నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

Today Telugu News Live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం... 

9:41 PM IST

జింబాబ్వేతో వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్

జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ 13 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 289 పరుగులు చేయగా... జింబాబ్వే 276 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సికిందర్ రజా 115 పరుగులు చేశాడు. 

8:38 PM IST

రేవంత్ వల్లే కాంగ్రెస్ నాశనం : కోమటిరెడ్డి

రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాశనమైందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీగా ఉన్న మాణికం ఠాగూర్ ను ఈ బాధ్యతల నుండి తప్పించాలని ఆయన కోరారు. కమల్ నాథ్ వంటి నేతలకు ఇంచార్జీ బాధ్యతలు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం 34 ఏళ్లుగా పనిచేస్తున్న తనలాంటి సీనియర్లకు పార్టీలో అవమానం జరుగుతుందన్నారు.

7:41 PM IST

హైకమాండ్‌తో భేటీకి కోమటిరెడ్డి దూరం

కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో నిర్వహించిన కీలక సమావేశానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డుమ్మా కొట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఉదయం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భేటీలో పాల్గొన్న కోమటిరెడ్డి.. ఏఐసీసీ సమావేశానికి డుమ్మా కొట్టి హైదరాబాద్ పయనమయ్యారు. ఈ సమావేశంలో మునుగోడు ఉపఎన్నిక అభ్యర్ధి , పార్టీలో విభేదాలపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. 
 
6:47 PM IST

గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెంచిన ఎల్ఐసీ

ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. గృహ రుణాలపై వడ్డీ రేట్లను సవరించింది. తన ప్రైమ్ లెండింగ్ రేటును 50 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త రేట్లు ఆగస్ట్ 22 నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. తాజా పెంపుతో ఎల్ఐసీ హోమ్ లోన్ వడ్డీ రేట్లు 7.5 శాతం నుంచి 8 శాతానికి చేరాయి. 

6:11 PM IST

గాంధీజీ గురించి పిల్లలకు తెలియాలి: కేసీఆర్

గాంధీజీ గురించి నేటి తరానికి తెలియాల్సి వుందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఎంతోమంది త్యాగాలతోనే స్వాతంత్య్రం వచ్చిందని.. ఉన్మాద స్థితిలోకి దేశాన్ని మారుస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. దేశం అనుకున్నంత పురోగమించడం లేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 

2:56 PM IST

షిండే లాగే నాకూ బిజెపి సీఎం ఆఫర్... ఆప్ ను చీలిస్తే..: మనీష్ సిసోడియా సంచలనం

మహారాష్ట్రలో శివసేన పార్టీని నిలువునా చీల్చి అధికారంలోకి వచ్చినట్లే డిల్లీలో కూడా బిజెపి కుట్ర రాజకీయాలకు తెరలేపిందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇందులో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీని చీలిస్తే తనను ముఖ్యమంత్రి చేస్తామని బిజెపి అధిష్టానం ఆఫర్ చేసినట్లు సిసోడియా పేర్కొన్నారు. ఆ ఆఫర్ తిరస్కరించినందుకే తనను అక్రమ కేసుల్లో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని మనీష్ సిసోడియా ఆరోపించారు. 
 
1:41 PM IST

డిల్లీ లిక్కర్ స్కాంపై కల్వకుంట్ల కవిత రియాక్షన్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు డిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధాలున్నట్లు బిజెపి నాయకులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై కవిత స్పందించారు. బిజెపి తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. కేంద్రంలో అధికారంలో వున్నదే బిజెపియే...  న్ని రకాల దర్యాప్తు సంస్థలు వారి చేతిలోనే వున్నాయి... కాబట్టి  అన్ని రకాలుగా విచారణ చేయవచ్చు... పూర్తిగా సహకరిస్తామని కవిత పేర్కొన్నారు. 

12:47 PM IST

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జ్యూడిసియల్ కస్టడీ పొడిగింపు

మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జ్యూడిసియల్ కస్టడిని సెప్టెంబర్ 5వ తేదీ వరకు పొడిగించింది ప్రత్యేక న్యాయస్థానం. 60 ఏళ్ల ఎంపీ రౌత్ ఇంట్లో సోదాలు జరిపిన ఈడి (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ఆగస్ట్ 1వ తేదీన అరెస్ట్ చేసింది. తాజాగా ఈ కేసును విచారించిన న్యాయస్థానం సంజయ్ రౌత్ జ్యూడిసియల్ కస్టడీని పొడిగించింది. 
 
11:39 AM IST

కేసులేవీ వుండొద్దంటే బిజెపిలో చేరాలట..: డిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా సంచలనం

బిజెపిలో చేరితే తనపై మోపిన అన్ని కేసులను మూసేస్తామని ఆఫర్ చేస్తున్నారంటూ డిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే కుట్రలకు భయపడిపోయి తాను బిజెపిలో చేరే పరిస్థితే లేదని... తాను తప్పు చేయలేదు కాబట్టి ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొని నిలబడతానని సిసోడియా ధీమా వ్యక్తం చేసారు.  

9

10:37 AM IST

భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు... ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

గత 15 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాల ఘనంగా కొనసాగగా ఇవాళ ముగింపు కార్యక్రమం జరగనుంది. ఎల్బీ స్డేడియంలో జరిగే ఈ ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. దీంతో భద్రతా చర్యల్లో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 2గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. 

9:44 AM IST

న్యూడిల్లీలో రైతు సంఘాల మహాపంచాయత్... పోలీస్ నిర్భందంలో రాకేష్ టికాయత్

దేశ రాజధాని న్యూడిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రైతు సంఘాల సమాఖ్య నేడు మహాపంచాయత్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిరుద్యోగ సమస్యపై జరుగుతున్న ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేందుకు డిల్లీకి పయనమైన రైతు నేత రాకేష్ టికాయత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
9:30 AM IST

మునుగోడుపై కాంగ్రెస్ నజర్... నేడు హస్తినకు రేవంత్ రెడ్డి

ఇప్పటికే మునుగోడులో టీఆర్ఎస్, బిజెపిలు భారీ బహిరంగసభలతో బలప్రదర్శన చేయగా... కాంగ్రెస్ అధిష్టానం కూడా మునుగోడుపై దృష్టిపెట్టింది. మునుగోడు ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థి ఎంపిక తదితర అంశాలను చర్చించేందుకు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు సీనియర్లకు అదిష్టానం నుండి పిలుపు వచ్చింది. దీంతో కేసి వేణుగోపాల్ తో భేటీ అయ్యేందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నేడు డిల్లీకి పయనమయ్యారు. 

9:41 PM IST:

జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ 13 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 289 పరుగులు చేయగా... జింబాబ్వే 276 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సికిందర్ రజా 115 పరుగులు చేశాడు. 

8:38 PM IST:

రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాశనమైందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీగా ఉన్న మాణికం ఠాగూర్ ను ఈ బాధ్యతల నుండి తప్పించాలని ఆయన కోరారు. కమల్ నాథ్ వంటి నేతలకు ఇంచార్జీ బాధ్యతలు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం 34 ఏళ్లుగా పనిచేస్తున్న తనలాంటి సీనియర్లకు పార్టీలో అవమానం జరుగుతుందన్నారు.

7:41 PM IST:

కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో నిర్వహించిన కీలక సమావేశానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డుమ్మా కొట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఉదయం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భేటీలో పాల్గొన్న కోమటిరెడ్డి.. ఏఐసీసీ సమావేశానికి డుమ్మా కొట్టి హైదరాబాద్ పయనమయ్యారు. ఈ సమావేశంలో మునుగోడు ఉపఎన్నిక అభ్యర్ధి , పార్టీలో విభేదాలపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. 
 
6:47 PM IST:

ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. గృహ రుణాలపై వడ్డీ రేట్లను సవరించింది. తన ప్రైమ్ లెండింగ్ రేటును 50 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త రేట్లు ఆగస్ట్ 22 నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. తాజా పెంపుతో ఎల్ఐసీ హోమ్ లోన్ వడ్డీ రేట్లు 7.5 శాతం నుంచి 8 శాతానికి చేరాయి. 

6:11 PM IST:

గాంధీజీ గురించి నేటి తరానికి తెలియాల్సి వుందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఎంతోమంది త్యాగాలతోనే స్వాతంత్య్రం వచ్చిందని.. ఉన్మాద స్థితిలోకి దేశాన్ని మారుస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. దేశం అనుకున్నంత పురోగమించడం లేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 

2:57 PM IST:

మహారాష్ట్రలో శివసేన పార్టీని నిలువునా చీల్చి అధికారంలోకి వచ్చినట్లే డిల్లీలో కూడా బిజెపి కుట్ర రాజకీయాలకు తెరలేపిందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇందులో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీని చీలిస్తే తనను ముఖ్యమంత్రి చేస్తామని బిజెపి అధిష్టానం ఆఫర్ చేసినట్లు సిసోడియా పేర్కొన్నారు. ఆ ఆఫర్ తిరస్కరించినందుకే తనను అక్రమ కేసుల్లో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని మనీష్ సిసోడియా ఆరోపించారు. 
 
1:41 PM IST:

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు డిల్లీ లిక్కర్ స్కాంతో సంబంధాలున్నట్లు బిజెపి నాయకులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై కవిత స్పందించారు. బిజెపి తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. కేంద్రంలో అధికారంలో వున్నదే బిజెపియే...  న్ని రకాల దర్యాప్తు సంస్థలు వారి చేతిలోనే వున్నాయి... కాబట్టి  అన్ని రకాలుగా విచారణ చేయవచ్చు... పూర్తిగా సహకరిస్తామని కవిత పేర్కొన్నారు. 

12:47 PM IST:

మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జ్యూడిసియల్ కస్టడిని సెప్టెంబర్ 5వ తేదీ వరకు పొడిగించింది ప్రత్యేక న్యాయస్థానం. 60 ఏళ్ల ఎంపీ రౌత్ ఇంట్లో సోదాలు జరిపిన ఈడి (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ఆగస్ట్ 1వ తేదీన అరెస్ట్ చేసింది. తాజాగా ఈ కేసును విచారించిన న్యాయస్థానం సంజయ్ రౌత్ జ్యూడిసియల్ కస్టడీని పొడిగించింది. 
 
11:40 AM IST:

బిజెపిలో చేరితే తనపై మోపిన అన్ని కేసులను మూసేస్తామని ఆఫర్ చేస్తున్నారంటూ డిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే కుట్రలకు భయపడిపోయి తాను బిజెపిలో చేరే పరిస్థితే లేదని... తాను తప్పు చేయలేదు కాబట్టి ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొని నిలబడతానని సిసోడియా ధీమా వ్యక్తం చేసారు.  

9

10:37 AM IST:

గత 15 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాల ఘనంగా కొనసాగగా ఇవాళ ముగింపు కార్యక్రమం జరగనుంది. ఎల్బీ స్డేడియంలో జరిగే ఈ ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. దీంతో భద్రతా చర్యల్లో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 2గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. 

9:44 AM IST:

దేశ రాజధాని న్యూడిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రైతు సంఘాల సమాఖ్య నేడు మహాపంచాయత్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిరుద్యోగ సమస్యపై జరుగుతున్న ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనేందుకు డిల్లీకి పయనమైన రైతు నేత రాకేష్ టికాయత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
9:31 AM IST: