నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

Today telugu news live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

9:14 PM IST

ఛత్తీస్‌గడ్ పోలీస్ శాఖలో ట్రాన్స్‌జెండర్లకు కొలువులు

ఛత్తీస్‌గడ్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర పోలీస్ విభాగంలోని బస్తర్ ఫైటర్స్ ప్రత్యేక యూనిట్‌లో 9 మంది ట్రాన్స్‌జెండర్లకు స్థానం కల్పించింది ప్రభుత్వం. ఈ బస్తర్ ఫైటర్స్ యూనిట్‌ను మావోల ప్రాబల్యం ఎక్కువగా వున్న ప్రాంతాల్లో మోహరిస్తారు. ఇటీవల పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన ఈ ట్రాన్స్‌జెండర్లకు రాయపూర్‌లో శిక్షణ ఇస్తారు. 

8:33 PM IST

విశాఖలో సైకో కిల్లర్ అరెస్ట్

విశాఖ జిల్లా పెందుర్తిలో వరుస హత్యల మిస్టరీని పోలీసులు ఛేదించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు పోలీసులకు సవాల్‌గా మారిన సైకో పట్టుబడ్డాడు. నిందితుడిని రాంబాబుగా గుర్తించారు. భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం, కుటుంబం దూరం కావడంతో ఆడవాళ్లపై కక్షగట్టి వాళ్లని చంపడమే లక్ష్యంగా పెట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. 

7:31 PM IST

కోదండరామ్‌తో కాంగ్రెస్ నేతల భేటీ

మునుగోడు ఉపఎన్నికకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రొఫెసర్ కోదండరామ్‌తో కాంగ్రెస్ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. టీఆర్ఎస్, బీజేపీలు క్షేత్రస్థాయిలో నేతలను ఆకర్షిస్తూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతుండటంతో .. కాంగ్రెస్ తన సొంతబలం, క్యాడర్‌తోనే సత్తా చాటాలని భావిస్తోంది. 

6:45 PM IST

‘‘ ఉచితాల’’పై మరోసారి కేజ్రీవాల్ వ్యాఖ్యలు

ఉచితాలకు సంబంధించి మరోసారి కేంద్రానికి చురకలు వేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. దేశంలో విద్య, వైద్య సౌకర్యాలను మెరుగుపర్చాల్సిన అవసరం వుందన్నారాయన. ఈ విషయంలో అవసరమైతే కేంద్రంతో కలిసి పనిచేస్తామని సీఎం పేర్కొన్నారు. భారత్‌ను ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశంగా చూడాలన్నదే తన కల అన్నారు కేజ్రీవాల్. 

6:05 PM IST

మంత్రి ఆడియో వైరల్.. చిక్కుల్లో బొమ్మై

కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై చిక్కుల్లో పడ్డారు. ఆయన కేబినెట్‌లోని న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి చేసిన వ్యాఖ్యల ఆడియో క్లిప్ రాష్ట్రంలో వైరల్ అవుతోంది. ఈ వ్యవహారం సీఎం మెడకు చుట్టుకునే అవకాశాలు వున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

3:42 PM IST

వికారాబాద్ కు చేరుకున్న సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్ కు చేరుకున్నారు. నూతనంగా ఏర్పడిన ఈ జిల్లాలో నిర్మించిన కలెక్టర్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అలాగే టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని కూడా సీఎం ప్రారంభించనున్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నారు. 

3:15 PM IST

ఏపీలో ధార్మిక పరిషత్ ఏర్పాటు... జగన్ సర్కార్ ఉత్తర్వులు

ఏపీలో ధార్మిక పరిషత్ ఏర్పాటుచేస్దూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీచూసింది. దేవాదాయశాఖ మంత్రి ఛైర్మన్ గా ఇద్దరు మఠాధిపతులు, ఇద్దరు ఆగమ పండితులు, రిటైర్డ్ హైకోర్టు జడ్జి, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, దేవాదాయ శాఖ అధికారులు ఇలా 21మంది సభ్యులతో ధార్మిక పరిషత్ ఏర్పాటుచేసింది. 

2:01 PM IST

కర్నూల్ మహిళకు తలుపుతట్టిన అదృష్టం... పొలంలో దొరికిన వజ్రం

కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం జొన్నలగిరి గ్రామానికి చెందిన మహిళకు అదృష్టం తలుపుతట్టింది. ఓ మహిళ వ్యవసాయ పని చేస్తుండగా వజ్రం లభించింది. ఈ వజ్రం విలువ వేల రూపాయలు వుంటుందని అంచనా వేస్తున్నారు. 

12:57 PM IST

బిహార్ మంత్రివర్గ విస్తరణ... నేడు ప్రమాణస్వీకారం చేసింది వీరే

ఎన్డీఏ తో తెగతెంపుల తర్వాత ఇటీవలే మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నితీష్ కుమార్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఆర్జెడి నాయకులు మహ్మద్ జమా ఖాన్, జయంత రాజ్ తో పాటు జేడియూకు చెందిన జితేంద్ర కుమార్ రాయ్, అనితా దేవి, సుధాకర్  సింగ్ తాజాగా మంత్రివర్గంలో చోటుదక్కింది. 

12:02 PM IST

బిహార్ బిజెపిలో విషాదం... మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే మృతి

మిత్రపక్షం ఎన్డీఏ కు దూరం కావడంతో బిహార్ లో అధికారాన్ని కోల్పోయిన బిజెపి షాక్ లో వుండగా మరో విషాదం చోటుచేసుకుంది. బిహార్ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సుభాష్ సింగ్ మృతిచెందాడు. గోపాల్ గంజ్ కు చెందిన ఎమ్మెల్యే సుభాష్ అనారోగ్యంతో డిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 
 
11:19 AM IST

గోదావరి ఉగ్రరూపం... భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద గోదావరి నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. నీటిమట్టం 50.6 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. 

10:42 AM IST

మాజీ ప్రధాని వాజ్ పేయి వర్ధంతి... రాష్ట్రపతి, ప్రధాని నివాళి

మాజీ ప్రధాని అటల్ బిహార్ వర్థంతి కార్యక్రమం డిల్లీలోని సదైవ్ అటల్ మొమోరియల్ లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ లతో పాటు కేంద్ర మంత్రులు ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వాజపేయికి నివాళి అర్పించారు. 

10:08 AM IST

భారత్ లో పదివేల దిగువకు రోజువారి కరోనా కేసులు

భారత్ రోజువారి  కరోనా కేసులు భారీగా తగ్గాయి. చాలారోజుల తర్వాత పదివేల దిగువకు అంటూ 8,813 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,11,252కు చేరింది. 

9:33 AM IST

డిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ప్రధాని మోదీ భర్త్ డే విషెస్

డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విషెస్ తెలిపారు. అతడి ఆయురారోగ్యాలతో జీవించి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపకోవాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నానంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేసారు. 

9:26 AM IST

బంగాళాఖాతంలో అల్పపీడనం... తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన

రానున్న నాలుగురోజులు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిషాలో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండి) హెచ్చరించింది. ఇప్పటికే బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండగా ఈ నెల 19వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపారు. దీని ప్రభావం ఒడిషాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించారు. ఏపీ, తెలంగాణపై కూడా దీని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించారు. 

9:14 PM IST:

ఛత్తీస్‌గడ్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర పోలీస్ విభాగంలోని బస్తర్ ఫైటర్స్ ప్రత్యేక యూనిట్‌లో 9 మంది ట్రాన్స్‌జెండర్లకు స్థానం కల్పించింది ప్రభుత్వం. ఈ బస్తర్ ఫైటర్స్ యూనిట్‌ను మావోల ప్రాబల్యం ఎక్కువగా వున్న ప్రాంతాల్లో మోహరిస్తారు. ఇటీవల పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన ఈ ట్రాన్స్‌జెండర్లకు రాయపూర్‌లో శిక్షణ ఇస్తారు. 

8:33 PM IST:

విశాఖ జిల్లా పెందుర్తిలో వరుస హత్యల మిస్టరీని పోలీసులు ఛేదించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు పోలీసులకు సవాల్‌గా మారిన సైకో పట్టుబడ్డాడు. నిందితుడిని రాంబాబుగా గుర్తించారు. భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం, కుటుంబం దూరం కావడంతో ఆడవాళ్లపై కక్షగట్టి వాళ్లని చంపడమే లక్ష్యంగా పెట్టుకున్నాడని పోలీసులు తెలిపారు. 

7:31 PM IST:

మునుగోడు ఉపఎన్నికకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రొఫెసర్ కోదండరామ్‌తో కాంగ్రెస్ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. టీఆర్ఎస్, బీజేపీలు క్షేత్రస్థాయిలో నేతలను ఆకర్షిస్తూ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతుండటంతో .. కాంగ్రెస్ తన సొంతబలం, క్యాడర్‌తోనే సత్తా చాటాలని భావిస్తోంది. 

6:45 PM IST:

ఉచితాలకు సంబంధించి మరోసారి కేంద్రానికి చురకలు వేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. దేశంలో విద్య, వైద్య సౌకర్యాలను మెరుగుపర్చాల్సిన అవసరం వుందన్నారాయన. ఈ విషయంలో అవసరమైతే కేంద్రంతో కలిసి పనిచేస్తామని సీఎం పేర్కొన్నారు. భారత్‌ను ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశంగా చూడాలన్నదే తన కల అన్నారు కేజ్రీవాల్. 

6:05 PM IST:

కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై చిక్కుల్లో పడ్డారు. ఆయన కేబినెట్‌లోని న్యాయశాఖ మంత్రి జేసీ మధుస్వామి చేసిన వ్యాఖ్యల ఆడియో క్లిప్ రాష్ట్రంలో వైరల్ అవుతోంది. ఈ వ్యవహారం సీఎం మెడకు చుట్టుకునే అవకాశాలు వున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

3:42 PM IST:

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్ కు చేరుకున్నారు. నూతనంగా ఏర్పడిన ఈ జిల్లాలో నిర్మించిన కలెక్టర్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అలాగే టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని కూడా సీఎం ప్రారంభించనున్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణానికి కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నారు. 

3:16 PM IST:

ఏపీలో ధార్మిక పరిషత్ ఏర్పాటుచేస్దూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీచూసింది. దేవాదాయశాఖ మంత్రి ఛైర్మన్ గా ఇద్దరు మఠాధిపతులు, ఇద్దరు ఆగమ పండితులు, రిటైర్డ్ హైకోర్టు జడ్జి, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, దేవాదాయ శాఖ అధికారులు ఇలా 21మంది సభ్యులతో ధార్మిక పరిషత్ ఏర్పాటుచేసింది. 

2:01 PM IST:

కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం జొన్నలగిరి గ్రామానికి చెందిన మహిళకు అదృష్టం తలుపుతట్టింది. ఓ మహిళ వ్యవసాయ పని చేస్తుండగా వజ్రం లభించింది. ఈ వజ్రం విలువ వేల రూపాయలు వుంటుందని అంచనా వేస్తున్నారు. 

12:57 PM IST:

ఎన్డీఏ తో తెగతెంపుల తర్వాత ఇటీవలే మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నితీష్ కుమార్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఆర్జెడి నాయకులు మహ్మద్ జమా ఖాన్, జయంత రాజ్ తో పాటు జేడియూకు చెందిన జితేంద్ర కుమార్ రాయ్, అనితా దేవి, సుధాకర్  సింగ్ తాజాగా మంత్రివర్గంలో చోటుదక్కింది. 

12:03 PM IST:

మిత్రపక్షం ఎన్డీఏ కు దూరం కావడంతో బిహార్ లో అధికారాన్ని కోల్పోయిన బిజెపి షాక్ లో వుండగా మరో విషాదం చోటుచేసుకుంది. బిహార్ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సుభాష్ సింగ్ మృతిచెందాడు. గోపాల్ గంజ్ కు చెందిన ఎమ్మెల్యే సుభాష్ అనారోగ్యంతో డిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 
 
11:19 AM IST:

భద్రాచలం వద్ద గోదావరి నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. నీటిమట్టం 50.6 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. 

10:43 AM IST:

మాజీ ప్రధాని అటల్ బిహార్ వర్థంతి కార్యక్రమం డిల్లీలోని సదైవ్ అటల్ మొమోరియల్ లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ లతో పాటు కేంద్ర మంత్రులు ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వాజపేయికి నివాళి అర్పించారు. 

10:08 AM IST:

భారత్ రోజువారి  కరోనా కేసులు భారీగా తగ్గాయి. చాలారోజుల తర్వాత పదివేల దిగువకు అంటూ 8,813 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,11,252కు చేరింది. 

9:33 AM IST:

డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విషెస్ తెలిపారు. అతడి ఆయురారోగ్యాలతో జీవించి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపకోవాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నానంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేసారు. 

9:26 AM IST: