Asianet News TeluguAsianet News Telugu

భారత్‌ను కించపరిచిన పాకిస్థానీ, అతని గర్ల్‌ ఫ్రెండ్‌.. బుద్ధి చెప్పిన ఉబర్‌ డ్రైవర్‌

ఢిల్లీలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇండియాని, భారతీయులను కించపరుస్తూ మాట్లాడినందుకు ఓ పాకిస్థానీని, అతని ఇండియన్ గర్ల్ ఫ్రెండ్‌ని ఉబర్ డ్రైవర్ కారులో నుంచి బయటకు తోసేశాాడు.

Uber Driver Kicks Out Pakistani and Girlfriend for Insulting India: Delhi Incident Goes Viral GVR
Author
First Published Aug 11, 2024, 11:29 PM IST | Last Updated Aug 11, 2024, 11:29 PM IST

ఢిల్లీ: భారత్‌లో స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర ఘటన జరిగింది. మన దేశాన్ని కించపరుస్తూ మాట్లాడిన ఓ పాకిస్థానీకి, అతని గర్ల్‌ ఫ్రెండ్‌కి క్యాబ్‌ డ్రైవర్‌ తగిన బుద్ధి చెప్పాడు.

పాకిస్థాన్‌కి చెందిన ఓ వ్యక్తి తన ఇండియన్‌ గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఢిల్లీలో ఉబర్‌ క్యాబ్‌ ఎక్కాడు. ఈ క్రమంలో పాకిస్థానీ వ్యక్తి భారత్‌ను, భారతీయులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. అతని మాటలను ఖండించాల్సిన భారతీయ గర్ల్‌ ఫ్రెండ్‌ కూడా అతినికి వత్తాసు పలికింది. ఇద్దరూ దేశాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహించిన క్యాబ్‌ డ్రైవర్‌ ఇద్దరినీ కారులో నుంచి బయటకి తోసిపడేశాడు. వారిద్దరూ ముందుగా ఎంచుకున్న ప్రయాణ గమ్యానికి తీసుకెళ్లడానికి నిరాకరించాడు. 

 

కాగా, ఈ సంఘటన సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఈ వీడియో తెగ వైరల్‌ అయిపోతోంది. పాకిస్థానీ వ్యక్తితో పాటు అతని ఇండియన్‌ గర్ల్‌ఫ్రెండ్‌కి తగిన గుణపాఠం చెప్పాడని ఉబర్‌ డ్రైవర్‌ను కొందరి ప్రశంసిస్తున్నారు. అతని దేశభక్తిని మెచ్చుకుంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరు అతని చర్యలకు విమర్శిస్తున్నారు. అయితే, డ్రైవర్‌కి సంబంధించిన వివరాలు, ఈ ఘటన ఎప్పుడు జరిగిందన్న వివరాలు పూర్తిగా తెలియరాలేదు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios