అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుటుంబంతో సహా తాజ్ మహల్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ట్రంప్ తన పర్సనల్ విజిట్ లో భాగంగా ఈ సుందరమైన తాజ్ మహల్ ని సందర్శిస్తున్నారు. ఆయన ఈ ప్రేమ చిహ్నాన్ని సందర్శించేందుకు వచ్చినప్పుడు దాని చరిత్రను తెలుసుకోరా చెప్పండి?

అందుకే ట్రంప్ కు తాజ్ మహల్ చరిత్రను.. దాని వెనకున్న ప్రేమ గాథను తెలపడానికి ఒక గైడ్ ని నియమించింది భారత ప్రభుత్వం. అతనినే మనం ట్రంప్ తో పాటుగా ట్రంప్ తాజ్ మహల్ సందర్శనలో చూసాము. ఆ గైడ్ ట్రంప్, ఫస్ట్ లేడీకి ఈ నిర్మాణం గురించి చెప్పారు. 

ఆ వ్యక్తిపేరే నితిన్ సింగ్. అతనికి అంత నేరుగా ఆ ఛాన్స్ దక్కలేదు. మరోమాట ఆయనను ఫైనల్ గా అంగీకరించింది భారత ప్రభుత్వం కాదు... ట్రంప్ సెక్యూరిటీ సిబ్బంది. పూర్తి వివరాల్లోకి వెళితే దిమ్మతిరిగే విషయాలు తెలుస్తాయి. 

ఒక ముగ్గురు పేర్లను షార్ట్ లిస్ట్ చేసిన భారత ప్రభుత్వం ఆ పేర్ల జాబితాను ట్రంప్ సెక్యూరిటీ సిబ్బందికి ఇచ్చింది. వారు ఆ ముగ్గురిని ఇంటర్వ్యూ చేసి ఈ నితిన్ సింగ్ ను ఓకే చేసారు. ట్రంపా మజాకా మరి!

ఇక నేటి ఉదయం రెండు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ట్రంప్ తో పాటు ఆయన భార్య మెలేనియ ట్రంప్, కూతురు ఇవాంక, జారెడ్ కుష్ణర్ లతో కూడిన బృందంతో భారత్ లో దిగారు. ఆయన నేరుగా వాషింగ్టన్ నుండి బయల్దేరి అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. 

ట్రంప్ రాక కోసం అహ్మదాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నగర సుందరీకరణకు భారీగా ఖర్చు చేసారు. ట్రంప్ అహ్మదాబాద్ లో ఉండే మూడు గంటల కోసం దాదాపుగా 85 కోట్ల రూపాయలను వెచ్చించారు. ట్రంప్, మోడీలు విమానాశ్రయం నుంచే మొతేరా క్రికెట్ స్టేడియం కి వెళ్లే దారిలో ఉండే మురికివాడల ప్రాంతంలో 4 అడుగుల గోడను మునిసిపల్ అధికారులు నిర్మించారు. 

అక్కడ నుండి ఆయన సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆ తరువాత ఆయన అక్కడ నుండి నేరుగా నమస్తే ట్రంప్ ఈవెంట్ లో పాల్గొనేందుకు నూతనంగా నిర్మించిన మొతేరా క్రికెట్ స్టేడియంకి చేరుకున్నారు. 

అక్కడ ఆ కార్యక్రమం ముగిసిన తరువాత ఆయన అక్కడి నుండి నేరుగా ఆగ్రా బయల్దేరారు. ఆగ్రాలో ఆయనకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు.