న్యూఢిల్లీ: హర్యానా డ్యాన్సర్ పై అత్యాచారం చేసిన కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ సంఘటన ఢిల్లీలోని ఖజూరి ఖాస్ ప్రాంతంలో ఐదు రోజుల క్రితం జరిగింది. హర్యానాకు చెందిన డ్యాన్సర్ ఖజూరీ ఖాస్ లోని ఓ ప్రదర్శనకు వచ్చింది. 

ఆమెను ఉచ్చలోకి లాగి ముగ్గురు వ్యక్తులపై ఆమె అత్యాచారం చేశారు. బాధితురాలు హర్యానా నుంచి బస్సులో కాశ్మీరీ గేట్ ఐఎస్ బిటీకి వచ్ిచంది. ప్రదర్శన జరిగే చోటుకి తీసుకుని వెళ్తామని చెప్పి ఆమెను వారు అక్కడ కారులో ఎక్కించుకున్నారు. 

అయితే, వారు ఆమెను బావనలోని నిర్మానుష్య ప్రదేశంలో గల ఓ ఇంటికి తీసుకుని వెళ్లారు. ఆమెపై అక్కడ అత్యాచారం చేశారు ఆ  తర్వాత ఖజూరి చౌక్ వద్ద పడేసి పారిపోయారు. ఆమె సెల్ ఫోన్ ను కూడా తీసుకుని వెళ్లారు. నిందితులను లోకేష్ (21), ఓం (25), హృషికేశ్ లుగా గుర్తించి పోలీసులు వారిని అరెస్టు చేశారు.