఉంటుందని రైల్వేలలో మౌలిక వసతుల కోసం సుమారు రూ. 50 లక్షల కోట్లు అవసరమవుతాయని వెల్లడించారు. 

11:33 AM IST:

రవాణా రంగాన్ని పారిశ్రామిక రంగంలో అనుసంధానిస్తామని.. ఇండస్ట్రీయల్ కారిడార్లలో మౌలిక వసతులు కల్పనకు ప్రాధాన్యతనిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. 2018-19లో 300 కి.మీ మెట్రో లైన్ల నిర్మాణానికి అనుమతినిచ్చామని.. ప్రస్తుతం దేశంలో 657 కిలోమీటర్ల మెట్రో లైన్ల నిర్మాణం జరిగిందని నిర్మలా సీతారామన్ తెలిపారు.

రూపే కార్డుతో బహుళ సేవలు చేసే అవకాశం లభించిందని.. ఒకే కార్డుతో పార్కింగ్ ఫీజు, బస్సు చార్జి ఇంకా అనేక చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల వాడకానికి ప్రోత్సాహంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకు వాడే బ్యాటరీలకు రాయితీలు ఇస్తామని నిర్మల స్పష్టం చేశారు.

సరకు రవాణా కోసం నదీ మార్గాల వినియోగానికి ప్రాధాన్యత నిస్తామని.. సాహిబ్ గంజ్, హల్దియాలో సరకు రవాణా కేంద్రాలు నిర్మిస్తామన్నారు. గంగానదిలో ఇప్పటికే సరకు రవాణా జరుగుతోందని.. రైల్వేలకు ఏటా లక్షన్నర కోట్లు అవసరమని మంత్రి తెలిపారు. 

11:26 AM IST:

చిన్న, మధ్య తరహా సంస్థల్లో ఉద్యోగాల కల్పనే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముద్ర పథకం సామాన్యుడి జీవితాన్ని మార్చివేసిందని... భారతీయ రైల్వేలో 13 లక్షల మంది పనిచేస్తున్నారని.. మేకిన్ ఇండియా కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని అనేక సంస్థలు దేశానికి సంపదను, ఉపాధిని సృష్టిస్తున్నాయని ఆమె తెలిపారు.

విదేశీ పెట్టుబడులు పెంచేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని.. సాగరమాల ద్వారా జల రవాణా, భారతమాల ద్వారా రోడ్డు రవాణా మెరుగుపడుతుందని నిర్మల ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్న నగరాల్లో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి పెద్దపీట వేశామని, విమానాల తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఆర్ధిక మంత్రి స్పష్టం చేశారు.  
 
11:19 AM IST:

మా ప్రభుత్వానికి అన్ని వర్గాల ఆమోదం లభించిందన్నారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. లోక్‌సభలో 2019-2020 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆమె కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

అనంతరం నిర్మల ప్రసంగిస్తూ.. నవ భారతావని కోసం అన్ని వర్గాల ప్రజలు మోడీకి మద్ధతిచ్చారని తెలిపారు. ఎన్నికల ఫలితాలు దేశ భవిష్యత్‌కు నాంది పలికాయి. దేశభద్రత, ఆర్ధికాభివృద్ధి మన ముందున్న ప్రధాన లక్ష్యాలుగా నిర్మల అభివర్ణించారు.

టెక్నాలజీతో అవినీతిని అరికట్టామని.. సంస్కరణలు, మార్పు తమ అజెండా అని, అట్టడుగు వర్గాల వారికి సేవ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 1.5 ట్రిలియన్లుగా వున్న ఆర్ధిక వ్యవస్థ 2.7 ట్రిలియన్ డాలర్లకు చేరిందని ఆమె వెల్లడించారు.

2024 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించడమే తమ లక్ష్యమన్నారు నిర్మల. చైనా, అమెరికా తర్వాత భారత్‌ది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ అన్నారు. 

సంస్కరణలు, పనిచేయడం ద్వారా కొత్త ఒరవడి సృష్టించామని.. దేశంలోని మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రతీ ఒకరికి పథకాలు చేర్చడమే తమ లక్ష్యమన్నారు నిర్మలా సీతారామన్. శక్తివంతమైన దేశం కావాలంటే.. శక్తివంతమైన పౌరులు ఉండాలని.. లక్ష్యాలను సాధిస్తామనే నమ్మకం ఉందన్నారు. 

11:08 AM IST:

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ 2019-2020 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను  లోక్‌సభలో ప్రవేశపెట్టారు. స్పీకర్ ఓం బిర్లా అనుమతితో ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. 
 
11:05 AM IST:

మరికొద్ది నిమిషాల్లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో సభ్యులకు పంచేందుకు ముద్రించిన బడ్జెట్ కాపీలు పార్లమెంట్‌కు చేరుకున్నాయి. ఆకుపచ్చ రంగు బస్తాల్లో కుట్టిన బడ్జెట్ ప్రతులను పోలీస్ వాహనంలో తరలించారు. 

10:56 AM IST:

2019-2020 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌లో ఈ రంగాలకు పెద్దపీట వేసే అవకాశాలున్నాయని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

* వ్యవసాయం
* ఆరోగ్యరంగం... హెల్త్‌చెకప్‌లపై ట్యాక్స్‌లు తగ్గింపు
* వైద్య రంగానికి అదనపు కేటాయింపులు
* ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన ప్రణాళిక
* పన్ను మినహాయింపులు 
 
10:49 AM IST:

కేంద్ర ఆర్ధిక మంత్రిగా మరికొద్దిసేపట్లో నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో తమ బిడ్డ బడ్జెట్ ప్రసంగాన్ని వినేందుకు నిర్మలా సీతారామన్ తల్లిదండ్రులు పార్లమెంట్‌కు వచ్చారు. పార్లమెంట్ భవనం వద్ద నిర్మలా సీతారామన్ తల్లిదండ్రులను సిబ్బంది, అధికారులు సాదరంగా ఆహ్వానించి లోనికి తీసుకెళ్లారు.

10:44 AM IST:

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.

ఉదయం 9.23 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 104 పాయింట్లు పెరిగి 40,013 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి లాభాల్లో ట్రేడ్ అవుతోంది. దాదాపు 522 కంపెనీలకు చెందిన షేర్లు లాభాల బాట పట్టాయి. 

10:41 AM IST:

2019-2020 ఆర్ధిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టబోతున్న కేంద్ర బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శుక్రవారం ఉదయం 10.30కి పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది. మరికొద్దిసేపట్లో నిర్మల లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 
 
10:35 AM IST:

భారతదేశ రాజకీయ చరిత్రలో బడ్జెట్ హల్వాకు ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు 100 మంది ఆర్ఘికవేత్తలు బడ్జెట్ తయారీకి పది రోజుల ముందే ఒక దగ్గరకు చేరి సంవత్సరంలో సాధించిన ఆర్ధిక పరిస్ధితులను అంచనా వేసి ఆర్ధికమంత్రికి ఒక నివేదిక రూపంలో అందజేస్తారు.

బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రతీసారి ఆర్ధికమంత్రే స్వయంగా హల్వా తయారు చేసి అధికారులకు తినిపించడం ఆనవాయితీగా వస్తుంది. హల్వా కార్యక్రమం ముగిసిన తర్వాత బడ్జెట్ తయారీలో పాల్గొన్న అధికారులను ఢిల్లీలోని నార్త్‌బ్లాక్ కార్యాలయానికి గోప్యంగా తరలిస్తారు.

పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టేవరకు దానికి సంబంధించిన ప్రతులను ఎక్కడా లీకవ్వకుండా గోప్యంగా ఉంచడమే వీరి పని.  ఒక్కసారి బడ్జెట్ ప్రతులకు సీలు వేసిన తర్వాత ఆర్ధిక మంత్రికి కూడా వీటిని ముట్టుకునే అధికారం లేదు. 

10:28 AM IST:

మనదేశంలో ఎక్కువ మందికి ఉపాధిని అందించడంతో పాటు ఆర్ధిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్న రంగం వ్యవసాయం. ఒకప్పుడు భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయ రంగం వాటా 40-50 శాతం ఉండేది. 2000లో ఇది 25 శాతం కాగా ఇప్పుడు 13.14 శాతానికి తగ్గిపోయింది.

ఈ రంగంలో వృద్ధి లేక నిరుత్సాహకర పరిస్థితి చోటు చేసుకుంది. దీనిని తిరిగి గాడిలో పెట్టేందుకు మోడీ ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చింది. అయితే పరిస్థితుల్లో మాత్రం మార్పు లేదు. 

10:24 AM IST:

ఎయిరిండియా, బీఎస్ఎన్ఎల్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు తాజా బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. దేశంలో దాదాపు 339 ప్రభుత్వ రంగ సంస్థలు ఉండగా.. ఇందులో సుమారు 154 సంస్ధలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. నష్టదాయక పీఎస్‌యూలకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు పెద్ద సమస్యగా మారుతోంది. ఇక బ్యాంకులకు దాదాపు రూ.8.6 లక్షల కోట్ల మేర మొండి బాకీలు ఉన్నాయి. 

10:16 AM IST:

దేశాన్ని ఐదు ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థగా మార్చే లక్ష్యంగా ఈ బడ్జెట్‌లో కీలక ప్రతిపాదనలు ఉంచినట్లుగా తెలుస్తోంది. దీనిని సాధించే విజన్‌ను ఆర్ధిక సర్వేలోనే మోడీ ప్రభుత్వం వెల్లడించింది.

అయితే ఇది అంత ఆషామాషీ కాదని తెలుస్తోంది. వ్యవసాయ రంగ సబ్సిడీల రూపేణా ఖర్చు పెరిగినందువల్ల పన్ను వసూళ్ల ద్వారా వచ్చే ఆదాయంపై ప్రభావం పడుతుంది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షల కారణంగా చమురు ధరలు పెరగవచ్చు.

ఆర్ధికవృద్ధికి ప్రైవేట్ పెట్టుబడులే చోదకశక్తి కానుందని సర్వే అభిప్రాయపడింది. నిధుల లభ్యత క్లిష్టంగా మారనుండటంతో నిర్మలా సీతారామన్‌కు ఈ బడ్జెట్‌.. కత్తి మీద సామే కానుందని నిపుణుల అంచనా. 

10:12 AM IST:

2019-2020 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్దిసేపట్లో బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ సారి బడ్జెట్ పత్రాల బ్రీఫ్ కేస్ మారింది.

గతంలో ఆర్ధిక మంత్రులంతా బడ్జెట్ పత్రాలను గోధుమ రంగు సూట్‌కేసులో పార్లమెంట్‌కు తీసుకెళ్లేవారు. అయితే ఈసారి దాని స్థానంలో ఎర్రటి వస్త్రంతో చుట్టిన పార్శిల్ లాంటిది కనిపించింది. దానిపై భారత రాజముద్ర మూడు సింహాల గుర్తు ఉంది. తొలిసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్ కొత్త సంప్రదాయానికి తెరతీసినట్లయ్యింది.    

10:02 AM IST:

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. ఈ సందర్భంగా బడ్జెట్ పత్రాల కాపీని అందజేశారు. అనంతరం రాష్ట్రపతి భవన్ నుంచి నేరుగా పార్లమెంట్‌కు నిర్మల బయలుదేరారు.  

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ 2019-2020 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. స్పీకర్ ఓం బిర్లా అనుమతితో ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.