Asianet News TeluguAsianet News Telugu

బెంగళూరు గ్యాంగ్ రేప్ కేసు: పరారీకి నిందితుల యత్నం, కాల్పుల్లో ఇద్దరికి గాయాలు

సంచలనం సృష్టించిన మహిళ సామూహిక అత్యాచారం కేసు నిందితుల్లో ఇద్దరు పారిపోవడానికి ప్రయతనించారు. ఈ సమయంలో పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరి కాళ్లకు గాయాలయ్యాయి.

Two accused in bengaluru molestation case shot in the leg trying two escape
Author
Bengaluru, First Published May 28, 2021, 12:27 PM IST

బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు గ్యాంగ్ రేప్ కేసులో పారిపోవడానికి నిందితులు ప్రయత్నించారు దీంతో పోలీసులు వారిపైకి కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరు నిందితుల కాళ్లకు గాయలయ్యాయి. బెంగుళూరులో ఓ మహిళను చిత్రహింసలకు గురి చేసి ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో పోలీసులు ఇద్దరు మహిళలు సహా ఆరుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

సీన్ రీకనస్ట్రక్షన్ కోసం పోలీసులు నిందితులను సంఘటనా స్థలానికి తీసుకుని వెళ్లారు. నిందితుల్లో ఇద్దరు పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు గాయపడినట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, కర్ణాటక రాజధాని బెంగళూరులో అత్యంత అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. మహిళపై సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా, ఆమెను చిత్రహింసులు పెట్టారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. 

మహిళను చిత్రహింసలు పెట్టన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో మహిళను చిత్రహింసలు పెట్టిన సంఘటనలు మాత్రమే కాకుండా ప్రైవేట్ పార్ట్స్ లో సీసాను చొప్పించిన ఘటన కూడా రికార్జయింది. చిత్రహింసలకు గురి చేసిన తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. 

ఆ సంఘటన బెంగుళూరులో ఆరు రోజుల క్రితం చోటు చేసుకుంది. వీడియో క్లిప్ ల ఆధారంగా, నిందితుల విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు బంగ్లాదేశ్ కు చెందినవారై ఉండవచ్చునని అంటున్నారు. 

ఆర్థిక వ్యవహారాల్లో చెలరేగిన గొడవల కారణంగా మహిళపై దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. బాధితురాలు కూడా బంగ్లాదేశ్ కు చెందిన మహిళ అని భావిస్తున్నారు. మహిళను బెంగళూరుకి అక్రమంగా తరలించినట్లు పోలీసులు తెలిపారు. మహిళ మరో రాష్ట్రంలో ఉందని, ఆమె కోసం ఓ బృందాన్ని పంపించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె వచ్చిన తర్వాత వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ఎదుట రికార్డు చేయనున్నట్లు తెలిపారు. 

ఆ మహిళ భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు చెందింది అయి ఉండవచ్చునని కూడా భావిస్తున్నారు. ఆ సంఘటనపై అస్సాం పోలీసులు వివరాలు అడిగారు. ఐధుగురు నిందితులు మహిళను దారుణంగా చిత్రహింసలకు గురి చేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. అయితే, ఆ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే విషయంపై స్పష్టత లేదని పోలీసులు అంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎవరైనా అందిస్తే మంచి బహుమతి కూడా ఇస్తామని పోలీసులు చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios