నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

Tuesday 18th October Telugu News Live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

9:41 PM IST

హైదరాబాద్ హలీమ్‌కు అరుదైన ఘనత

హైదరాబాద్‌ రుచికి మరోసారి గుర్తింపు దక్కింది. నగరంలో మాత్రమే ప్రత్యేకంగా తయారు చేసే హలీమ్‌కు మోస్ట్ పాపులర్ జీఐగా గుర్తింపు దక్కింది. రసగుల్లా, బికనీర్ భుజియా వంటి 17 రకాల ఫేమస్ వెరైటీలను వెనక్కినెట్టి మరి హలీమ్‌కు ఈ గుర్తింపు వచ్చింది. 

8:51 PM IST

కాంట్రాక్ట్ కోసమే కోమటిరెడ్డి రాజీనామా : హరీశ్ రావు

కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని ఆరోపించారు మంత్రి హరీశ్ రావు. బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్ ధర చూస్తేనే భయమేస్తోందన్నారు. బీజేపీ గెలిస్తే 1200 సిలిండర్ రూ.1500 అవుతుందని హరీశ్ వ్యాఖ్యానించారు. బీజేపీకి ఓటు వేస్తే నిత్యవసర ధరలు ఇంకా పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. 

8:12 PM IST

మంత్రులపై దాడి .. పోలీస్ అధికారులపై వేటు

గత శనివారం విశాఖపట్నంలో జరిగిన విశాఖ గర్జన సభలో పాల్గొని తిరిగి వస్తున్న మంత్రులు జోగి రమేశ్, రోజా, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలపై వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన దాడికి సంబంధించి పోలీస్ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా ఎయిర్‌పోర్ట్ సీఐ ఉమాకాంత్, కంచరపాలెం సీఐ కృష్ణారావులపై వేటు వేశారు ఉన్నతాధికారులు. వీరిద్దరిని వీఆర్‌కు సరెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

7:35 PM IST

ఉప్పల్ జంట హత్యల కేసు

ఉప్పల్ జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. ఎస్సై ఉద్యోగం కోసం క్షుద్రపూజలు చేయించినా ఫలితం లేకపోవడంతో తమ డబ్బు కోసమే ఓ వ్యక్తి తండ్రి , కొడుకుల్ని హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. 
 
6:41 PM IST

వల్లభనేని వంశీకి హైకోర్ట్ నోటీసులు

టీడీపీ రెబల్ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్ట్ నోటీసులు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వంశీ ప్రసాదంపాడు పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారంటూ వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు పిటిషన్ వేశారు. 

5:52 PM IST

సీఈసీని కలిసిన వినోద్ కుమార్

కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీఆర్ఎస్ నేత బోయిన్‌పల్లి వినోద్ కుమార్ కలిశారు. మునుగోడు ఉపఎన్నికలో కారును పోలిన 8 గుర్తులను తొలగించాలని ఈసీకి ఆయన ఫిర్యాదు చేశారు. ఇప్పటికే దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఫిర్యాదు చేయగా.. దాని నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 
 
4:40 PM IST

రాజధాని అమరావతికే కాంగ్రెస్ మద్దతు..: రాహుల్ గాంధీ

ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతికే కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో పాదయాత్ర చేపట్టిని కాంగ్రెస్ కీలక నాయకుడు రాహుల్ గాంధీని అమరావతి రైతులు కలిసారు. ఈ సందర్భంగా అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని... అందుకోసం చేపట్టిన ఉద్యమానికి మద్దతిస్తున్నట్లు రాహుల్ తెలిపారు. 

3:49 PM IST

నేడు భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్స్...

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 549 పాయింట్లు లాభపడి 58,960 వద్ద, నిప్టీ 175 పాయింట్లు లాభపడి 17,486 వద్ద ముగిసాయి. 

2:40 PM IST

బిసిసిఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఎన్నిక

మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ బిసిసిఐ అధ్యక్షుడిగా అధికారికంగా ఎన్నికయ్యారు. ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డు బాధ్యతలను సౌరబ్ గంగూలీ నుండి బిన్నీ స్వీకరించారు. ఇవాళ జరిగిన బిసిసిఐ ఏజిఎం మీటింగ్ లో బిన్నీని 36వ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇక బిసిసిఐ సెక్రటరీ బాధ్యతలు రెండోసారి జై షా కే దక్కాయి. 

1:47 PM IST

జనసేనకు హైకోర్టులో చుక్కెదురు... వైజాగ్ ఘటనలో ఎఫ్ఐఆర్ రద్దుకు నిరాకరణ

విశాఖపట్నం ఘటనలో జనసేన కార్యకర్తలపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన జనసేన లీగల్ సెల్ కు చుక్కెదురయ్యింది. ఎఫ్ఐఆర్ రద్దకు హైకోర్టు నిరాకరించింది. నిందితుడు కాని మూడో వ్యక్తి ఎఫ్‌ఐఆర్‌ను ఎలా సవాలు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. రెండు వారాలకు విచారణ వాయిదా వేసింది. 
 
1:05 PM IST

కేదార్ నాథ్ యాత్రలో ప్రమాదం ... చాపర్ కుప్పకూలి ఆరుగురు మృతి

కేదార్ నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్ కుప్పకూలడంతో ఇద్దరు పైలట్లు, నలుగురు భక్తులు మృతిచెందారు.  వాతావరణ పరిస్థితులు అనుకూలించపోవడంతో చాపర్ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 
 
12:13 PM IST

మిజోరాంలో భారీగా డ్రగ్స్ పట్టివేత

మిజోరాం రాజధాని ఐజ్వాల్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. దాదాపు రూ.30 కోట్ల విలువైన మెథాపెటమైన్ టాబ్లెట్లను అస్సాం రైఫిల్స్ పట్టుకుంది.  
 
11:19 AM IST

మోహన్ లాల్ 'మాన్ స్టర్' మూవీపై గల్ఫ్ దేశాల నిషేదం

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్  నటించిన 'మాన్ స్టర్' మూవీపై గల్ప్ దేశాలు నిషేదం విధించాయి. ఈ నెల 21న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్దమవగా లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్ కంటెంట్ వుండటంతో గల్ఫ్ దేశాలు నిషేదం విధించాయి. 
 
10:27 AM IST

గుజరాత్ ఘోరప్రమాదం... ఆరుగురు మృతి, 15మందికి గాయాలు

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్-ముంబై హైవే పై వడోదర శివారులో తెల్లవారుజామున బస్సు ప్రమాదానికి గురవడంతో ఆరుగురు మృతిచెందగా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

9:41 AM IST

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతుండగా మరికొన్ని రోజులు ఇవి ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 20న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని... ఇది 48 గంటల్లో బలపడి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హెచ్చరించారు.   

9:33 AM IST

ప్రాణాలుతీసిన ట్రెకింగ్ సరదా... అమెరికాలో తెలుగు టెకీ మృతి

ఉపాధి నిమిత్తం అమెరికా వెళ్ళిన గుంటూరు యువకుడి ట్రెకింగ్ సరదా అతడి ప్రాణాలనే బలితీసుకుంది. టెకీ గంగూరి శ్రీనాథ్ (32) స్నేహితులతో కలిసి సరదాగా ట్రెకింగ్ చేస్తూ ప్రమాదానికి గురయి ప్రాణాలు కోల్పోయాడు.

9:41 PM IST:

హైదరాబాద్‌ రుచికి మరోసారి గుర్తింపు దక్కింది. నగరంలో మాత్రమే ప్రత్యేకంగా తయారు చేసే హలీమ్‌కు మోస్ట్ పాపులర్ జీఐగా గుర్తింపు దక్కింది. రసగుల్లా, బికనీర్ భుజియా వంటి 17 రకాల ఫేమస్ వెరైటీలను వెనక్కినెట్టి మరి హలీమ్‌కు ఈ గుర్తింపు వచ్చింది. 

8:51 PM IST:

కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని ఆరోపించారు మంత్రి హరీశ్ రావు. బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్ ధర చూస్తేనే భయమేస్తోందన్నారు. బీజేపీ గెలిస్తే 1200 సిలిండర్ రూ.1500 అవుతుందని హరీశ్ వ్యాఖ్యానించారు. బీజేపీకి ఓటు వేస్తే నిత్యవసర ధరలు ఇంకా పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. 

8:12 PM IST:

గత శనివారం విశాఖపట్నంలో జరిగిన విశాఖ గర్జన సభలో పాల్గొని తిరిగి వస్తున్న మంత్రులు జోగి రమేశ్, రోజా, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలపై వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన దాడికి సంబంధించి పోలీస్ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా ఎయిర్‌పోర్ట్ సీఐ ఉమాకాంత్, కంచరపాలెం సీఐ కృష్ణారావులపై వేటు వేశారు ఉన్నతాధికారులు. వీరిద్దరిని వీఆర్‌కు సరెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

7:34 PM IST:

ఉప్పల్ జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. ఎస్సై ఉద్యోగం కోసం క్షుద్రపూజలు చేయించినా ఫలితం లేకపోవడంతో తమ డబ్బు కోసమే ఓ వ్యక్తి తండ్రి , కొడుకుల్ని హత్య చేయించినట్లు పోలీసులు తేల్చారు. 
 
6:40 PM IST:

టీడీపీ రెబల్ నేత, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్ట్ నోటీసులు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వంశీ ప్రసాదంపాడు పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారంటూ వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు పిటిషన్ వేశారు. 

5:52 PM IST:

కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీఆర్ఎస్ నేత బోయిన్‌పల్లి వినోద్ కుమార్ కలిశారు. మునుగోడు ఉపఎన్నికలో కారును పోలిన 8 గుర్తులను తొలగించాలని ఈసీకి ఆయన ఫిర్యాదు చేశారు. ఇప్పటికే దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఫిర్యాదు చేయగా.. దాని నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 
 
4:40 PM IST:

ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతికే కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో పాదయాత్ర చేపట్టిని కాంగ్రెస్ కీలక నాయకుడు రాహుల్ గాంధీని అమరావతి రైతులు కలిసారు. ఈ సందర్భంగా అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని... అందుకోసం చేపట్టిన ఉద్యమానికి మద్దతిస్తున్నట్లు రాహుల్ తెలిపారు. 

3:49 PM IST:

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 549 పాయింట్లు లాభపడి 58,960 వద్ద, నిప్టీ 175 పాయింట్లు లాభపడి 17,486 వద్ద ముగిసాయి. 

2:40 PM IST:

మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ బిసిసిఐ అధ్యక్షుడిగా అధికారికంగా ఎన్నికయ్యారు. ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డు బాధ్యతలను సౌరబ్ గంగూలీ నుండి బిన్నీ స్వీకరించారు. ఇవాళ జరిగిన బిసిసిఐ ఏజిఎం మీటింగ్ లో బిన్నీని 36వ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇక బిసిసిఐ సెక్రటరీ బాధ్యతలు రెండోసారి జై షా కే దక్కాయి. 

1:47 PM IST:

విశాఖపట్నం ఘటనలో జనసేన కార్యకర్తలపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన జనసేన లీగల్ సెల్ కు చుక్కెదురయ్యింది. ఎఫ్ఐఆర్ రద్దకు హైకోర్టు నిరాకరించింది. నిందితుడు కాని మూడో వ్యక్తి ఎఫ్‌ఐఆర్‌ను ఎలా సవాలు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. రెండు వారాలకు విచారణ వాయిదా వేసింది. 
 
1:05 PM IST:

కేదార్ నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్ కుప్పకూలడంతో ఇద్దరు పైలట్లు, నలుగురు భక్తులు మృతిచెందారు.  వాతావరణ పరిస్థితులు అనుకూలించపోవడంతో చాపర్ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 
 
12:13 PM IST:

మిజోరాం రాజధాని ఐజ్వాల్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. దాదాపు రూ.30 కోట్ల విలువైన మెథాపెటమైన్ టాబ్లెట్లను అస్సాం రైఫిల్స్ పట్టుకుంది.  
 
11:19 AM IST:

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్  నటించిన 'మాన్ స్టర్' మూవీపై గల్ప్ దేశాలు నిషేదం విధించాయి. ఈ నెల 21న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్దమవగా లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్ కంటెంట్ వుండటంతో గల్ఫ్ దేశాలు నిషేదం విధించాయి. 
 
10:27 AM IST:

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్-ముంబై హైవే పై వడోదర శివారులో తెల్లవారుజామున బస్సు ప్రమాదానికి గురవడంతో ఆరుగురు మృతిచెందగా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

9:41 AM IST:

ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతుండగా మరికొన్ని రోజులు ఇవి ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 20న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని... ఇది 48 గంటల్లో బలపడి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హెచ్చరించారు.   

9:33 AM IST: