యూకే వేదికగా జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్ 2022 లో భారత వెయిట్ లిప్టర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వెయిట్ లిప్టింగ్ లోనే భారత్ కు అత్యధిక పతకాలు లభించగా తాజాగా ఆ విభాగంలో మరో రజత పతకం చేరింది. పంజాబ్ కు చెందిన 24ఏళ్ల యువ వెయిట్ లిప్టర్ లవ్ ప్రీత్ సింగ్ 109 కేజీల విభాగంలో రజతం సాధించాడు.
నేటి ముఖ్యాంశాలివే...

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...
కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ సత్తా... వెయిట్ లిప్టింగ్ లో మరో పతకం
తిరంగ బైక్ ర్యాలీలో స్కూటీపై స్మృతి ఇరానీ, బైక్ పై కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఈ ఆగస్ట్ 15తో 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలను బిజెపి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇవాళ దేశ రాజధాని న్యూడిల్లీలో కేంద్ర మంత్రులు, యువ ఎంపీలు తిరంగ బైక్ ర్యాలీ చేపట్టారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు జెండా ఊపి ప్రారంభించిన ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్కూటీపై, కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్ బైక్ లపై కనిపించారు.


ఎన్డీఏకు జెఎంఎం షాక్... ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలకే మద్దతు
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరేట్ ఆళ్వాకు మద్దతివ్వనున్నట్లు జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు మద్దతిచ్చాన జెఎంఎం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం ఎన్డిఏ అభ్యర్థికి కాకుండా ప్రతిపక్షాల అభ్యర్థికి మద్దతివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత శిబు సోరెన్ ముగ్గురు ఎంపీలకు సూచించారు.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో గవర్నర్ తమిళిసై సమావేశం
తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజ్ భవన్ లో వివిధ యూనివర్సిటీల విద్యార్థులతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సమావేశంలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు కూడా పాల్గొని తమ సమస్యలు తెలియజేసారు. అన్ని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని గవర్నర్ విద్యార్థులకు భరోసా ఇచ్చారు.
భారత ప్రధాని మోదీకి శ్రీలంక అధ్యక్షుడు కృతజ్ఞతలు
ఆర్థిక సంక్షోభంతో దారుణ పరిస్థితి ఎదుర్కొంటున్న తమ దేశానికి ఆర్థిక భరోసా కల్పించిన భారతదేశానికి, ప్రధాని నరేంద్ర మోదీకి శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక కష్టాల నుండి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న శ్రీలంకకు పొరుగు దేశం భారత్ తమ వంతు సహకారం అందిస్తోందన్నారు.
కాంగ్రెస్ కు మరో షాక్... రాజీనామా చేసిన మరో ఎమ్మెల్యే
తెలంగాణలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన షాక్ నుండి కోలుకోకముందే కాంగ్రెస్ పార్టీకీ మరో ఎదురుదెబ్బ తగిలింది. హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. గురువారం అతడు బిజెపిలో చేరనున్నాడు.
కాంగ్రెస్ ఎంపీల ఆందోళన... లోక్ సభ 2గంటలకు వాయిదా
కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆందోళనతో లోక్ సభ 2గంటలకు వాయిదా పడింది. నేషనల్ హెరాల్డ్ పత్రికా కార్యాలయంలో ఈడీ దాడులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్లమెంట్ లో ఆందోళనకు దిగింది. దీంతో స్పీకర్ ఓంబిర్లా సభను వాయిదా వేసారు.
తిరంగ ఉత్సవ్... డిల్లీలో ఎంపీల భారీ బైక్ ర్యాలీ
అజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దేశ రాజధాని న్యూడిల్లీలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు ఎర్రకోట నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీలో పాలుపంచుకున్నారు. భారత స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ త్రివర్ణ పతాకాలతో ఈ బైక్ ర్యాలీ సాగింది.
భారత్ లో తాజాగా 17వేల కరోనా కేసులు, 47 కోవిడ్ మరణాలు...
భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 17,135 కరోనా కేసులు వెలుగుచూసాయి. ఇదే సమయంలో కరోనాతో బాధపడుతున్న వారిలో 47మంది మృతిచెందారు. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా కేసుల సంఖ్య 4,40,67,144 కు చేరితే మరణాల సంఖ్య 5,26,477కు చేరింది. ఇక ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,37,057 కు చేరింది.
హైదరాబాద్ లో రెచ్చిపోయిన దుండగులు... ఎస్సై పైనే కత్తులతో దాడి
హైదరాబాద్ లో గత అర్థరాత్రి కొందరు దుండగులు రెచ్చిపోయారు. విధుల్లో వున్న మారేడుపల్లి ఎస్సై వినయ్ కుమార్ పై విచక్షణా రహితంగా కత్తులతో దాడికి తెగబడ్డారు. రక్తపుమడుగులో పడిపోయిన ఎస్సైని వెంంటనే దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. అతడి కడుపులో, వెన్నుభాగంలో కత్తిపోట్లు వున్నారు.
కామన్వెల్త్ గేమ్స్.., బ్యాడ్మింటన్ లో భారత్ కు మరో సిల్వర్ పతకం
బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్ వెల్త్ క్రీడల్లో భారత్ అన్ని విభాగాల్లోనూ అదరగొడుతోంది. ఇప్పటికే వెయిట్ లిప్టింగ్ లో పతకాల పంట పండించగా మరిన్ని విభాగాల్లోనూ భారత ఆటగాళ్లు పతకాలు సాధిస్తున్నారు. తాజాగా బ్యాడ్మింటన్ మిక్సుడ్ టీమ్ ఈవెంట్ లో కిదాంబి శ్రీకాంత్ సిల్వర్ సాధించాడు.