తండ్రి ఫోన్ నుంచి ఓ మైనర్ బాలుడు పోర్న్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో.. సదరు తండ్రీ, కొడుకులు ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడులో  ఓ చైల్డ్ ఫోర్న్ వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ విషయంలో పోలీసుల దృష్టికి వచ్చింది. దానిని ఎవరు వీడియో తీశారు.. ఎవరు సోషల్ మీడియాలో షేర్ చేశారు అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.

నిందితుడు ఓ 16ఏళ్ల మైనర్ బాలుడు అని తెలిసి పోలీసులు ఖంగుతిన్నారు. అతను ఇటీవల 9వ తరగతి పూర్తి చేశాడు. కాగా.. తన ఫేస్ బుక్ ఖాతా నుంచి బాలుడు ఆ వీడియోలను షేర్ చేయడం విశేషం. అయితే.. తన ఫేస్ బుక్ ఖాతాను తన తండ్రి ఫోన్ లో లాగిన్ అయ్యి.. ఆ తర్వాత ఆ వీడియోలను షేర్ చేశాడు.

ఈ ఘటనలో పోలీసులు సదరు మైనర్ బాలుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అదేవిధంగా బాలుడి తండ్రిని కూడా అరెస్టు చేశారు. అనంతరం ఆ ఫోన్, బాలుడు వాడిన ల్యాప్ టాప్ ని సీజ్ చేసినట్లు వారు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సదరు వీడియోని సోషల్ మీడియా నుంచి తొలగించినట్లు చెప్పారు.