మోడీ ఇంటిపై గ్రహంతరవాసులు..?

First Published 14, Jun 2018, 2:34 PM IST
UFO spotted near PM Modis home at Delhi
Highlights

మోడీ ఇంటిపై గ్రహంతరవాసులు..? 

గ్రహంతర వాసులు అక్కడ దిగారు.. తమ ఇళ్ల మీదుగా ఎగిరే పళ్లెలు వెళ్లాయంటూ విదేశాల్లో వారు చెప్పడమో లేదంట సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూసేవాళ్లం.. అలాంటిది ఏకంగా ఇండియాలో అది కూడా ప్రధాని నరేంద్రమోడి ఇంటి వద్ద ఎగిరే పళ్లాన్ని గుర్తించారు.. భద్రతా సిబ్బంది.  గత నెల 7వ తేదీన ఢిల్లీలో ప్రధాని అధికారిక నివాసం ఉన్న లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద ఎగిరే పళ్లెం లాంటి ఆకారం(యూఎఫ్ఓ) ఎగురుతూ వెళ్లినట్లు మోడీ భద్రతను పర్యవేక్షించే అధికారి ఒకరు తెలిపారు..

అదేంటో గుర్తించేందుకు ప్రయత్నించినప్పటికీ కచ్చితంగా ఏ వివరాలు తెలియరాలేదని అతను చెప్పాడు. ఈ విషయాన్ని వెంటనే ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేసినట్లు భద్రతా సిబ్బంది పేర్కొన్నారు.  ప్రధాని నివాసం వద్ద గుర్తు తెలియని ఆకారం ఒకటి చక్కర్లు కొట్టిన మాట వాస్తవమేనని.. కానీ అదేమిటన్నది తెలియరాలేదని ఢిల్లీ ప్రత్యేక పోలీస్  కమిషనర్ అన్నారు.

కాగా, గత సంవత్సరం సెప్టెంబర్ 17న రాత్రి పూట పార్లమెంట్ చుట్టూ ఓ గుర్తు తెలియని డ్రోన్ ఆకారం చక్కర్లు కొడుతున్నట్లు కొందరు పోలీస్ కంట్రోల్ రూంకి ఫోన్ చేసి చెప్పారు. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను అలెర్ట్ చేశారు. అయితే అలాంటి ఆకారమేది రాడార్లలో కనిపించడం లేదని ఏటీసీ తెలిపింది. మరోవైపు తాజా ఘటనతో ప్రధాని నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
 

loader