నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

Tuesday 30th august telugu news live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

9:24 PM IST

జగన్, కేసీఆర్ వినాయక చవితి విషెస్

ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో వుండాలని సీఎం ఆకాంక్షించారు. అంతకుముందు తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణేశ్ నవరాత్రులను ప్రజలంతా శాంతి , సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా .. ఆనందంతో జరుపుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. దేశ ప్రజలు సుఖశాంతులతో జీవించేలా విఘ్నేశ్వరుని దీవెనలు అందాలని కేసీఆర్ ప్రార్ధించారు. 

8:55 PM IST

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

జమ్మూకాశ్మీర్‌లోని షోపియాన్‌లో జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిద్దరూ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా గుర్తించారు. నాగ్‌బల్ ప్రాంతంలో భద్రతా దళాలు సంయుక్తంగా నిర్వహించిన కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం సందర్భంగా ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. 

8:25 PM IST

కేసీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణేశ్ నవరాత్రులను ప్రజలంతా శాంతి , సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా .. ఆనందంతో జరుపుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. దేశ ప్రజలు సుఖశాంతులతో జీవించేలా విఘ్నేశ్వరుని దీవెనలు అందాలని కేసీఆర్ ప్రార్ధించారు. 

7:01 PM IST

తెలంగాణలో క్రైమ్ రేట్‌పై డీజీపీ స్పందన

తెలంగాణలో క్రైమ్ రేట్ పెరిగిందన్న వార్తలపై రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. ఈ వార్తలు అవాస్తవమని.. ప్రజల అవగాహన కోసమే కేసులు నమోదు చేసి అప్రమత్తం చేస్తున్నామని ఆయన వివరణ ఇచ్చారు. సైబర్ నేరగాళ్లు ఝార్ఖండ్, బీహార్, బెంగాల్ నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని డీజీపీ పేర్కొన్నారు. 

6:02 PM IST

మరోసారి కోవిడ్ బారినపడ్డ కేటీఆర్

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ఆ వెంటనే ఐసోలేషన్‌కు వెళ్లిపోయినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. 

4:58 PM IST

వివాదాస్పద ట్వీట్ కేసు... బాలీవుడ్ యాక్టర్  కేఆర్కేకు 14రోజుల రిమాండ్

వివాదాస్పద క్రిటిక్, బాలీవుడ్ యాక్టర్ కమల్ రషీద్ ఖాన్ కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. 2020 లో చేసిన వివాదాస్పద ట్వీట్ పై కేఆర్కేపై కేసు నమోదవగా సోమవారం రాత్రి ఆయనను అరెస్ట్ చేసారు. దుబాయ్ నుండి ముంబై విమానాశ్రయానికి వచ్చిన కేఆర్కే ను పోలీసులు అరెస్ట్ చేసారు.  
 
4:07 PM IST

భారీ లాభాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఆరంభం నుండి లాభాల బాటలో నడిచాయి. సోమవారం బారీ నష్టాలను చవిచూసిన మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిసాయి. ఇవాళ సెన్సెక్స్ 1564 పాయింట్లు లాభపడి 59,537 వద్ద, నిప్టి 446 పాయింట్లు లాభపడి 17,759 వద్ద ముగిసాయి. 
 
3:04 PM IST

రాజాసింగ్ వ్యవహారంపై వివాదాస్పద వ్యాఖ్యలు... ఎంఐఎం నేతపై పిడి యాక్ట్

హైదరాబాద్ లో మతపరమైన అలజడి కొనసాగుతోంది. దీంతో ప్రజల మధ్య విద్వేషాలు రేపేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం నాయకుడు సయ్యద్ కషఫ్ పై హైదరాబాద్ పోలీసులు పిడి యాక్ట్ నమోదు చేసారు. బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఓ వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నించిన ఎంఐఎం నాయకుడిపై చర్యలకు పోలీసులు సిద్దమయ్యారు. 

1:51 PM IST

యూపీలో పంచాయితీరాజ్ శాఖ మంత్రి రాజీనామా...

ఉత్తర ప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా నియమితులైన భూపేంద్ర చౌదరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ లో పంచాయితీ రాజ్ మంత్రిగా కొనసాగుతున్న ఆయన ఒకరు ఒకే పదవి కొనసాగాలన్న పార్టీ సిద్దాంతాన్ని పాటించారు. దీంతో మంత్రి పదవికి రాజీనామా చేసారు. 
 
1:01 PM IST

కాంగ్రెస్ కు బిగ్ షాక్... జమ్మూ కాశ్మీర్ లో 50మంది సీనియర్ల రాజీనామా

ఇప్పటికే మాజీ కేంద్రమంత్రి, సీనియర్ నాయకుడు గులాం నబీ అజాద్ రాజీనామాతో షాక్ లో వున్న కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అజాద్ కు మద్దతుగా జమ్మూ కశ్మీర్ కు చెందిన 50మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా రాజీనామా చేసారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ఉపముఖ్యమంత్రి తారా చంద్, మాజీ మంత్రులు అబ్దుల్ మాజిద్ వనీ, మనోహర్ లాల్ శర్మ, ఘారు రామ్, మాజీ ఎమ్మెల్యే బల్వాన్ సింగ్ తో పాటు మరికొందరు నాయకులు పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు.  
 
12:07 PM IST

త్వరలోనే బిజెపిలోకి రేవంత్ రెడ్డి..: మంత్రి మల్లారెడ్డి సంచలనం

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. త్వరలోనే రేవంత్ బిజెపి చేరనున్నారంటూ బాంబ్ పేల్చారు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులను ఒక్కొక్కరుగా బిజెపిలోకి పంపుతున్నది రేవంతేనని మల్లారెడ్డి పేర్కొన్నారు. 

11:32 AM IST

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్ సెకెండ్ ఇయర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో జనరల్ లో 47.74% , ఓకేషనల్ లో 65.07% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 53.59% , బాలురు 44.43% ఉత్తీర్ణత సాధించారు. జిల్లాల వారిగా చూసుకుంటే ములుగు జిల్లా అత్యధిక ఉత్తీర్ణత శాతంతో మొదటి స్థానంలో, వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 
 
10:36 AM IST

ఇండియాలో గణనీయంగా తగ్గిన కరోనా... తాజాగా 5,439 కేసులు

ఇండియాలో రోజువారి కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కేవలం 5,439 కొత్తకేసులు మాత్రమే బయటపడ్డాయి. కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా వుండటంతో యాక్టివ్ కేసులు కూడా గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో కేవలం 65,732 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 
 
10:07 AM IST

బాలీవుడ్ యాక్టర్ కేఆర్కే ఆరెస్ట్

బాలీవుడ్ యాక్టర్ కమల్ రషీద్ ఖాన్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేసారు. 2020లో కమల్ చేసిన వివాదాస్పద ట్వీట్ పై పిర్యాదు అందడంతో కేసు నమోదు చేసారు పోలీసులు. ఈ వ్యవహారంలోనే తాజాగా ముంబై విమానాశ్రయంలో కేఆర్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

9:26 AM IST

కుప్పంలో అర్ధరాత్రి అలజడి... అన్నక్యాంటిన్ ధ్వంసం

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో టిడిపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటిన్ పై సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. స్థానిక ఆర్టిసి బస్టాండ్ సర్కిల్ లో కొనసాగుతున్న క్యాంటిన్ పై దాడిచేసి వస్తువులన్నింటిని ధ్వంసం చేసారు. ఈ దాడికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ ఇది ముమ్మాటికీ వైసిపి రౌడీల పనేనని అన్నారు. 

9:18 AM IST

ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ మృతి

ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్లానింగ్ కమీషన్ మెంబర్ అభిజిత్ సేన్(72) సోమవారం రాత్రి మృతిచెందారు. రాత్రి 11 గంటల సమయంలో అభిజిత్ గుండెపోటుకు గురవగా వెంటనే హాస్పిటల్ కు తరలించామని... అయినా ఆయన ప్రాణాలు దక్కలేదని సోదరుడు ప్రణబ్ సేన్ తెలిపారు.  

9:24 PM IST:

ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో వుండాలని సీఎం ఆకాంక్షించారు. అంతకుముందు తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణేశ్ నవరాత్రులను ప్రజలంతా శాంతి , సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా .. ఆనందంతో జరుపుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. దేశ ప్రజలు సుఖశాంతులతో జీవించేలా విఘ్నేశ్వరుని దీవెనలు అందాలని కేసీఆర్ ప్రార్ధించారు. 

8:55 PM IST:

జమ్మూకాశ్మీర్‌లోని షోపియాన్‌లో జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిద్దరూ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా గుర్తించారు. నాగ్‌బల్ ప్రాంతంలో భద్రతా దళాలు సంయుక్తంగా నిర్వహించిన కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం సందర్భంగా ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. 

8:25 PM IST:

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణేశ్ నవరాత్రులను ప్రజలంతా శాంతి , సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా .. ఆనందంతో జరుపుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. దేశ ప్రజలు సుఖశాంతులతో జీవించేలా విఘ్నేశ్వరుని దీవెనలు అందాలని కేసీఆర్ ప్రార్ధించారు. 

7:01 PM IST:

తెలంగాణలో క్రైమ్ రేట్ పెరిగిందన్న వార్తలపై రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. ఈ వార్తలు అవాస్తవమని.. ప్రజల అవగాహన కోసమే కేసులు నమోదు చేసి అప్రమత్తం చేస్తున్నామని ఆయన వివరణ ఇచ్చారు. సైబర్ నేరగాళ్లు ఝార్ఖండ్, బీహార్, బెంగాల్ నుంచి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని డీజీపీ పేర్కొన్నారు. 

6:02 PM IST:

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ఆ వెంటనే ఐసోలేషన్‌కు వెళ్లిపోయినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. 

4:58 PM IST:

వివాదాస్పద క్రిటిక్, బాలీవుడ్ యాక్టర్ కమల్ రషీద్ ఖాన్ కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. 2020 లో చేసిన వివాదాస్పద ట్వీట్ పై కేఆర్కేపై కేసు నమోదవగా సోమవారం రాత్రి ఆయనను అరెస్ట్ చేసారు. దుబాయ్ నుండి ముంబై విమానాశ్రయానికి వచ్చిన కేఆర్కే ను పోలీసులు అరెస్ట్ చేసారు.  
 
4:08 PM IST:

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఆరంభం నుండి లాభాల బాటలో నడిచాయి. సోమవారం బారీ నష్టాలను చవిచూసిన మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిసాయి. ఇవాళ సెన్సెక్స్ 1564 పాయింట్లు లాభపడి 59,537 వద్ద, నిప్టి 446 పాయింట్లు లాభపడి 17,759 వద్ద ముగిసాయి. 
 
3:05 PM IST:

హైదరాబాద్ లో మతపరమైన అలజడి కొనసాగుతోంది. దీంతో ప్రజల మధ్య విద్వేషాలు రేపేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం నాయకుడు సయ్యద్ కషఫ్ పై హైదరాబాద్ పోలీసులు పిడి యాక్ట్ నమోదు చేసారు. బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహారంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఓ వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నించిన ఎంఐఎం నాయకుడిపై చర్యలకు పోలీసులు సిద్దమయ్యారు. 

1:52 PM IST:

ఉత్తర ప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా నియమితులైన భూపేంద్ర చౌదరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ లో పంచాయితీ రాజ్ మంత్రిగా కొనసాగుతున్న ఆయన ఒకరు ఒకే పదవి కొనసాగాలన్న పార్టీ సిద్దాంతాన్ని పాటించారు. దీంతో మంత్రి పదవికి రాజీనామా చేసారు. 
 
1:02 PM IST:

ఇప్పటికే మాజీ కేంద్రమంత్రి, సీనియర్ నాయకుడు గులాం నబీ అజాద్ రాజీనామాతో షాక్ లో వున్న కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. అజాద్ కు మద్దతుగా జమ్మూ కశ్మీర్ కు చెందిన 50మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా రాజీనామా చేసారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ఉపముఖ్యమంత్రి తారా చంద్, మాజీ మంత్రులు అబ్దుల్ మాజిద్ వనీ, మనోహర్ లాల్ శర్మ, ఘారు రామ్, మాజీ ఎమ్మెల్యే బల్వాన్ సింగ్ తో పాటు మరికొందరు నాయకులు పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు.  
 
12:08 PM IST:

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. త్వరలోనే రేవంత్ బిజెపి చేరనున్నారంటూ బాంబ్ పేల్చారు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులను ఒక్కొక్కరుగా బిజెపిలోకి పంపుతున్నది రేవంతేనని మల్లారెడ్డి పేర్కొన్నారు. 

11:33 AM IST:

తెలంగాణ ఇంటర్మీడియట్ సెకెండ్ ఇయర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో జనరల్ లో 47.74% , ఓకేషనల్ లో 65.07% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 53.59% , బాలురు 44.43% ఉత్తీర్ణత సాధించారు. జిల్లాల వారిగా చూసుకుంటే ములుగు జిల్లా అత్యధిక ఉత్తీర్ణత శాతంతో మొదటి స్థానంలో, వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 
 
10:37 AM IST:

ఇండియాలో రోజువారి కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కేవలం 5,439 కొత్తకేసులు మాత్రమే బయటపడ్డాయి. కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా వుండటంతో యాక్టివ్ కేసులు కూడా గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో కేవలం 65,732 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 
 
10:08 AM IST:

బాలీవుడ్ యాక్టర్ కమల్ రషీద్ ఖాన్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేసారు. 2020లో కమల్ చేసిన వివాదాస్పద ట్వీట్ పై పిర్యాదు అందడంతో కేసు నమోదు చేసారు పోలీసులు. ఈ వ్యవహారంలోనే తాజాగా ముంబై విమానాశ్రయంలో కేఆర్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

9:27 AM IST:

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో టిడిపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటిన్ పై సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. స్థానిక ఆర్టిసి బస్టాండ్ సర్కిల్ లో కొనసాగుతున్న క్యాంటిన్ పై దాడిచేసి వస్తువులన్నింటిని ధ్వంసం చేసారు. ఈ దాడికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ ఇది ముమ్మాటికీ వైసిపి రౌడీల పనేనని అన్నారు. 

9:19 AM IST: