మైసూరు: శుభ్రత కోసం భార్య పాటించే నియమాలతో విసిగిపోయిన ఓ వ్యక్తి తీవ్రమైన నిర్ణయానికి ఒడిగట్టాడు. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ మరణించగా, పిల్లులు అనాథలయ్యారు. రోజుకు పదిసార్లు స్నానం చేయాలి, కరెన్సీ నోట్లను కడిగి ఆరబెట్టాలి, ఇంట్లోకి ఎవరు వచ్చినా స్నానం చేసి ఇంట్లోకి రావాలి... ఇవీ భర్తకు ఓ భార్య పెట్టిన షరతులు. 

ఆ వేధింపులను భరించలేక ఆ భర్త భార్యను నరికి చంపాడు.. ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నడాు. ఈ సంఘటన మంగళవారం కర్ణాటకలోని మైసూరులో మంగళవారం జరిగింది. శాంతమూర్తి (40), పుట్టుమమి (38) భార్యాభర్తలు, వారికి 15 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి 12, 7 ఏళ్ల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

పుట్టమణి పవిత్రతను ఎక్కువగా పాటించడంలో భాగంగా భర్తకు ఆ షరతులన్నీ పెట్టింది. కాలకృకత్యాలకు వెళ్లినా, బయటి వ్యక్తులను స్పర్శించినా స్నానం చేయాలని ఆమె షరతు పెట్టింది. దాని వల్ల రోజుకు పది సార్లయినా వారు స్నానం చేయాల్సి వచ్చేది. దానివల్ల పిల్లలు అనారోగ్యానికి గురయ్యేవారు. 

ఆమె షరతుల వల్ల భార్యాభర్తల మధ్య తరుచుగా గొడవలు జరిగేవి. మంగళవారం భార్యాభర్తలు పొలం పనులకు వెళ్లారు. అక్కడ కూడా శుభ్రత, పవిత్రత విషయాలపై ఇరువురి మధ్య గొడవ జరిగింది. కోపం నిగ్రహించుకోలేక భర్త శాంతమూర్తి పొలంలో ఉన్న కొడవలితో భార్యను నరికి చంపాడు. ఆ తర్వాత శాంతమూర్తి ఇంటికి వెళ్లి ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయాడు. 

సాయంత్రం బడి నుంచి పిల్లలకు తండ్రి ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. భయంతో పిల్లలు పక్కిళ్లవారికి ఆ విషయం చెప్పారు. చట్టుపక్కలవాళ్లు వచ్ిచ చూశారు. ఆ తర్వాత పుట్టమణి కోసం గాలించారు. పొలాల్లో ఆమె శవమై కనిపించింది.