మోడలింగ్ లో అవకాశం ఇస్తామని చెప్పి... ఓ 19ఏళ్ల బాలికను ట్రాప్ చేశారు. దాదాపు ఆరు నెలలపాటు బాలికకు నరకం చూపించారు. దాదాపు 30మంది బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కాగా.... బాలిక ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనకు సంబంధించి పూర్తి వివారాల్లోకి వెళితే.... తిర్సూర్ ప్రాంతానికి చెందిన 19ఏళ్ల బాలికకకు ఈ ఏడాది జనవరిలో తొలిసారిగా ఆన్ లైన్ లో మోడలింగ్ చేసే అవకాశం లభించింది. వడనపల్లికి చెందిన  చిర్యాత్ చంద్రమోహన్ అనే వ్యక్తి బాలికను మొదట ఈ వలలోకి లాగాడు.

మోడలింగ్ చేయాలంటూ బాలికను ఓ దంపతుల సహాయంతో హోటల్ గదికి రప్పించాడు. ఆ రోజు నుంచి బాలికను బంధించి... సెక్స్ రాకెట్ లో భాగం చేశాడు. గదిలో సీక్రెట్ కెమేరా పెట్టి.. బాలికను నగ్నంగా ఫోటోలు చిత్రీకరించాడు. ఆ ఫోటోలను చూపించి తర్వాత బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.

ఆరు నెలలపాటు... బాలికను నారా రకాలుగా హింసించారు. దాదాపు 30మందికి పైగా బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు  చెబుతున్నారు. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 13మందితో కలిసి బృందంగా ఏర్పడి దర్యాప్తు చేశారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేయగా... వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. 

తర్వాత పోలీసులు బాలిక తల్లిదండ్రుల సమాచారం కనుక్కోని వారికి బాలికను అప్పగించారు. బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. బాలికను వివిధ ప్రాంతాలకు తిప్పుతూ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. బాలిక ఇంతకాలం ఇన్ని ఇబ్బందులు పడినట్లు ఆమె తల్లిదండ్రులకు తెలియకపోవడం గమనార్హం.