Asianet News TeluguAsianet News Telugu

సబర్మతి ఆశ్రమం విజిటర్స్ బుక్ లో ట్రంప్ సంతకం ఇదే

భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులు సబర్మతి ఆశ్రమంలో కలియ తిరిగారు. ట్రంప్ సబర్మతి ఆశ్రమంలోని విజిటర్స్ బుక్ లో సంతకం చేశారు. అందులో గాంధీని ట్రంప్ ప్రస్తావించలేదు.

Trump signs in visitors book at Sabarmati ashram
Author
Sabarmati Ashram, First Published Feb 24, 2020, 1:15 PM IST

అహ్మదాబాద్: భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సబర్మతీ ఆశ్రమంలో సతీమణి మెలానియా ట్రంప్ కలియ తిరిగారు. వారికి సబర్మతీ ఆశ్రమం విశేషాలను ఒక్కటొక్కటే వివరిస్తూ గాంధీ జీవన విధానాన్ని తెలియజేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ వారి వెంట ఉన్నారు. 

మూడు కోతుల విగ్రహాలను చూపించి, వాటి ప్రత్యేకతను ట్రంప్ దంపతులకు మోడీ వివరించారు. గాంధీ రాట్నాన్ని ట్రంప్ తిప్పారు. ఆశ్రమం లోనికి ప్రవేశించే సమయంలో ట్రంప్ దంపతులు తమ పాదరక్షలను బయటే విప్పేశారు. సబర్మతి ఆశ్రమంలో వారు వరండాలో కూర్చున్నారు.

Trump signs in visitors book at Sabarmati ashramTrump signs in visitors book at Sabarmati ashram

విజిటర్స్ బుక్ లో డోనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. "నా గ్రేట్ ఫ్రెండ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ... థ్యాంక్యూ ఫర్ దిస్ వండర్ ఫుల్ విజిట్" అని ట్రంప్ విజిటర్స్ బుక్ లో రాసి కింద సంతకం చేశారు. విజిటర్స్ బుక్ లో ట్రంప్ మహాత్మా గాంధీని ప్రస్తావించలేదు. ఆశ్రమం వద్ద ట్రంప్ దంపతులకు మోడీ, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని స్వాగతం పలికారు. 

Trump signs in visitors book at Sabarmati ashram

ఆ తర్వాత డోనాల్డ్ ట్రంప్ దంపతులు మొతేరా స్టేడియానికి బయలుదేరి వెళ్లారు. అక్కడ నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొని ప్రసంగిస్తారు. 

Follow Us:
Download App:
  • android
  • ios