Telugu News Live : నేటి ముఖ్యాంశాలివే...

Today Telugu News Live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

4:19 PM IST

మహారాష్ట్ర శాసనమండలి లీడర్ ఆఫ్ ది హౌస్ గా దేవేంద్ర పడ్నవీస్

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర పడ్నవిస్ ను రాష్ట్ర శాసనమండలిలో లీడర్ ఆఫ్ ది హౌస్ గా నియమించినట్లు ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ప్రకటించారు. 
 
3:46 PM IST

గోదావరి మహోగ్రరూపం... భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద గోదావరి మళ్ళీ మహోగ్రరూపం దాల్చింది. భారీగా వరదనీరు నదిలోకి చేరడంతో నీటిమట్టం 54.60 అడుగులకు చేరింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. 
 
2:59 PM IST

సీఎం నితీష్ తో సహా.... బిహార్ మంత్రుల్లో 72శాతం క్రిమినల్ కేసులు: ఏడిఆర్

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తో పాటు నూతన మంత్రుల్లో 72 శాతం మందిపై క్రిమినల్ కేసులు వున్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడిఆర్) ప్రకటించింది.
 
2:37 PM IST

బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీలోనూ ఎంపీ లక్ష్మణ్ కు చోటు

15మంది సభ్యులతో ఏర్పాటుచేసిన బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీలోనూ తెలంగాణ నుండి ఎంపీ లక్ష్మణ్ కు చోటుదక్కింది. 

2:06 PM IST

బిజెపి నూతన పార్లమెంట్ బోర్డ్ ఏర్పాటు... తెలంగాణ నుండి ఎంపీ లక్ష్మణ్ కు చోటు

11 మంది సభ్యులతో బిజెపి నూతన పార్లమెంట్ బోర్డును ఆ పార్టీ జాతీయాధ్యక్షులు జెపి నడ్డా ప్రకటించారు.  ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు యడ్యూరప్ప, సర్బానంద సోనోవాల్, సుధా యాదవ్ కు ఈ బోర్డులో చోటుదక్కింది. తెలంగాణ నుండి ఎంపీ లక్ష్మణ్ కు పార్లమెంట్ బోర్డులో చోటు కల్పించారు. 
 
12:27 PM IST

తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తప్పదా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్ వంటి నాయకులు పార్టీని వీడగా తాజాగా మరో సీనియర్ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పార్టీని వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో వున్న ఆయన ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ పదవితో పాటు పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

10:47 AM IST

జమ్మూలో ఆరుగురు కుటుంబసభ్యులు అనుమానాస్పద మృతి

జమ్మూలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో ఆరుగురు కుటుంబసభ్యులు అనుమానాస్పద రీతితో మృతిచెందారు. జమ్మూలోని సిద్రా తవివిహార్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. 
 
10:23 AM IST

భారత్ లో గణనీయంగా తగ్గిన రోజువారి కరోనా కేసులు

భారతదేశంలో రోజువారి కరోనాకేసులు గణనీయంగా తగ్గాయి. గత 24 గంటల్లో పదివేలకు తక్కువగా కేవలం 9,062 కొత్తకేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,05,058 కి చేరాయి.
 
9:40 AM IST

తెలుగురాష్ట్రాల్లో మళ్లీ గోదావరి ఉగ్రరూపం

ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తెలుగురాష్ట్రాల్లో గోదావరి నది మళ్ళి మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 50 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. ఇక ధవళేశ్వరం వద్ద కూడా రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం దవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 14.20 లక్షల క్యూసెక్కులుగా వుంది. 

9:27 AM IST

జమ్మూ కాశ్మీర్ ప్రచార కమిటీ ఛైర్మన్ పదవికి గులాంనబీ రాజీనామా

జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మీర్ రాజీనామా చేయగా తాజాగా మాజీ కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ కూడా షాకిచ్చారు. జమ్మూ కాశ్మీర్ ప్రచార కమిటీ ఛైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేసారు. 

4:19 PM IST:

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర పడ్నవిస్ ను రాష్ట్ర శాసనమండలిలో లీడర్ ఆఫ్ ది హౌస్ గా నియమించినట్లు ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ప్రకటించారు. 
 
3:46 PM IST:

భద్రాచలం వద్ద గోదావరి మళ్ళీ మహోగ్రరూపం దాల్చింది. భారీగా వరదనీరు నదిలోకి చేరడంతో నీటిమట్టం 54.60 అడుగులకు చేరింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. 
 
2:59 PM IST:

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తో పాటు నూతన మంత్రుల్లో 72 శాతం మందిపై క్రిమినల్ కేసులు వున్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడిఆర్) ప్రకటించింది.
 
3:04 PM IST:

15మంది సభ్యులతో ఏర్పాటుచేసిన బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీలోనూ తెలంగాణ నుండి ఎంపీ లక్ష్మణ్ కు చోటుదక్కింది. 

2:06 PM IST:

11 మంది సభ్యులతో బిజెపి నూతన పార్లమెంట్ బోర్డును ఆ పార్టీ జాతీయాధ్యక్షులు జెపి నడ్డా ప్రకటించారు.  ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు యడ్యూరప్ప, సర్బానంద సోనోవాల్, సుధా యాదవ్ కు ఈ బోర్డులో చోటుదక్కింది. తెలంగాణ నుండి ఎంపీ లక్ష్మణ్ కు పార్లమెంట్ బోర్డులో చోటు కల్పించారు. 
 
12:27 PM IST:

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్ వంటి నాయకులు పార్టీని వీడగా తాజాగా మరో సీనియర్ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పార్టీని వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తితో వున్న ఆయన ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ పదవితో పాటు పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

10:47 AM IST:

జమ్మూలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో ఆరుగురు కుటుంబసభ్యులు అనుమానాస్పద రీతితో మృతిచెందారు. జమ్మూలోని సిద్రా తవివిహార్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. 
 
10:24 AM IST:

భారతదేశంలో రోజువారి కరోనాకేసులు గణనీయంగా తగ్గాయి. గత 24 గంటల్లో పదివేలకు తక్కువగా కేవలం 9,062 కొత్తకేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,05,058 కి చేరాయి.
 
9:41 AM IST:

ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తెలుగురాష్ట్రాల్లో గోదావరి నది మళ్ళి మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 50 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. ఇక ధవళేశ్వరం వద్ద కూడా రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం దవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 14.20 లక్షల క్యూసెక్కులుగా వుంది. 

9:28 AM IST: