భర్త శవం కోసం ఇద్దరు భార్యలు జట్టుపట్టుకొని మరీ కొట్టుకున్న సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. కాగా... పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఇద్దరికీ కాకుండా విద్యుత్ శ్మశానవాటికిలో అంత్యక్రియలు నిర్వహించడం గమనార్హం.

పూర్తి వివరాల్లోక వెళితే... కోయంబత్తూరులోని తమిళనాడు వ్యవసాయ యూనివర్శిటీలో సెంథిల్ కుమార్(44) అనే వ్యక్తి సెక్యురిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. అతనికి విజయ అనే యువతితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. కాగా... భార్య, భర్తల మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సెంథిల్ యూనివర్శిటీలో పనిచేసే మహేశ్వరి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ యూనివర్శిటీ క్వార్టర్స్ లో కాపురం పెట్టారు.

అయితే... ఇటీవల సెంథిల్ విధులు నిర్వహిస్తూనే గుండెపోటుతో కన్నుమూశాడు.  విషయం తెలుసుకున్న మహేశ్వరి.. భర్త మృతదేహాన్ని తన బంధువులు ఇంటికి తీసుకువెళ్లింది. విషయం తెలుసుకన్న సెంథిల్ మొదటి భార్య విజయ అక్కడికి వచ్చి తన భర్త శవం తనకు అప్పగిస్తే.. అంత్యక్రియలు నిర్వహించుకుంటానని చెప్పంది.

విడాకులు తీసుకున్నాక సెంథిల్ నీకు భర్త ఎలా అవుతాడని మహేశ్వరి... విజయతో గొడవపడింది. ఈ విషయంలో భర్త శవం నాదంటే నాది అంటూ... ఇద్దరూ జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. వీరి తగాదా తీరేలా లేదనది బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేసి విఫలమయ్యారు.

ఇక  చేసేది లేక ఇద్దిరికీ కాకుండా సెంథిల్ మృతదేహానికి పోలీసులు.. విద్యుత్‌ శ్మశానవాటికలో కుమార్తె చేతులమీదుగా అంత్యక్రియలు చేయవచ్చని తీర్మానం చేశారు. దీంతో సెంథిల్‌కుమార్, ఇద్దరు భార్యలు, బంధువుల సమక్షంలో అంతిమ సంస్కారాలు గురువారం పూర్తయ్యాయి.